![Christian Michel sent to 10-day judicial custody - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/23/augusta.jpg.webp?itok=CKhoUIZc)
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ముందు మిషెల్‌ను ఈడీ ప్రవేశపెట్టి 15 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో కోర్టు ముందుగా 15 నిమిషాలపాటు మిషెల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం కోర్టు అనుమతితో ఈడీ మిషెల్‌ను అరెస్టు చేసింది. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ముడుపులకు సంబంధించి తమ విచారణలో 3 కోట్ల యూరోల గురించే సమాచారం ఉందనీ, సీబీఐ మాత్రం ఆ మొత్తం 3.7 కోట్ల యూరోలంటోంది కాబట్టి ఈ వ్యత్యాసంపై లెక్క తేల్చేందుకు తాము మిషెల్‌ను అరెస్టు చేయాల్సి ఉందని గతంలో ఈడీ కోర్టును కోరింది.
Comments
Please login to add a commentAdd a comment