బెయిల్‌కు న్యాయవాది ప్రయత్నం
Published Thu, Sep 1 2016 11:40 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM
కమాన్‌చౌరస్తా: కరీంనగర్ రూరల్ పోలీసులు నమోదు చేసిన రెండు కేసులలో నిందితుడైన ఓ సీనియర్ న్యాయవాది ముందస్తు బెయిల్ కొరకు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కరీంనగర్ మండలం నగునూర్ శివారులోని లక్ష్మీనర్సింహ టౌన్ షిప్ ప్లాట్ల వ్యవహారంలో నయీం అనుచరులమంటూ బెదిరించారని 13 మందిపై, భూవివాదానికి సంబందించిన మరో కేసులో నయీమ్ అనుచరులమని బెదిరించిన 14 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న న్యాయవాది, మరోకరిని కోరుట్ల పోలీసులు ఆరెస్టు చేసి జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. తర్వాత వారిని కస్టడీకి తీసుకుని నయీమ్‌తో వ్యవహారాలపై విచారణ చేశారు. రెండు కేసులలో సదరు న్యాయవాదిని కూడా నిందితుడిగా పేర్కొనడంతో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటి వరకు నయీమ్‌పై 41 కేసులు విచారణ చేస్తున్నామని, ఎవరికీ బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ నెల 6న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు రానున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement