న్యూఢిల్లీ: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(ఏఐఐపీఎల్), ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్రస్ట్(ఐఏఐటీ) తదితర సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రిన్సిపల్ సిటీ సివిల్, సెషన్స్ జడ్జి కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై సంబంధిత సంస్థలకు కోర్టు సమన్లు జారీ చేసిందని ఈడీ తెలిపింది.
విదేశీ మారక ద్రవ్య చట్టం(ఫెమా)ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆమ్నెస్టీ ఇండియా, సంస్థ మాజీ చీఫ్ ఆకార్ పటేల్‌లకు శుక్రవారం ఈడీ రూ.61 కోట్లకు పైగా జరిమానా విధించింది. ఈడీ ఆరోపణలపై ఆమ్నెస్టీ ఇండియా స్పందించింది. కఠిన చట్టాలతో విమర్శకులను అణచివేయడం ప్రస్తుత భారత ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆరోపించింది. మనీల్యాండరింగ్ ఆరోపణల విషయం కోర్టులోనే తేల్చుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment