MLC Kavitha: కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు | Delhi Liquor Case: MLC Kavitha ED Case Bail Plea Hearings Updates And Top Headlines - Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam Case: కవిత కస్టడీ పొడిగింపు

Published Tue, Apr 23 2024 9:04 AM | Last Updated on Tue, Apr 23 2024 3:46 PM

Delhi Liquor Case: MLC Kavitha ED Case Bail Plea Hearings Updates - Sakshi

ఢిల్లీ, సాక్షి: లిక్కర్‌ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్‌ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యూడీషియల్‌ కస్టడీ ముగియగా.. తీహార్‌ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. 


 

కవిత బెయిల్‌పై వాదనలు

లిక్కర్‌ స్కాంలో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్‌ చేసిందని, తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు.

కవిత బెయిల్  పిటిషన్‌పై ఈడి వాదనలు

  • కవితను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఎప్పుడూ చెప్పలేదు
  • మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు
  • అరెస్టు చేయమని మేము కోర్టుకు అండర్ టేకింగ్ ఇవ్వలేదు
  • కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వమని చెప్పాం
  • ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు
  • దీని అర్థం అంతా చట్టబద్దంగా జరిగింది
  • సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది
  • ఈ స్కాంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది
  • కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు
  • దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు
  • పాలసీని తమకు అనుకూలంగా మార్చారు
  • ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారు
  • ఈడి జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది
  • ట్రాన్సిట్ రిమాండ్ లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు
  • అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచాము
  • పిఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు
  • ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు
  • అరుణ్ పిళ్లై కవితకు బినామీ
  • ఇండో స్పిరిట్ లో 33.5% అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు
  • ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది
  • డీల్ లో భాగంగా రూ.100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో  అంగీకరించారు
  • బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో కూడా ఈ విషయం బయటపడింది
  • ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది
  • ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు
  • వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాలు ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు  అని గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి
  • ఈ కేసులో కూడా కవిత నేరం చేయలేదు అనే దానికి ఎలాంటి ఆధారం లేదు
  • ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది
  • ఈ కేసులో కవితకు పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి సాక్ష్యాలున్నాయి

కవిత తరపు లాయర్‌ వాదనలు

మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు.  అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. 
ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని  ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. 

మరోవైపు లిక్కర్‌ కేసులో సీబీఐ ఏప్రిల్‌ 11వ తేదీన కవితను అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 వ తేదీ తీర్పు వెల్లడించన్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement