
న్యూఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా అనివీతి కేసులో వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్‌కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సమన్లు జారీ చేసింది. మహువా అవినీతి కేసుకు సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది.
పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలకు డబ్బులు తీసుకున్న కేసులో మహువా డిసెంబర్‌లో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పదం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరకు ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించారు.
ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DEO) కూడా ఇటీవలే నోటీసులు పంపింది. అయితే తనకు ఆ బంగ్లాను కొనసాగించాలని మహువా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె ఎదురుదెబ్బ తగలటంతో తన కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు.
చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment