నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్‌రెడ్డి (48) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌లలో కమలాకర్ కూడా ఒకరు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారినపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొస్తుండగా నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
ఒకే ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాకు కమలాకర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘అర్జు¯Œ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ చిత్రాలతో పాటు పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన పంపిణీ చేశారు. కమలాకర్ రెడ్డి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అంబులె¯Œ్స డ్రైవర్‌ని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
Comments
Please login to add a commentAdd a comment