layer
-
మహువా అవినీతి కేసు: జై అనంత్ దేహద్రాయ్కు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా అనివీతి కేసులో వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సమన్లు జారీ చేసింది. మహువా అవినీతి కేసుకు సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. పార్లమెంట్లో అడిగే ప్రశ్నలకు డబ్బులు తీసుకున్న కేసులో మహువా డిసెంబర్లో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పదం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరకు ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించారు. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DEO) కూడా ఇటీవలే నోటీసులు పంపింది. అయితే తనకు ఆ బంగ్లాను కొనసాగించాలని మహువా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె ఎదురుదెబ్బ తగలటంతో తన కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత -
లాయర్ హత్య: విడాకుల కోసం వచ్చిన మహిళతో ఎఫైర్
తిరువళ్లూరు: జిల్లాలోని కాకలూరులో ఓ న్యాయవాది ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా వెల్లేరితాంగెల్ గ్రామానికి చెందిన న్యాయవాది వెంకటేషన్(35). ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నై పెరంబూరు చెందిన సత్య(31) విడాకుల కోసం వెంకటేషన్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఇద్దరికి వివాహేతర సంబంధం ఏర్పడింది. సత్య భర్త, పిల్లలను వదిలేసి వెంకటేషన్‌తో కాకలూరు, ఆంజనేయనగర్‌లో అద్దె ఇంట్లో ఉండేది. న్యాయవాదుల రాస్తారోకో సత్య పిల్లలు తరచూ తల్లి గురించి అడుగుతుండడంతో బంధువులు ఆదివారం రాత్రి సత్య ఉంటున్న ఇంటి వద్ద వచ్చి ఆమెకు నచ్చ చెప్పారు. సత్య నిరాకరించడం, వెంకటేషన్ సైతం వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆగ్రహించిన బంధువులు సత్య, వెంకటేషన్‌ను కత్తులతో నరికి పరారైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన సత్యను ఆస్పత్రికి తరలించారు. వెంకటేషన్ మృతి చెందినట్టు నిర్దారించి మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆరుగురు అరెస్టు వెంకటేషన్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా సత్య తండ్రి శంకర్(59), తల్లి చెల్లామ్మాల్(52), పిన్ని దేవి(46), తమ్ముడు వినోద్(25), సోదరి సంగీత(23), సంగీత భర్త వెంకట్ (25)లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. సోమవారం రాత్రి న్యాయమూర్తి ఎదుట హజరుపరిచి ఫుళల్ జైలుకు తరలించనున్నట్లు వివరించారు. న్యాయవాది హత్యను నిరసిస్తూ తిరుపతి–చెన్నై జాతీయ రహదారిలో సోమవారం న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించారు. -
బెయిల్‌కు న్యాయవాది ప్రయత్నం
కమాన్‌చౌరస్తా: కరీంనగర్ రూరల్ పోలీసులు నమోదు చేసిన రెండు కేసులలో నిందితుడైన ఓ సీనియర్ న్యాయవాది ముందస్తు బెయిల్ కొరకు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కరీంనగర్ మండలం నగునూర్ శివారులోని లక్ష్మీనర్సింహ టౌన్ షిప్ ప్లాట్ల వ్యవహారంలో నయీం అనుచరులమంటూ బెదిరించారని 13 మందిపై, భూవివాదానికి సంబందించిన మరో కేసులో నయీమ్ అనుచరులమని బెదిరించిన 14 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న న్యాయవాది, మరోకరిని కోరుట్ల పోలీసులు ఆరెస్టు చేసి జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. తర్వాత వారిని కస్టడీకి తీసుకుని నయీమ్‌తో వ్యవహారాలపై విచారణ చేశారు. రెండు కేసులలో సదరు న్యాయవాదిని కూడా నిందితుడిగా పేర్కొనడంతో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు నయీమ్‌పై 41 కేసులు విచారణ చేస్తున్నామని, ఎవరికీ బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ నెల 6న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానున్నట్లు సమాచారం.