సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ జైలులో విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను బుధవా రం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ రిప్లై ఇవ్వలేదని న్యాయవాది నితీష్ రాణా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
రిప్‌లై ఇవ్వా లని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇవ్వకుండానే కవితను విచారించారన్నారు. శనివారం సాయంత్రం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సీబీఐ బేఖా తరు చేసిందన్నారు. దీనిపై తమ వాదనలు వినాలని కోరారు. అప్పటి వరకూ విచారణ అనుమతిపై స్టే ఇవ్వాలని కోరారు.
అనంతరం, సీబీఐ తరఫు న్యాయ వాది వాదనలు విని పిస్తూ కవితను విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే శనివారం మధ్యాహ్నం జైలులో విచారించామని ఈ నేపథ్యంలో కౌంటరు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనల తర్వాత... భవిష్యత్తులో విచారణ చేస్తే ముందుగా అప్లికేషన్ దాఖలు చేయాలని సీబీఐకు న్యాయమూర్తి సూచించారు. ఈ నెల 26న విచారణ చేపడతామని న్యాయమూర్తి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment