సాక్షి, ఢిల్లీ: మణిపూర్ హింసపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) మణిపూర్ పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలకొద్ది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్‌లు జరగలేదని, విచారణలోనూ నిర్లక్ష్యం కనిపించిందని వ్యాఖ్యానించింది. అసలు ఎఫ్‌ఐఆర్‌లు ఇలాగేనా? నమోదు చేసేదని మణిపూర్ పోలీస్ శాఖపై మండిపడింది. వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలంటూ మణిపూర్ డీజీపీని సమన్లు జారీ చేసింది.
మణిపూర్‌లో శాంతి భద్రతల అనే మాటే లేదు. రాష్ట్ర యంత్రాగం పూర్తిగా విఫలమైంది. హింస చెలరేగి మూడు నెలలైనా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదు. అరెస్టులు జరగలేదు. విచారణలో అడుగడుగునా నిర్లక్ష్యం, నిర్లిప్తత కనిపిస్తోందంటూ మణిపూర్ పోలీస్ శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.
సీజేఐ చంద్రచూడ్ కామెంట్లు..
► మే నుండి జులై చివరి వరకు రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విచ్ఛిన్నమైంది
► జూలై 25, 2023 నాటికి 6496 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మణిపూర్ తరపున దాఖలు చేసిన నివేదిక పేర్కొంది. అధికారిక నివేదికల ప్రకారం 150 మరణాలు సంభవించాయని, 502 మంది గాయపడ్డారని, 5,101 కేసులు ఉన్నాయని స్టేటస్ రిపోర్ట్ పేర్కొన్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. కాల్పులు మరియు 6,523 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎఫ్‌ఐఆర్‌లలో 252 మందిని అరెస్టు చేయగా, నివారణ చర్యల కోసం 1,247 మందిని అరెస్టు చేశారు. 11 ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి 7 మందిని అరెస్టు చేసినట్లు స్టేటస్ నివేదిక పేర్కొంది.
► 11 ఎఫ్‌ఆఐర్‌లు మహిళలపై జరిగిన వేధింపుల ఘటనకు సంబంధించినవి పేర్కొన్నారు. అసలు వీటిలో ఎన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి? ఎఫ్‌ఐఆర్‌ల నమోదులో గణనీయమైన లోపం కనిపిస్తోంది. కాబట్టి.. మణిపూర్ డీజీపీ శుక్రవారం(ఆగష్టు 4వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు ఈ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలి. కోర్టుకు ఆయన సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి అని తెలిపింది.
ఆ సమయంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేయడంతో.. సోమవారం(ఆగష్టు 7వ తేదీకి) మధ్యాహ్నానికి డీజీపీ హాజరు కావాలని ఆదేశాలు సవరించింది ధర్మాసనం. సమగ్ర నివేదికతో తమ ముందుకు రావాలని ఆదేశించారు సీజేఐ డీవై చంద్రచూడ్. ఎవరు బాధితుడు.. ఎవరు నేరస్తుడు అనేదాంతో సంబంధం లేదు. ఎవరు నేరం చేసినా కోర్టు తీరు ఇలాగే ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
► ఘటన జరిగిన తేదీ, జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాధారణ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తేదీ, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయబడిన తేదీ, సెక్షన్ 164 సిఆర్‌పిసి కింద స్టేట్‌మెంట్‌లు నమోదు చేయబడిన తేదీ, అరెస్టుల తేదీ.. మొత్తం అన్నింటితో స్టేట్‌మెంట్ రూపొందించాలని తెలిపారు.
► రాష్ట్ర పోలీసులు విచారణ చేపట్టే పరిస్థితుల్లో మనం లేం. కాబట్టి.. ఒక యంత్రాంగం అవసరం. 6,500 ఎఫ్‌ఐఆర్‌ల దర్యాప్తును సీబీఐకి అప్పగించడం అసాధ్యమన్న విషయంపై మాకు స్పష్టత ఉంది. అదే సమయంలో.. రాష్ట్ర పోలీసులకు అప్పగించబడదు. అందుకే..
► ప్రభుత్వ పనితీరును పరిశీలించడం, పరిహారం, పునరుద్దరణ పనులు, దర్యాప్తు స్వతంత్ర్యంగా జరిగేలా చూడడం, స్టేట్‌మెంట్లు నమోదు చేయడం.. ఇలా అన్ని వ్యవహారాలను చూసుకునేందుకు మాజీ న్యాయమూర్తుల కమిటీ ఏర్పాటును పరిశీలించాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీంకోర్టు సూచించింది.
Supreme Court says government shall prepare a statement setting out date of occurrence, date of registration of zero FIR, date of registration of regular FIR, date on which witness statements have been recorded, date on which statements under section 164 CrPC have been recorded,… pic.twitter.com/exn7hAaI2B
— ANI (@ANI) August 1, 2023
Comments
Please login to add a commentAdd a comment