Ramaiah
-
ఒంటరిగా ఎలా ఉంటున్నావు?
పుట్టపర్తి టౌన్: బంధువుల గొడవపై స్టేషన్‌కు వెళ్లిన తనతో మడకశిర సీఐ రాగిరి రామయ్య అసభ్యకరంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మడకశిర మండలం టీడీపల్లి తాండాకు చెందిన గాయిత్రి శనివారం ఎస్పీ రత్నను కలిసి పోలీసు స్టేషన్లో తనకు జరిగిన అవమానాన్ని వివరించింది. ఎస్పీ వెంటనే స్పందించి సీఐ రామయ్యపై విచారణ జరపాలని మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీని ఆదేశించారు.అనంతరం పోలీస్ కార్యాలయం ఎదుట బాధితురాలు గాయత్రి మీడియాతో గోడు వెళ్లబోసుకొంది. టీడీపల్లి తాండాలో ఇంటికి సమీపంలోనే ఉన్న తన బంధవులు పొలం హద్దుల విషయంలో శుక్రవారం గొడవ పడ్డారని తెలిపింది. ఈ వివాదం పోలీసు స్టేషన్‌కు చేరిందని చెప్పింది. వారికి సర్ది చెప్పాలని తాము కూడా పోలీస్ స్టేషన్‌కు వెళ్లామంది. సీఐ రాగిరి రామయ్య వద్దకు వచ్చి రాజీ పడతామని, కేసు లేకుండా చేయాలని కోరినట్లు చెప్పింది.అయితే, సీఐ ఆ గొడవను పట్టించుకోకుండా రాత్రి 10 గంటల సమయంలో తనను ఒక్కదానినే చాంబర్లోకి పిలిచి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ‘నీ భర్త ఏం చేస్తున్నారు? ఎలా విడిపోయారు? ఫ్యామిలీని ఎలా పోషిస్తావు? ఒంటరిగా ఎలా ఉంటున్నావు? ఏదైనా బిజినెస్ చేయి.. నేను సపోర్టు చేస్తా. నేను చాలా మంచి ఆఫీసర్ని’ అంటూ అసభ్యకరంగా మాట్లాడారని, తనను భయబ్రాంతులకు గురిచేశారని వివరించింది. వెంటనే తన స్నేహితుడు రామాంజనేయలుకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు వచ్చి సీఐని నిలదీశారని, దీంతో ఇంటికి పంపించారని చెప్పింది. విచారణ పేరుతో సీఐ తనను ఎంతలా భయబ్రాంతులకు గురిచేశారో సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ రత్నను కోరినట్లు తెలిపింది. సీఐ రామయ్య నుంచి రక్షణ కల్పించాలని కోరినట్లు చెప్పింది. -
మనస్తాపంతో ఇద్దరు వైఎస్సార్సీపీ అభిమానులు ఆత్మహత్య
బల్లికురవ/టి.నరసాపురం: వైఎస్సార్సీపీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఇద్దరు అభిమానులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గంగపాలెం గ్రామానికి చెందిన పెయ్యల రామయ్య(64) 4వ తేదీ ఉదయం ఎన్నికల ఫలితాలను టీవీలో చూస్తూ బాధపడ్డాడు. ప్రజలకు ఎంతో మేలు చేసిన వైఎస్సార్సీపీని ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా ఓడించారంటూ మనోవ్యథకు గురయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి గంగపాలెం గ్రామం నుంచి మల్లాయపాలెం వెళ్లే రోడ్డులోæని వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ స్తంభానికి తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న కటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అతని భార్య సులోచన మాట్లాడుతూ.. ‘జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు అందడంతో మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో నా భర్త ఎంతో బాధపడ్డాడు. ఆయన్ను ఎంతగానో ఓదార్చాం. కానీ, ఇంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు’ అంటూ విలపించింది. రామయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు, ఎంపీపీ బడుగు శ్రీలక్ష్మి సురేష్, కొణిదెన సర్పంచ్ కె.లేపాక్షి విష్ణు, పెయ్యల రంగనాథ్, గుంజి ఆంజనేయులు తదితరులు పరామర్శించారు. అన్యాయం జరిగిందంటూ.. ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం పుట్రేపు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాస్(24) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వైఎస్సార్సీపీ అంటే విపరీతమైన అభిమానం ఉన్న శ్రీనివాస్.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ మెజార్టీతో గెలిచి.. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పదవి చేపడతారని భావించాడు. కానీ అందుకు భిన్నంగా ఫలితాలు రావడంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎక్కడో అన్యాయం జరిగిందంటూ ఆవేదన చెందాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతరం కొద్దిసేపటికి ఇంటికి వచి్చన కుటుంబసభ్యులు శ్రీనివాస్‌ను వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న శ్రీనివాస్ మరణించడంతో భార్య, ముగ్గురు పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
AP: అయోధ్య రామయ్యకు ‘శ్రీరామకోటి పట్టు వస్త్రం’
ధర్మవరం: అందరి బంధువు అయోధ్య రామయ్యకు ధర్మవరం నేతన్నలు అపూర్వ కానుకను అందజేసి తమ భక్తి ప్రవత్తులను చాటుకోనున్నారు. రామాయణ ప్రధాన ఘట్టాలను ప్రతిబింబిస్తూ 60 గజాల పట్టువస్త్రాన్ని.. రామాయణ మహాకావ్యాన్ని ప్రతిబింబించే చిత్రాలతో పాటు శ్రీరామ నామాలను 16 భాషల్లో డిజైన్ చేసి సమర్పించనున్నారు. ఈనెల 24వ తేదీన ఈ వస్త్రాన్ని అయోధ్యకు పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 నెలలు శ్రమించి.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నేసేపేటకు చెందిన జూజారు నాగరాజు ప్రముఖ పట్టుచీరల డిజైనర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి చేనేతల తరఫున శ్రీరామునికి ఏదైనా కానుక పంపాలని ఆలోచించి ఈ మహాత్కార్యానికి పూనుకున్నాడు. పల్లా సురేంద్రనాథ్, పల్లా తేజ అనే ఇద్దరు నేత కారి్మకుల సహకారంతో 4 నెలలు శ్రమించి 60 గజాల పట్టువస్త్రాన్ని తయారు చేసి మహాయజ్ఞాన్ని పూర్తి చేశాడు. ఈ పట్టు వ్రస్తానికి ‘శ్రీరామకోటి’ పట్టు వస్త్రంగా నామకరణం చేశాడు. 60 గజాల పొడవు..16 కేజీల బరువు చేనేత మగ్గంపై 6 గజాల పట్టుచీర తయారు చేయడం సర్వ సాధారణం. అయితే శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని ఎంతో నైపుణ్యంతో 60 గజాల పొడవు, 44 ఇంచుల వెడల్పు 16 కేజీల బరువుతో తయారు చేయడం ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. ఇందుకోసం రూ.1.50 లక్షలు ఖర్చు చేశారు. వస్త్రం తయారీకి పట్టు, నూలు, లెనిన్, బనానాయార్న్, పాలిష్టర్తో పాటు గోల్డ్, సిల్వర్, కాపర్ జరీలు, వెల్స్పన్ తదితర ముడిపదార్థాలను వాడారు. పూర్తిగా ప్రకృతి సిద్ధమైన రంగులతో ఎటువంటి కెమికల్స్ వాడకుండా వస్త్రం తయారు చేయడం ఈ వస్త్రం ప్రత్యేకత. రామాయణంలో ప్రధాన ఘట్టాలు,168 రకాల చిత్రాలు రామాయణంలోని ప్రధాన ఘట్టాలైన శ్రీరాముని జననం, విద్యాభ్యాసం, పట్టాభిõÙకం, వనవాసం, సీతాపహరణం, రావణసంహారం, హనుమంతుని సంజీవని పర్వత ఘట్టాలను తెలుపుతూ పట్టు వ్రస్తాన్ని తయారు చేశారు. మొత్తం 168 రకాల చిత్రాలను అంచుల్లో రూపొందించారు. 16 భాషల్లో శ్రీరామ నామాలు డిజైన్ పట్టు వస్త్రం మధ్య భాగంలో ఆకుపచ్చ, తెలుపు, ఆనంద, మెరూన్, పింక్, చాక్లేట్, రాయల్బ్లూ, ఆలివ్‌గ్రీన్, వైట్ తదితర రంగుల్లో శ్రీరామ నామాలను తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాళం, ఒరియా, గుజరాతీ, పంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఇంగ్లిష్, అస్సాం, సింహళ (శ్రీలంక) భాషల్లో లిఖించారు. పట్టువస్త్రంపై మొత్తం 32,200 రామనామాలు పొదిగారు. నాలుగు నెలలు శ్రమించాం.. ధర్మవరం నేతన్నల తరఫున శ్రీరామకోటి పట్టు వ్రస్తాన్ని తయారు చేయడం నా పూర్వ జన్మ సుకృతం. పట్టు వ్రస్తాన్ని పంపేందుకు ఆలయ ట్రస్ట్ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారి నుంచి అనుమతి రాగానే పట్టు వ్రస్తాన్ని పంపుతాం. –జూజారు నాగరాజు, డిజైనర్, ధర్మవరం. -
లాడ్జి వివాదం: రామయ్యా.. ఇదేంటయ్యా?
కదిరి(శ్రీసత్యసాయి జిల్లా): లాడ్జి విక్రయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య తీరు వివాదాస్పదంగా మారింది. టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ అండతో చెలరేగిపోతున్న రామయ్య తీరును చివరకు ఆయన సోదరులే తప్పుబడుతున్నారు. శనివారం ఈ వివాదం కాస్త తారస్థాయికి చేరుకుంది. వివరాలు.. మూడున్నర సంవత్సరాల క్రితం తన లాడ్జిని రూ.9.50 కోట్లకు కదిరికి చెందిన సాయిరాం ఫర్టిలైజర్స్ నిర్వాహకుడు శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య విక్రయించి అగ్రిమెంట్ రాయించారు. ఆ సమయంలోనే తమ వాటా కింద ఉన్న 60 శాతాన్ని శ్రీధర్‌రెడ్డికి జొన్నా రామయ్య సోదరులు రిజిస్టర్ చేయించారు. చదవండి👉 అసలైన ఉన్మాది చంద్రబాబే.. అయితే జొన్నా రామయ్యకు చెందిన వాటాను రిజిస్ట్రేషన్ చేయించకుండా అప్పటి నుంచి శ్రీధర్‌రెడ్డిని తిప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాక లాడ్జిని సైతం అప్పగించకుండా ఆదాయాన్ని తానే తీసుకుంటున్నారు. ఇటీవల తన 40 శాతం వాటాలోని 20 శాతాన్ని వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన చంద్రారెడ్డికి జొన్నా రామయ్య విక్రయించారు. ఆ వాటాను కూడా శ్రీధర్‌రెడ్డి కొనుగోలు చేయడంతో దాదాపు 80 శాతం వాటా ఆయనకే చెల్లుబాటైంది. కుటుంబానికి చెడ్డపేరు రాకుండా.. రామయ్య తీరుతో కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని భావించిన సోదరులు శనివారం శ్రీధర్‌రెడ్డిని వెంటబెట్టుకుని లాడ్డి వద్దకు చేరుకుని బండరాళ్లు వేసి రామయ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమ అన్న రామయ్య కారణంగా జొన్నా కుటుంబానికి చెడ్డ పేరు వస్తోందని, ఇప్పటికైనా ఆయన ప్రవర్తన మార్చుకుని లాడ్జిని శ్రీధర్‌రెడ్డికి అప్పగించాలని కోరారు. ఈ వ్యవహారం మొత్తం చూసిన పట్టణ ప్రజలు సైతం రామయ్య తీరును తప్పుబట్టారు. కందికుంట తీరుపై ప్రజల అసహనం లాడ్జి వద్ద వివాదం నెలకొన్న విషయం తెలుసుకున్న టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్, అనుచరులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. రామయ్యకు తనతో పాటు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే వివాదానికి న్యాయమైన పరిష్కారం చూపకుండా మరింత జఠిలం చేయడంతో కందికుంటపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో పోలీసులు అక్కడకు చేరుకుని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
'పవన్ కల్యాణ్ ఒక పార్ట్‌టైం పొలిటీషియన్'
సాక్షి,కర్నూల్ : రాయలసీమ ప్రాంతం, కర్నూల్ అభివృద్ధిపై కనీస అవగాహన లేని నాయకుడు పవన్ కల్యాణ్ అంటూ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై. రామయ్య మండిపడ్డారు. 'టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక ఘటన ఆధారంగా రాజకీయ లబ్ది పొందేందుకు పవన్ కళ్యాణ్ తాపాత్రయపడుతున్నారు. సుగాలి ప్రీతి అంశం ఇప్పటికే కోర్టుల్లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ప్రీతి ఘటనపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గతంలో ఈ అంశంపై మాట్లాడని పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనే చెప్పాలి. ఇప్పటికే సీబీఐ కి అప్పగించిన ఈ కేసులో పవన్ కొత్తగా చేస్తున్న డిమాండ్ ఎవరికి అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడ కోసం ప్రీతిబాయ్ అంశాన్ని వాడుకోవాలని చూస్తున్నాడంటూ' ధ్వజమెత్తారు. (మమ్మల్ని కాదు... పవన్‌ను అరెస్ట్ చేయండి) పవన్ కళ్యాణ్ పార్ట్ టైం రాజకీయాలు చేస్తూ సమకాలీన అంశాలపై అప్డేట్ అవ్వడం లేదని విమర్శించారు. స్పష్టమైన విధానాలతో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తే మంచిదని, పార్ట్ టైం పొలిటీషియన్ గా మేకప్/ప్యాకప్ పాలిటిక్స్ చేస్తే ఉపయోగం లేదని రామయ్య పేర్కొన్నారు. దిశ, దశ లేని పవన్ రాయలసీమ యువతను తన వెంట నడవమనటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. కర్నూల్లో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ మొదట మూడు రాజధానులకు తన మద్దత్తు తెలపాలని కోరారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు నాడు కావాలని చెప్పి నేడు మాత్రం వద్దనడంలో అంతర్యం ఏమిటో ఆయనే చెప్పాలన్నారు. అవగాహన రాహిత్యంతో రాజకీయాలు చేస్తున్న పవన్ కర్నూల్లో పర్యటించడం అర్థరహితమని, కర్నూల్ ప్రజల ఆకాంక్షలను అవమాన పరుస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన దిశ కేసు నేపథ్యంలో మహిళలకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టం అమలు చేశారు. మహిళలకు జగనన్న ప్రభుత్వం ఎల్లపుడు అండగా ఉంటుందని భరోసా వ్యక్తం చేశారు. జగన్న ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు సుఖంగా ఉన్నారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల అమలు సజావుగా సాగుతోందని, ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో చేనేత కార్మికులకు జగన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బి.వై.రామయ్య తెలిపారు. (అప్పుడే పవన్ సీమలో అడుగు పెట్టాలి..) -
గవర్నర్‌ను కలిసిన వనజీవి రామయ్య
సాక్షి, ఖమ్మం: మండలంలోని రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్యకు సోమవారం రాత్రి రాజ్‌భవన్ నుంచి పిలుపు రావడంతో మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్‌భవన్‌కు రావాలి్సందిగా గవర్నర్ తమిళిసై వ్యక్తిగత అధికారులు ఫోన్లో రామయ్యకు తెలపడంతో వెళ్లిన రామయ్య గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ రామయ్య ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు నాటారు? అసలు మొక్కలు నాటాలనే ఆలోచన ఎలా వచ్చింది? తదితర వివరాలను గవర్నర్ రామయ్యను అడిగి తెలుసుకున్నారు. రామయ్య తాను మొక్కలు నాటడానికి కారణం, ఇంకా వనసంరక్షణ కోసం ఏమేమీ చేస్తున్నానే విషయాలను గవర్నర్‌కు తెలిపారు. జీవిత కాలమంతా మొక్కలు నాటుతూనే ఉంటానని వివరించారు. గవర్నర్ రామయ్యకు పూలమొక్కను బహూకరిచారు. గవర్నర్‌ను రామయ్య భార్య జానకమ్మ కలిశారు. -
నిర్మాత తోట రామయ్య ఇక లేరు
శ్రీ భాస్కర్ ఫిలిమ్స్ పతాకంపై ‘రణధీరుడు’, ‘మళ్లీ ఇంకోసారి’ ‘రౌడీ’ చిత్రాలను నిర్మించిన తోట రామయ్య కన్ను మూశారు. శుక్రవారం రాత్రి 10.30 ప్రాంతంలో సికింద్రాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. ఆయనకు భార్య వసుంధర, కుమారుడు రాహుల్‌బాబు, కుమార్తె నీలిమ ఉన్నారు. సోమవారం బన్సీలాల్‌పేటలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయని తోట రామయ్య కుటుంబసభ్యులు తెలిపారు. -
లష్కర్‌బాబు.. జిల్లాకు చేసిందేమిటి?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు చేసిన మేలు ఏమీ లేదని.. 2014 ఆగస్టులో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయలేదని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించి దాదాపు 80–85 శాతం వరకు పూర్తి చేశారన్నారు. మిగతా పనులను తూతూ మంత్రంగా చేపట్టి వాటి గేట్లు ఎత్తుతూ సీఎం చంద్రబాబునాయుడు పెద్ద లష్కర్గా మారారని విమర్శించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే ఐజయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టుల ప్రారంభ సభల్లో వైఎస్ఆర్ పేరు ఎత్తకూడదనే ముచ్చుమర్రిలో ఎమ్మెల్యే ఐజయ్య, పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డిల నుంచి మైక్‌లు లాక్కున్నారన్నారు. అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేయించి దుశ్శాసన పర్వానికి ..బహిరంగ సభల్లో మాట్లాడితే రౌడీల ద్వారా మైక్ లాక్కోని రౌడీ రాజ్యాన్ని ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. గతంలో ముచ్చుమర్రి సభలో అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిడుతుంటే సీఎం ఆనందించడం వికృత ధోరణికి నిదర్శనమన్నారు. సిద్ధాపురం, ముచ్చుమర్రి పథకాలు ముమ్మాటికీ వైఎస్ఆర్ చలువతోనే ప్రారంభమయ్యాయన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు మరిచావా ? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని ఒక్క పెండింగ్ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మించకపోగా రాయలసీమకు గుండెకాయలాంటి గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణంపై నోరు మెదపడం లేదన్నారు. పక్క రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయన్న సాకుతో కనీసం సర్వే పనులు చేపట్టలేదన్నారు. జన్మభూమిలో సమస్యలకు పరిష్కారం లభించడం లేదని చాలామంది ప్రజలు వెళ్లడం లేదన్నారు. కొందరు ఏదో ఆశతో వెళితే టీడీపీ నాయకుల అధికార దాహానికి బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో లక్ష ఇళ్లను కట్టించలేని ప్రభుత్వం..ఏడాదిలో 19 లక్షల ఇళ్లను ఎలా కట్టిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పడమటి ప్రాంతాన్ని సీఎంపట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తే స్వయంగా చెప్పడం దేనికి నిదర్శనమన్నారు. టీడీపీకి ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారు – ఎమ్మెల్యే ఐజయ్య 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు ఆయన వ్యవహార తీరుతో సిగ్గుపడుతున్నారని ఎమ్మెల్యే ఐజయ్య పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎత్తకూడదని ముచ్చుమర్రి సభలో తన మైక్ , పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాస్‌రెడ్డి మైక్ లాగేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పని చేయించినందుకు సీఎం సిగ్గుపడాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ దళితులను కించపర్చుతుందని, రాష్ట్రపతి కోవిందు కుటుంబాన్ని అనుమతి లేని బోటులో విజయవాడ కృష్ణాబ్యారేజ్‌లో ఎలా విహారానికి తీసుకెళ్తుందని ప్రశ్నించారు. కేంద్ర, ప్రభుత్వ నిధులతో ఎస్సీ కార్పొరేషన్ ఇస్తున్న ఇన్నోవా కార్లపై సీఎం బొమ్మను తొలగించాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. రైతు రథం పేరుతో ట్రాక్టర్లన్నీ టీడీపీ వారికే ఇచ్చారని, ఇందులోఅర్హులు ఒక్కరూ లేరన్నారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, సత్యంయాదవ్, కర్నాటి పుల్లారెడ్డి, ధనుంజయాచారి, రాజావిష్ణువర్దన్‌రెడ్డి, విజయకుమారి, పర్ల శ్రీధర్‌రెడ్డి, రమణ, భాస్కరరెడ్డి, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు బీసీలను మోసం చేశారు..
-
రామయ్యకి తోడుగా జానకమ్మ
‘వృక్షో రక్షతి.. రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్ సైకిల్‌పై తిరిగే నా భర్తను చూసి.. ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు ఏమి అన్నా నేను మాత్రం నా భర్తను ఏమీ అనలేదు. ‘అనుకూలవతిౖయెన సుదతి దొరకుట పురుషుడి అదృష్టం’ అంటారు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య. అన్నట్టుగానే ఆయన ఆశయంలో, తలపెట్టిన లక్ష్యంలో తోడు, నీడై నిలిచింది భార్య జానకమ్మ. భర్త తలంచిన కార్యంలో ఆయనతో పాటు అడుగేసింది. రామయ్యకు మొక్కలపై ఉన్న ప్రేమతో ఆమె కూడా మొక్కలు నాటింది. కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్యను ఇటీవలే పద్మశ్రీ అవార్డు వరించిందని తెలిసి పద్మశ్రీ రావడం తమ బాధ్యతను మరింతగా పెంచిందనీ అందరూ వన ప్రేమికులమై ప్రపంచమంతా మొక్కలు నాటాలన్నదే తమ ధ్యేయం అని అంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ మాటలు... పులి ఉన్నా మొక్కలే ముఖ్యం ‘నేనే రోజూ గేదెల వెంట పోత. ఒకరోజు చేలల్లో రెడ్డోరి ఆవును పెద్ద పులి తిన్నదని ఊళ్లో అనుకున్నరు. అప్పుడు గేదెల వెంట పోవాలంటే భయపడ్డా. తోడు నువ్వురా అని ఆయనను అడిగా. గేదెల పాలు పోసి వెంటనే వస్తానని ఖమ్మం పోయిండు. ఎప్పుడు వస్తాడోనని భయపడుతూనే గేదెల మేపా. పొద్దుపోయినా రాలేదు. చీకటి పడింది. ఇంట్లో అన్నం వండుతుంటే వచ్చిండు. అప్పుడు ఆయన్ను చూసి కోపం వచ్చింది. ‘నన్ను పెద్దపులి తిన్నా రావా..?’ అని ఏడ్చా. పాలు పోసి మొక్కలు తెచ్చేందుకు వెళ్లా అని చెప్పాడు. ‘నువ్వు గేదెలు కాసేందుకు వెళ్లక ముందే చేలల్లకు పోయి చూసిన. ఎక్కడా పులి గుర్తులు లేవు. నక్కో, తోడేలో వచ్చింది. అంతే. అందరూ పెద్దపులి అని భయపడ్డారు. అంతా చూసే నేను రాలేదు’ అని అన్నాడు. పెద్దపులి ఉంటే నా భార్యకు ఏమవుతుందోనని భయపడి ముందే చేలల్లో చూసి వెళ్లిన ఆయనపై కోపం తగ్గింది. భార్యగా నా మీద, మొక్కల మీద, పిల్లల మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో అప్పుడు ఆర్థమైంది’.. తొమ్మిదో ఏటే పెళ్లైయింది మా అమ్మనాన్నలు శంకరమ్మ, వెంకట్రామయ్య. మాది తుమ్మలపల్లి గ్రామం కొణిజర్ల మండలం. ఆరుగురు మగవాళ్లం. ఇద్దరం ఆడోళ్లం. చిన్నప్పుడే అమ్మనాన్న చనిపోయిండ్రు. అమ్మమ్మ దగ్గరే పెరిగాం. రామయ్య ఊరు ముత్తగూడెం. నా తొమ్మిదో ఏటే పెళ్లయింది. అప్పుడు రామయ్య వయస్సు 15 ఏళ్లు. అప్పటికే ఆయన ఎక్కడికి పోయినా మొక్కలు నాటేవాడు. ముత్తగూడెం నుంచి రెడ్డిపాలెం వచ్చాం. ఇక్కడ మా పొలాలు ఉండడంతో వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉన్నాం. మాకు మగ్గురు కొడుకులు. ఇద్దరు ఆడపిల్లలు. ఒక కొడుకు అనారోగ్యంతో చనిపోయిండు. కుండలు చేయకుండా చెట్లబాట పట్టిండు మేము కుమ్మరోళ్లం. మా మామ లాలయ్య కుండలు చేసేవాడు. మా ఆయనకు కుండలు చేయడం రాదు. దీపాంతలు చేయడం ఒక్కటే తెలుసు. కొన్నాళ్లు మేళం వాయించాడు. కుండలు చేయడం రాకపోతే పిల్లలతో ఎలా బతకాలని బాధపడ్డా. ఉన్న పొలంలో కొంత నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పోయింది. మొక్కలు, చెట్లు అంటూ తిరిగి ఉన్న 3 ఎకరాలు అమ్మిండు. మళ్లీ కొన్నాళ్లకు పొలం కొన్నాం. గేదెల పాలు తీస్తే పోసి వచ్చేది. వీటితో వచ్చే పైసలతోనే కుటుంబాన్ని గట్టెక్కించా. ఎక్కడ విత్తనాలు కనిపించినా ఏరకవస్తాడు. వేప, సుబాబుల్, గానుగ, చింత గింజలు తెచ్చి నాకిస్తే వాటిని చాటలో చెరిగి పెట్టేదాన్ని. ఇవి తీసుకెళ్లి నర్సరీ పెట్టేవాడు. వాళ్ల అమ్మ బీర ఇత్తులు నాటిందని.. కుండలు చేయడానికి ఉపయోగించే మట్టి మా మామ తెచ్చిపోస్తే అందులో మా అత్త బీర ఇత్తులు నాటిందట. అవి పెద్దవై కాయలు కాశాయట. మా ఆయన కూడా వాళ్ల అమ్మను చూసి బీర ఇత్తులు పెట్టడంట. మొక్కలు నాటితే వాటి పండ్లు తినవచ్చని, భవిష్యత్ తరాలు బాగుంటాయని వాళ్ల అమ్మే చెప్పిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల ఆమ్మ మాటే పట్టుకొని మొక్కలు నాటుతుండు. ఒకసారి పొయ్యి కాడ పొంతకుండ పక్కనే మొక్క వేసిండు. ఇక్కడ వేడి ఉంటుంది ఎందుకు వేశావు అని అడిగాను. ‘పదును ఉంటుంది. బతుకుద్దిలే’ అన్నాడు. రెండు కోట్ల వరకు అయిన వేసిన మొక్కలు ఉన్నాయి. బాట వెంట పోయే వాళ్లందరూ ఇవి రామయ్య వేసిన మొక్కలు అని అంటే మా ఆయన గొప్పతనం నాకు తెలిసేది. పిచ్చోడు అన్నవారు.. ఆశ్చర్యపోతున్నారు.. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్ సైకిల్‌పై తిరిగే నాభర్తను చూసి ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు ఏమి అన్నా నేను నా భర్తను ఏమీ అనలేదు. మొక్కలంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో చూసి మొక్కలు నాటమనే చెప్పా. అప్పుడు ఆయనను చూసి నవ్వినవాళ్లు, పిచ్చోడు అన్నవాళ్లు పద్మశ్రీ అవార్డు రావడం చూసి ఆశ్చర్య పోతుండ్రు. ఇంతకన్నా నాకు సంతోషం ఏం కావాలి..? తోడుగానే ఉంటా.. ఇప్పుడు ఆయన వయస్సు 77 ఏళ్లు. జీవితాంతం ఆర్థాంగిగా తోడు ఉంది ఆయన్ను బాధపెట్టకుండా మొక్కలు నాటడంలో తోడు ఉండటమే నా పని. ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తే నర్సరీ ఏర్పాటు చేస్తాం. మొక్కలు పెంచి ప్రజలకు ఇవ్వాలన్నది మా తపన. మా పిల్లలు కూడా ఆయనలా మొక్కలు నాటి సమాజంలో పేరు తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. నా భర్తను అందరూ ‘వనజీవి’ రామయ్య అంటారు. ఇప్పుడు ఈ ఆవార్డుతో ‘పద్మశ్రీ రామయ్య’ అంటున్నారు. మా ఇంటికి వచ్చి కార్లల్లో తీసుకెళ్లి సన్మానం చేస్తున్నారు. మనవరాళ్ల పేర్లు.. కబంధపుష్పం, హరితలావణ్య ఆయనకు పిల్లలు, మనవరాళ్లు అంటే ప్రాణం. మనువరాళ్ల పేర్లు ఏమి పెట్టాలని పిల్లలే ఆయన్ను అడిగేవారు. మొక్కల మీద ఉన్న ప్రేమతో మనవరాళ్లకు ‘కబంధపుష్ప, వనశ్రీ, చందనపుష్ప, హరితలావణ్య’ అని పేర్లు పెట్టాడు. ఐదో తరగతి చదువుకున్న ఆయన రోజూ పుస్తకం తీసుకొని అందులో చెట్లు, మొక్కలపై సూక్తులు రాస్తాడు. చెట్లు నాటితే మనషుల లోకం ఎలా ఉంటుందో నాకు చెప్పుతాడు. ఆయనకు తెలిసిన ప్రాంతమంతా మొక్కలే నాటిండు. మా ఇంట్లో, ఊళ్లో, రోడ్ల వెంట ఎక్కడ చూసినా ఆయన నాటిన మొక్కలే. జానకమ్మ .. నా క్లాస్మెంట్.. ‘ఆడది కారం వేసుకొని తినాలి.. మగాడు కోడిగుడ్డు తినాలి అని ఎనకట పెద్దలు చెప్పేవాళ్లు. ‘ఆడోళ్లు మగాడితో సమానంగా వరి కోస్తరు, మోపులు మోస్తరు. ఎడ్లకు వరిగడ్డి వేస్తరు. పాలిచ్చే గేదెలకు పచ్చిగడ్డి పెడతరు. మగాళ్లకు బాధ తెలియకుండా పిల్లలను పెంచుతరు. వారికి పౌష్టికాహారం పెట్టాలి. మగాడు కారం తినాలి. ఆడది గుడ్డు తినాలి అంటాను నేను. అప్పుడే కుటుంబం ఇల్లు చక్కగా ఉంటుంది. నేనూ జానకమ్మ స్నేహితుల్లా ఉంటాం. ఆమెపై ఎప్పుడూ పెత్తనం చేయను. మొక్కలు నాటాలని ప్రచారానికి వెళ్లే నాకు సైకిల్ మధ్యలో ఎక్కడైనా పంక్చర్ అవుతుందేమోనని పదిరూపాయలు తెచ్చి నా జేబులో పెట్టేది. నేనంటే జానకమ్మకు అంతటి ప్రేమ. నేను నమ్మిన సిద్ధాంతానికి నా వెంటే జీవితాంతం తోడై నడుస్తోంది. మా ఇద్దరి ఆశయం ఒక్కటే. దేశంలో గ్రీన్ కరెన్సీ రావాలి. ప్రపంచం మన దేశాన్ని ‘పచ్చని భారతదేశం’ అని చెప్పుకోవాలి. – ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత రామయ్య – బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం -
గణేశ్ నిమజ్జనంలో అపశృతి
అర్ధవీడు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఎగ్గెన్నపల్లిలో విషాదం చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జనంలో అపశృతి జరిగింది. స్థానిక ఎనమలేరు వాగులో గణేశుడి నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రామయ్య(60) అనే వృద్ధుడు అదుపుతప్పి నీళ్లలో పడిపోయాడు. తోటివారు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మృత దేహాన్ని వెలికి తీశారు. రామయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు. పండగ పూట ప్రమాదం జరగడంతో గ్రామలు విషాదఛాయలు అలుముకున్నాయి. -
గురువులదే గురుతర బాధ్యత
సందర్భం ఇప్పటికీ నూటికి 95 శాతం మందికి పైగా ఉపాధ్యాయులు బాగా పనిచేయాలనే కోరిక కలిగిన వారే. విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు అమి తంగా సంబరపడేది గురువే. అందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి. డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ గొప్ప వేదాంతి మాత్రమే కాదు, సమున్నత రాజనీతి జ్ఞునిగా విద్యారంగంలో రాబోయే పరిణామాలు ఎంతో ముందుగానే ఊహిం చారు. ఆయన జన్మదినాన్ని ఉపాధ్యాయవర్గానికి అంకితం చేసి ఉపాధ్యాయ దినోత్స వంగా జరుపుకోవటం సముచితం. రాధాకృష్ణన్ జీవించి ఉన్నప్పటి పరిస్థితులకూ, నేటి పరిస్థితులకూ ఎంతో తేడా ఉన్నది. విద్యారంగంలో మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. విద్యా రంగంలో వచ్చే ప్రతి మార్పు తదనుగుణంగా ఉపాధ్యా యలోకంలోనూ మార్పుని కాంక్షిస్తుంది. 21వ శతా బ్దంలో సమాజ ప్రగతికి పునాది విద్యారంగమే అనే భావన ఈనాడు యావత్ ప్రపంచంలో ఏర్పడింది. అంటే 21వ శతాబ్దంలో సమాజంలో కీలకపాత్రధారులు ఉపాధ్యాయులే. మునుపటి కంటే గొప్ప టీచర్లను తయారు చేసుకోవాల్సిన అవసరం నేడు ఎంతగానో పెరిగిందని అర్థం. ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన దేశానికీ, ఈ సమాజానికీ ఒక గొప్ప ఉపాధ్యాయుడినీ, ఒక గొప్ప భవిష్యత్‌ను ఇవ్వనున్నామనే హామీని ప్రజలు కోరుకుంటున్నారు. ఉపాధ్యాయుడనేవాడు ఆకాశంలోనుంచి ఊడిపడడు. సమాజం నుంచే వస్తాడు. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా టీచర్‌కు సమున్నత స్థానమే ఇచ్చారు. మన సంస్కృతిలో మాతృదేవో భవ, పితృ దేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లి, తండ్రి తరు వాత గురువుకు స్థానం కల్పించారు. నేటి ఉపా ధ్యాయతరం దీనిని గుర్తించాలి. ఒక గొప్ప టీచర్‌గా మన పాత్ర ఏమిటనేది ఆలోచించాల్సిన సందర్భం కూడా ఇదేనని నా అభిప్రాయం. ప్రతిరోజు ఉపాధ్యాయుల గురించి రకరకాల కథనాలు, వ్యాఖ్యానాలు మీడియాలో వస్తుంటాయి. నేను ప్రతీరోజూ ఒక పాఠశాలను సందర్శిస్తుంటాను. ఉపాధ్యాయులతో మాట్లాడుతుంటాను. కాబట్టి వాస్త వాలకూ, వదంతులకూ చాలా తేడా ఉంటుంద న్న విషయం గ్రహించాను. ఇప్పటికీ నూటికి 95 శాతం మందికి పైగా ఉపాధ్యాయులు బాగా పనిచేయాలనే కోరిక కలిగిన వారే. విద్యార్థులు ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు అమితంగా సంబరపడేది ఉపా ధ్యాయుడే. ప్రభుత్వం, మీడియా, సమాజం ఉపా ధ్యాయులకు సరైన వాతావరణాన్ని కల్పించాలి. నూటికి తొంభయ్ శాతంగా ఉన్న ఉపాధ్యాయుల చిత్తశుద్ధినీ, విద్యాబోధనలో వారు అనుసరిస్తున్న నూతనత్వాన్నీ, పద్ధతులను, ప్రజల దృష్టికి తెస్తూ తగిన ప్రోత్సాహం ఇస్తే ఉపాధ్యాయ లోకం తన బాధ్యతలను ఇప్పటికంటే మెరుగ్గా చేయగలరనే నమ్మకం నాకున్నది. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో మీడియా ఈ విషయంలో క్రియాశీలకమైన పాత్ర నిర్వహిస్తున్నది. విద్యారంగంలో జరుగుతున్న వినూత్న ప్రయోగాలకు ప్రచారం కల్పి స్తున్నది. అటువంటి ప్రయత్నాలు అన్ని చోట్లా జరగాలి. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో టీచర్ నియామక విధానంలో మార్పులు చేసి, సమర్థవంతమైన ఉపా ధ్యాయుల ఎంపికపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ల ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో మూడు అంశాలు ప్రధానమైనవి. మొదటిది విద్యాపరమైన సమర్థత, రెండవది వృత్తిపరమైన సమర్థత. మూడవది ప్రతిభ. విద్యాపరమైన, వృత్తిపరమైన సమర్థత విష యంలో నియామక సంస్థ చేయగలిగేది పెద్దగా ఏమీ ఉండదు. ప్రతిభను గర్తించటం వరకే దాని విధి. ప్రతిభ వ్యక్తికి సంబంధించినది. సమర్థతకు గీటురాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని సర్వీస్ కమిషన్ ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. ఉపాధ్యాయుల వృత్తిపరమైన సమర్థత ఉపాధ్యాయవిద్యపై ఆధారపడి ఉంటుంది. నేడు విద్యారంగంలో ప్రమాణాల పెంపు ఒక సవా లుగా మారింది. ఇప్పటికీ డ్రాప్‌అవుట్ రేట్ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండడం కలవరపెట్టే అంశం. డ్రాప్‌ఔట్ రేట్‌ను సరిగ్గా నియంత్రించలేకపోవటమంటే విద్యా రంగంలో మన వైఫల్యాన్ని అంగీకరించటమనే అర్థం. ఆశించిన స్థాయిలో ప్రతిభ చూపలేకపోతున్న పిల్లలు, డ్రాప్‌ఔట్ అవుతున్న పిల్లల గురించి మరింత లోతుగా, శాస్త్రీయంగా అధ్యయనం జరగాలి. సరైన ప్రతిభ చూపని పిల్లలు, డ్రాప్‌ఔట్ అవుతున్న పిల్లలు విద్యకు పనికి రారు అనే భావనను తొలగించాలి. లేకుంటే దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం. మరో ముఖ్యమైన అంశం పబ్లిక్ - ప్రైవేట్ రంగాల పాత్ర. ఈనాడు ప్రభుత్వాలే అంతా చేయగలిగే పరిస్థితులు లేవు. ప్రైవేట్ రంగంతో సామ రస్యపూర్వకంగా ఉంటూ పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో విద్యారంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలి. విద్యారంగం ఎంతగా బలోపేతం అయితే, సమర్థవంతమైన టీచర్లు ఎంతగా పెరిగితే దేశభవిష్యత్తు అంత బాగుంటుంది. వ్యాసకర్త: చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు -
ట్రాక్టర్ సహా బావిలో పడి రైతు
పొలం దున్నుతూ ట్రాక్టర్‌తోపాటు ఓ రైతు బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు, రైతు బోయిని రామయ్య మంగళవారం ఉదయం పొలం దున్నేందుకు వెళ్లాడు. అయితే, ఆక్రమంలో ప్రమాదవశాత్తు పొలంలోనే ఉన్న బావిలో ట్రాక్టర్‌తోపాటు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
బీజేపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం : వర్ల రామయ్య
చిత్తూరు: రాష్ట్రంలో బీజేపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్పష్టం చేశారు. శనివారం చిత్తూరులో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపు, హోదా విషయంలో కేంద్ర మంత్రి అరుణ్‌జెట్లీ రాష్ట్ర ప్రజలను అవమానపరచారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో బీజేపీ వ్యతిరేకంగా ఉంటూ ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయలేక పోతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీకి మనుగడ ఉండదని బీజేపీ నాయకులకు తెలిసిపోయిందన్నారు. ఈ కారణంగానే బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై కన్నెత్తి చూడటంలేదని దుయ్యబెట్టారు. రాష్ట్ర విభజనలో చట్టంలో ఉన్న అంశాలపై రోజుకో మాట మారుస్తున్నారని వెంకయ్యనాయుడిపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటూ పోలవరం, పింఛన్లు, గృహ నిర్మాణాలకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వాన్ని పరిస్థితి అని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాడుతున్నారని, ఇందుకు ఆయన ఆందోళనలో పడి మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబును అవమానిస్తే ఊరుకోమని, పార్లమెంట్లో ప్రధానమంత్రి మోడీని నిలబడుతామన్నామన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి సమయం కావాలని కోరుతున్నారని, ఈ కారణంగానే మౌనంగా ఉన్నామని తెలిపారు. -
అన్నదానానికి రూ. లక్ష విరాళం
భద్రాచలం: శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, కృష్ణ జిల్లా, విజయవాడకు చెందిన లక్కరాజు రాంప్రసాద్, రమాదేవి దంపతులు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఉదయం ఆలయానికి వచ్చిన వారు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఏఈఓను కలిసి లక్కరాజు కమలాదేవి పేరు మీద ఈ విరాళాన్ని అందజేశారు. -
'ఎవరి జోక్యం లేకుండా చూడాలి'
-
జంబో ఫ్యామిలీ
ఓ తాతయ్య కుటుంబంలో 111 మంది సభ్యులున్నారు. ఆయన 95వ పుట్టిన రోజున వారంతా ఒక్కచోట చేరి వేడుకలు ఘనంగా జరిపారు. ఈ అపూర్వ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన చాకలి రామయ్య 95వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామయ్య, అంతమ్మ దంపతుల ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలతో పాటు మరో వందమంది మనవలు, మనవరాళ్లు, మనిమనవలు, మునిమనవరాళ్లు హాజరయ్యారు. కుటుంబ సభ్యులంతా హాజరైన ఈ వేడుకలో తాతగారు కేక్ కట్ చేయించడంతో పాటు బంగారు పాత్రలో పాలు తాగారు. తాతగారి వేడుక కోసం ఎక్కడెక్కడో స్థిరపడిన మనవలు, మనవరాళ్లు తరలిరావడంతో ఊరంతా సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆయన కుమారులు మాట్లాడుతూ.. తమ తండ్రి ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన వందో పుట్టినరోజును వైభవంగా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. -
మావోల చేతిలో యువకుని హతం
గొడ్డలితో నరికిచంపిన మావోయిస్టులు పోలీసులకు సహకరిస్తున్నాడని చంపామంటూ ప్రకటన కన్నీరుమున్నీరయిన తల్లిదండ్రులు ముంచంగిపుట్టు: పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడనే నెపంతో విశాఖ ఏజెన్సీలోని ముంచంగిపుట్ మండలంలోని బూసిపుట్టుకు చెందిన పాంగి రామయ్య (19)ను మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం రాత్రి సాయుధులైన మావోయిస్టులు గ్రామం నుంచి రామయ్యను సమీపంలోని ప్రధాన రహదారి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ అతడ్ని గొడ్డలితో నరికి చంపారు. సంఘటన స్ధలంలో సీపీఐ మావోయిస్టు పెదబయలు ఏరియా కమిటీ పేరిట ఓ లేఖను విడిచిపెట్టారు. రెండు సంవత్సరాలుగా రామయ్య ముంచంగిపుట్టు ఎస్ఐ, పోలీసులతో సంబంధాలు పెట్టుకొని బూసిపుట్టు ఏరియాలో అరెస్టులకు దాడులకు కారకుడయ్యడని ఆ లేఖలో పేర్కొన్నారు. పలుమార్లు ప్రజలు, పార్టీ హెచ్చరించిచా మార్పు రానందునే చంపాల్సి వచ్చిందని వివరించారు. ‘రాత్రి మావోలు ఇంటికి వచ్చారు.. మా బిడ్డగురించి అడిగారు. లేడని చెప్పాం. అయినప్పటికీ వీడకుండా పక్క వీధిలో పడుకుని ఉన్న రామయ్యను బలవంతంగా తీసుకువెళ్లి చంపారని’ మృతుడి తల్లిదండ్రులు పాంగి.జోగి, ముత్తాయిలు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈసంఘటన మండలంలో సంచలనమైంది. -
తోక తెగిన కోతి!
