తల్లి పాదాలను తాకి...సీబీఐ కార్యాలయానికి సిసోడియా! | Sisodia Touching Mothers Feet Take Blessings Before Leaving CBI Office | Sakshi
Sakshi News home page

తల్లి పాదాలను తాకి...సీబీఐ కార్యాలయానికి సిసోడియా!

Published Mon, Oct 17 2022 10:27 AM | Last Updated on Mon, Oct 17 2022 11:51 AM

Sisodia Touching Mothers Feet Take Blessings Before Leaving CBI Office - Sakshi

న్యూఢిల్లీ: గుజరాత్‌లో సమీపిస్తున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే తనపై ఇలాంటి చర్యలకు దిగుతోందంటూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బీజేపీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ మనీష్‌ సిసోడియాని లిక్కర్‌ కేసు విషయమై సోమవారం ఉదయం హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆప్‌ నాయకుడు మనీష్‌ సిసోడియా ట్విట్టర్‌లో... గుజరాత్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా తనపై ఇలా సీబీఐ దాడులు చేయించి,  జైల్లో పెట్లాలనుకుంటుంది.

ఐతే తాను జైలుకి వెళ్లినప్పటికీ గుజరాత్‌ ఎన్నికల ప్రచార ర్యాలీని మాత్రం ఆపలేరంటూ సవాలు విసిరారు. మొదటగా సీబీఐ ఢిల్లీ లిక్కర్‌ పాలసీ విషయమై తన ఇంటిపై దాడులు నిర్వహించింది. ఐతే వారికి అక్కడ ఏమి దొరకలేదు. దీంతో బీజేపీకి గుజరాత్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే తనను జైల్లో పెట్టే కుట్రకు ప్లాన్‌  చేస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన సీబీఏ కార్యాలయానికి వెళ్లే ముందు తల్లి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని మరీ వెళ్లారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: మనీష్‌ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్‌ చేస్తుంది: ఆప్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement