సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నోటీసులిచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రణవ్ జువెలర్స్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ నుంచి అందుకున్న చెల్లింపుల వివరాలను సమర్పించాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చెన్నైలో విచారణకు హాజరు కావాలని సూచించింది.
కాగా.. తిరుచ్చికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థపై ఈ కేసు నమోదైంది. ఆ సంస్థకు ప్రకాశ్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నందునే విచారణకు పిలిచింది. కాగా.. గత కొంతకాలంగా బీజేపీపై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈడీ దాడులు..
తిరుచ్చికి చెందిన ప్రణవ్ జువెలర్స్ కంపెనీపై నవంబర్ 20న ఈడీ దాడులు చేసింది. ఆ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment