తీర్పు చెప్పని జడ్జీలకు అవకాశమివ్వొద్దు | Judgment Unspecified Judges | Sakshi
Sakshi News home page

తీర్పు చెప్పని జడ్జీలకు అవకాశమివ్వొద్దు

Published Mon, Jul 27 2015 2:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

Judgment Unspecified Judges

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
సాక్షి, చెన్నై: కోర్టు కేసుల్లో విచారణ ముగిశాక మూడు నెలల్లోపు తీర్పు చెప్పడం తప్పనిసరని, జాప్యం చేసే జడ్జీలకు కొత్త కేసులు విచారించే అవకాశాన్ని ఇవ్వరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూరియన్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ  అఖిల భారత బార్ కౌన్సిల్ సదస్సులో సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు జడ్జీలు పాల్గొన్నారు. కేసు విచారణ ముగిశాక తీర్పు చెప్పేందుకు కనిష్టకాలం నెల, గరిష్టకాలం 3 నెలలు అని జడ్జి జోసెఫ్ అన్నారు.

మూడు నెలలుదాటినా తీర్పు చెప్పని జడ్జీలకు ఇతర కేసులను సుప్రీం, హైకోర్టు జడ్జీలు ఇవ్వొద్దన్నారు. విచారణ కాలంలో  కేసులపై తమ సొంత అభిప్రాయాలను మీడియాకు జడ్జీలు తెలపొద్దన్నారు. సుప్రీంకోర్టు జడ్జి జె.చలమేశ్వర్ మాట్లాడుతూ.. కేసులు దీర్ఘ కాలం కొనసాగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఒక కారణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement