
బెంగళూర్ : కర్ణాటక మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌కు మనీల్యాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ సమన్లపై డీకే స్పందిస్తూ తాను దీనిపై ఎలాంటి టెన్షన్ తీసుకోవడం లేదని, తాను ఎలాంటి పొరపాటూ చేయలేదని, తాను ఎవరి వద్దా డబ్బు తీసుకోలేదని, లైంగిక దాడి చేయలేదని పేర్కొన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని బీజేపీ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు. రూ కోట్లలో పన్ను ఎగవేతలకు పాల్పడటంతో పాటు అక్రమ లావాదేవీలు సాగించారనే ఆరోపణలపై డీకే శివకుమార్ మరికొందరిపై గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో డీకేతో పాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్‌కు చెందిన ఉద్యోగి సహా మరికొందరి పేర్లను ఈడీ చేర్చింది. గత రెండేళ్లుగా తన 84 ఏళ్ల తల్లికి చెందిన యావదాస్తినీ బినామీ ఆస్తులుగా దర్యాప్తు సంస్థలు అటాచ్ చేశాయని, తమ రక్తం మొత్తం పీల్చేశారని డీకే ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment