ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా నాలుగోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 18 విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. జనవరి 3న మూడోసారి ఈడీ ఇచ్చిన సమన్ల విచారణకు సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈడీ పంపిన సమన్లు చట్టపరమైనవి కావని, కేవలం తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జారీ చేసినవి కేజ్రీవాల్ మండిపడ్డ విషయం తెలిసిందే.
ఇక గతంలో ఈడీ నవంబర్2, డిసెంబర్ 21న సీఎం కేజ్రీవాల్‌కు.. రెండుసార్లు సమన్లు పంపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఈసారైనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించి విచారణ వెళ్లుతారో? లేదో? అని ఆప్ పార్టీలో చర్చజరుగుతోంది.
చదవండి: తిరస్కరణ సీఎంను కాదు.. మాజీ సీఎంను: శివరాజ్ సింగ్ చౌహన్
Comments
Please login to add a commentAdd a comment