ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోసారి న్యాయస్థానం సమన్లు జారీ అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ ప్రజా ప్రతినిధుల కోర్టు ఆయనకు శనివారం సమన్లు జారీ చేసింది. జనవరి 6వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో రాహుల్‌ను కోరింది.
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గానూ రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ నాలుగేళ్ల కిందట(2018, ఆగస్టు 4వతేదీన) బీజేపీ నేత విజయ్ మిశ్రా కేసు వేశారు. సుల్తాన్‌పూర్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతూ వచ్చింది. చివరకు..
నవంబర్ 18వ తేదీతో వాదనలు పూర్తి కాగా, జడ్జి యోగేష్ యాదవ్ తీర్పును రిజర్వ్‌చేశారు. తర్వాత విచారణ నవంబర్ 27వ తేదీన జరగ్గా.. రాహుల్ గాంధీని డిసెంబర్ 16వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే.. ఈ కేసులో విచారణ కోసం కోర్టుకు రాహుల్ గాంధీ రాలేదు. దీంతో జనవరి 6వ తేదీన కచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని సమన్లు జారీ అయ్యాయని విజయ్ మిశ్రా తరఫు లాయర్ సంతోష్‌పాండే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment