Money Laundering Case: ED Attaches Assets Worth RS 7 Crore Of Jacqueline Fernandez - Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఈడీ షాక్‌

Published Sat, Apr 30 2022 2:49 PM | Last Updated on Sat, Apr 30 2022 3:48 PM

ED Attaches  Assets Worth RS 7 Crore Of Jacqueline Fernandez - Sakshi

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) షాక్‌ ఇచ్చింది. జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను అచాట్‌ చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. 

రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్‌ సింగ్‌, శివిందర్‌ సింగ్‌కు బెయిల్‌ ఇప్పిస్తామని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూల్‌ చేశాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌. ఆ తర్వాత బెయిల్‌ విషయాన్ని దాటవేశాడు. దీంతో శివిందర్‌ సింగ్‌ భార్య అదితి సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ అరెస్ట్‌ చేశారు. ద‌ర్యాప్తులో భాగంగా జాక్వెలిన్‌ ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడీ విచారణకు హాజరైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement