‘వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో ఆయన దిట్ట’ | Botsa Satyanarayana Comments On Chandrababu Over Babli Case | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 21 2018 3:11 PM | Last Updated on Fri, Sep 21 2018 3:11 PM

Botsa Satyanarayana Comments On Chandrababu Over Babli Case - Sakshi

బొత్స సత్యనారాయణ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ లభ్ది కోసమే బాబ్లీ కేసును ఉపయోగించుకుంటున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయని.. వాటిపై స్టేలు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజే చేయడంలో ఆయన దిట్ట అని అభివర్ణించారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబుకు చుట్టాలేనని తెలిపారు. చిన్న కేసును పట్టకుని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

కోర్టు నోటీసులు వచ్చినప్పుడు ఎవరైనా హాజరుకావాల్సిందేనని వివరించారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు దేనికైనా వెనుకాడరని ఎద్దేవ చేశారు. కాంగ్రెస​ హయాంలేనే బాబ్లీ కేసు నమోదయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏదోవిధంగా రాజకీయం చేయడం ఆయనకు అలవాటైందని దుయ్యబట్టారు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే విషయాన్ని గుర్తుంపెట్టుకోవాలని హితబోద చేశారు. తమ పార్టీని, బీజేపీకి ఆపాదించడం కూడా రాజకీయమేనని పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతుందని స్పష్టం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement