babli
-
‘వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయన దిట్ట’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ లభ్ది కోసమే బాబ్లీ కేసును ఉపయోగించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయని.. వాటిపై స్టేలు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజే చేయడంలో ఆయన దిట్ట అని అభివర్ణించారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబుకు చుట్టాలేనని తెలిపారు. చిన్న కేసును పట్టకుని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు నోటీసులు వచ్చినప్పుడు ఎవరైనా హాజరుకావాల్సిందేనని వివరించారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు దేనికైనా వెనుకాడరని ఎద్దేవ చేశారు. కాంగ్రెస హయాంలేనే బాబ్లీ కేసు నమోదయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏదోవిధంగా రాజకీయం చేయడం ఆయనకు అలవాటైందని దుయ్యబట్టారు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే విషయాన్ని గుర్తుంపెట్టుకోవాలని హితబోద చేశారు. తమ పార్టీని, బీజేపీకి ఆపాదించడం కూడా రాజకీయమేనని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతుందని స్పష్టం చేశారు. -
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
-
జిత్తులమారి బాబు..!
-
చంద్రబాబు ఓ ముద్దాయి..
-
బాబ్లీ నుంచి నీటి విడుదల
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర సర్కారు నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 1వ తేదీన దిగువకు 0.6 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఈ మేరకు గురువారం త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏటా జూలై 1వ తేదీన బాబ్లీ గేట్లు ఎత్తి ఎస్సారెస్పీకి నీటిని విడుదల చేయాలి. అనంతరం అక్టోబర్ 28న బాబ్లీ గేట్లు మూసివేస్తారు. అయితే గేట్లు మూసివేసిన తరువాత శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ, బాబ్లీ ప్రాజెక్ట్ దిగువ పరీవాహక ప్రాంతాల్లో నీరు నిలవడం, ఆ నీరు ఎస్సారెస్పీకి చేరకపోవడాన్ని భర్తీ చేసేందుకుగాను, మార్చి 1వ తేదీన 0.6టీఎంసీల నీటిని బాబ్లీ నుంచి విడుదల చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇందులో భాగంగా గురువారం నీటి విడుదల చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాజెక్ట్ ఈఈ రామారావు, సీడబ్ల్యూసీ నుంచి ఈఈ శ్రీనివాస్, మహారాష్ట్ర నుంచి నాందేడ్ ఈఈ సెటే, తదితరులు పాల్గొన్నారు. ఉత్కంఠకు తెర.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మార్చి 1న 0.6 టీఎంసీల నీటి విడుదల చేపట్టాలి. అయితే బాబ్లీ ప్రాజెక్ట్‌లో నీరు లేదని ప్రస్తుతం నీటి విడుదల చేపట్టలేమని మహారాష్ట్ర అధికారులు ఎస్సారెస్పీ అధికారులకు లేఖ రాయడంతో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నీటి విడుదల చేపట్టాలని ఎస్సారెస్పీ అధికారులు ప్రతి లేఖ రాశారు. దీంతో బాబ్లీ నుంచి నీటి విడుదల చేపడుతారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు సుప్రీం తీర్పు మేరకు త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో నీటి విడుదల చేపట్టడంతో ఉత్కంఠకు తెర పడింది. 0.3 టీఎంసీల నీరు చేరే అవకాశం.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఎగువప్రాంతం నుంచి 0.3 టీఎంసీల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని గోదావరి పరీవాహక çప్రాంతాలను దాటుతూ నీరు రావాల్సి ఉండడంతో ఎస్సారెస్పీలోకి కనీసం సగం నీరు అయినా చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
ఎస్సారెస్సీకి బాబ్లీ నీళ్లు
- నేటి అర్ధరాత్రి గేట్ల ఎత్తివేత -గోదావరిలో పెరగనున్న నీటి ప్రవాహం -త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో విడుదల భైంసా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్ తాలుకాలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను గురువారం అర్ధరాత్రి తెరవనున్నారు. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి నీటిని వదలనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏటా జూలై 1న గేట్లు తెరిచి అక్టోబర్ 28 వరకు నది నీటి సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రకు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గేట్లను పైకి ఎత్తనున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి గోదావరి నది ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలో అడుగిడుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు వరకు ఈ నది ప్రవాహం ఉంటుంది. గోదావరి నదిలో వర్షపు నీరు.. వర్షాలు లేక గతేడాది ఎస్సారెస్పీలో నీరు చేరలేదు. పుష్కరాల సమయంలో గేట్లు ఎత్తడంతో ఆ నీరు బాసర వరకు చేరింది. వర్షాలు లేక గోదావరి నదిలో తవ్విన ఇసుక గుంతల్లోనే ప్రాజెక్టు నీరు ఇంకిపోయింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మంజీర ఉపనదితో వచ్చే నీరు బాసర వద్ద నిలిచి ఉంది. జూన్ మొదటి వారం నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి జలకళ వచ్చింది. బాసర గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద వర్షపునీరు చేరింది. రైలు, బస్సు వంతెనల నుంచి నదిలో నీరు కనిపిస్తోంది. గతేడాది నుంచి ఎడారిలా కనిపించిన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎస్సారెస్పీకి నీరు.. బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తనున్న నేపథ్యంలో ఎస్సారెస్పీలోకి నీరు చేరుతుందని రైతులు ఆశిస్తున్నారు. పైగా మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. వరదనీరంతా గోదావరి నదిగుండా ఎస్సారెస్పీకి వస్తుందని భావిస్తున్నారు. ప్రాజెక్టు 14 గేట్లు పైకి ఎత్తి ఉంచడంతో సహజ నది నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం ఉండదు. గోదావరి నది ప్రవహిస్తే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాలతో నీరంది పంటలు పండుతాయి. నీరులేక గతేడాది రెండు జిల్లాలోనూ పంటపొలాలన్నీ బీడుభూములుగా మారిపోయాయి. ఈ యేడాది వర్షాలు కురుస్తుండడంతో గోదావరిలో వచ్చే నీటితో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే రెండు జిల్లాల రైతులు వరి పంటలువేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు.