
తోట రామయ్య
శ్రీ భాస్కర్ ఫిలిమ్స్ పతాకంపై ‘రణధీరుడు’, ‘మళ్లీ ఇంకోసారి’ ‘రౌడీ’ చిత్రాలను నిర్మించిన తోట రామయ్య కన్ను మూశారు. శుక్రవారం రాత్రి 10.30 ప్రాంతంలో సికింద్రాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు భార్య వసుంధర, కుమారుడు రాహుల్‌బాబు, కుమార్తె నీలిమ ఉన్నారు. సోమవారం బన్సీలాల్‌పేటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని తోట రామయ్య కుటుంబసభ్యులు తెలిపారు.