న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఆదివారం ఒకే రోజు కేజ్రీవాల్‌కు రెండు కేసుల్లో ఈడీ సమన్లు పంపడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో తొమ్మిదోసారి సమన్లు జారీ చేయగా ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని మరో సమన్లు పంపింది. లిక్కర్ కేసులో మార్చ్ 21 విచారణకు పిలవగా, జల్ బోర్డు కేసులో 18న రావాలని ఈడీ కోరింది.
కాగా, లిక్కర్ కేసులో విచారణ కోసం గతంలో ఈడీ పంపిన ఎనిమిది సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. విచారణకు హాజరవలేదు. దీంతో ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌పై ఫిర్యాదు కూడా చేసింది. అయితే సమన్లకు స్పందించని కేసులో కేజ్రీవాల్‌కు శనివారమే(మార్చ్ 16) కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో బెయిల్ తీసుకున్న మరుసటి రోజే లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు పంపడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment