న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలకు భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను.. భారత విదేశి వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకొని సుమారు 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్‌పై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను ఆమెరికా ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ‘ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
అంతకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది జర్మనీ. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ దేశ రాయబారికి కూడా సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment