
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యూడిషయల్ కస్టడీ నేటితో ముగియనుంది. జ్యుడియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు నేడు హాజరుకానున్నారు. మరోసారి కవితకు సీబీఐ కేసులో జ్యూడిషియల్ కస్టడి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను అరెస్టు చేసింది.
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జ్వరం, గైనిక్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment