Summons Issued to Vijay Sethupathi After Maha Gandhi Files Complaint: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, అతడి మెనేజర్ జాన్సన్‌లకు చెన్నై సైదాపేట మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు జారీ చేసింది. విజయ్ బృందం తనపై దాడి చేసిందంటూ మహా గాంధీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయ్‌కి సమన్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల ఎయిర్‌పోర్టులో విజయ్ సేతుపతిపై జరిగిన దాడి సంఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయ్‌ని తన్నేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఆ వ్యక్తే ఈ మహా గాంధీ.
చదవండి: నాకు ‘పుష్ప’ కథ తెలియదు: రష్మిక షాకింగ్ కామెంట్స్
అయితే గత నెల జాతీయ అవార్డు అందుకునేందుకు ఢిల్లీ వెళ్లిన విజయ్ నవంబర్ 2న చెన్నైకి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో చెన్నై ఎయిరోపోర్టులో విజయ్‌ని చూసిన మహా గాంధీ ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో విజయ్ టీంలో ఓ వ్యక్తి తనతో అభ్యంతరకరంగా వ్యవహరించి తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినట్లు మహా గాంధీ ఆరోపిస్తూ కోర్టులో అతడు పటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో విజయ్ టీంకు, తనకు మధ్య ఘర్షణ జరిగిందని, ఈ వాగ్వాదం అనంతరం బెంగళూరు విమానాశ్రయం వెలుపల విజయ్ మేనేజర్ జాన్సన్ తనపై దాడి చేసినట్టు మహాగాంధీ చెన్నై కోర్టులో ఫిర్యాదు చేశాడు. దీంతో విజయ్, అతడి మేనేజర్‌కు చెన్నై కోర్టు నోటీసులు పంపింది.
Comments
Please login to add a commentAdd a comment