అనగనగా ఒక రోజు మేస్త్రీలు, వడ్రంగులు ఒక అందమైన భవనాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. అందరూ శ్రద్ధగా రకరకాల పనులు చేస్తుండగా చెట్లపై నుండి కొన్ని కోతులు చూడసాగాయి. కాసేపటి తర్వాత అందరూ భోజనానికి వెళ్లారు. రామయ్య అనే ఒక వడ్రంగి మాత్రం పనిలో మునిగిపోయాడు. అతను ఒక పెద్ద దుంగను నిలువుగా రెండు ముక్కలుగా చేయాలనుకున్నాడు. రంపంతో ఆ దుంగను కోయసాగాడు.అక్కడే చెట్టు మీద ఉన్న కోతుల్లో ఒకటి రామయ్య చేసే పనిని గమనించసాగింది. చాలా సేపటి తర్వాత రామయ్యకు ఆకలి వేసింది. పని ఆపు చేశాడు. రామయ్య దుంగను మధ్య దాకా మాత్రం కోశాడు. కోయవలసిన జాగా గుర్తు కోసం అక్కడ ఒక ఇనుపసీలను దిగ్గొట్టాడు. భోజనం చేసేందుకు వెళ్ళి పోయాడు. అతడు వెళ్ళగానే కోతి కిందకు దిగి. ఆ దుంగ చుట్టు తిరిగి, వడ్రంగి చేసిన పనిని పరిశీలించింది. దుంగకు మధ్యలో దిగ్గొట్టిన ఇనుప సీలను రెండుచేతులతో బలంగా లాగసాగింది. దాని తోక దుంగ చీలిక మీద వేలాడుతోంది. అలా ఊపుతుంటే కోతి చేతిలోనికి ఆ సీల ఊడి వచ్చింది. దాంతో దుంగ కోసిన రెండు సగాలు గట్టిగా కొట్టుకొని కలసిపోయాయి. కోతి తోక ఆ సీలకు, దుంగకు మధ్య చిక్కుకు పోయింది. దుంగ రెండు సగాలు కొట్టుకోవడం వల్ల తోక బాగా నలిగిపోయింది. గట్టిగా అరుస్తూ కోతి బలంగా తోకను లాక్కొంది. దానితో తోక తెగిపోయింది. తెగిపోయిన పొడవైన భాగం ఆ దుంగలో ఇరుక్కుపోయి అలాగే ఉండి పోయింది. నీతి: తెలియని వస్తువులతో ఆటలాడరాదు. ఆపదలు కొని తెచ్చుకోరాదు. -
సమస్యను సాధించండిలా...
రామయ్య సార్ నా తొలి ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా ఒక రోజు భిన్నాల సూక్ష్మీకరణ గురించి బోధిస్తున్నాను. ముందుగా ఒక అంకె సంఖ్య గల భిన్నాలను ఎలా సూక్ష్మీకరించాలో చెప్పాను. అంటే అని అని సమస్యను సాధన చేస్తూ వివరించాను. తర్వాత రెండంకెల భిన్నాల గురించి బోధించాను. అంటే అని సాధన చేశాను. 19ణ1=19, 195=95 అని వివరిస్తూ లవాన్ని 1తో, హారాన్ని 5తో కొట్టివేసి సమాధానం అని రాశాను. ఇంతలో ఒక విద్యార్థి లేచి సార్! అలా కాకుండా ఒక అంకె సంఖ్యగల భిన్నాలను కొట్టివేసినట్లుగా దీనిలో కూడా లవంలో 9, హారంలో కూడా 9 ఉంది.కదా! ఆ రెండింటిని కొట్టివేసినా సమాధానం వస్తుంది కదా అన్నాడు. అప్పుడు నేను అవును అది కూడా నిజమే కదా అని ఆలోచించి మొదటగా ఆ భిన్నం స్ట్రక్చర్‌ను గమనించాను. అంటే లో లవంలో 9 అనేది ఒకట్ల స్థానంలో ఉంటే, హారంలో 9 అనేది పదుల స్థానంలో ఉంది. అంటే కొట్టివేసే సంఖ్య అనుకుంటే ఆ భిన్నం అవుతుంది. దాని అర్థం లవంలో ్ఠ అనేది ఒకట్ల స్థానంలో, హారంలో ్ఠ అనేది పదుల స్థానంలో ఉంది. కాబట్టి ఈ విధంగా రాశాను.అయితే రెండు భిన్నాలు సమానం కావాలంటే వాటి ప్రతి లబ్ధం సమానం కావాలి. అంటే ఎప్పుడవుతుంది అంటే ్చఛీ=ఛఛి అయినప్పుడు మాత్రమే. ఆ విధంగా అంటే 5(10) = 1(10+5) 50+5= 10+5 5= 45 9 అంటే విలువ 0, 9 మధ్యలో ఉంటే ఇది సాధ్యమవుతుంది. గణిత భాషలో 09 అయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు విలువ అనేది భిన్నంలో అంకె కాబట్టి అలా కొట్టివేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆదేవిధంగా అని రాయవచ్చా లేదా అనేది చూద్దాం. అయితే ఈ భిన్నంలో ్ఠ అనేది లవంలో ఒకట్ల స్థానంలో, హారంలో పదుల స్థానంలో ఉంది. కాబట్టి భిన్నాన్ని ఈ విధంగా రాశాను. 9 (50) = 5 (10+9) 450+9 = 50+45 41 = 395 9.6 /10 అవుతుంది. అంటే ఈ భిన్నంలో ్ఠ విలువ 9 దాటి పోయింది. కాబట్టి భిన్నాన్ని కొట్టివేయడానికి వీలు లేదు. అదే విధంగా ని కొట్టివేయడానికి వీలుంటుదేమో చూద్దాం.అంటే పై భిన్నంలో లవంలో ఒకట్ల స్థానంలో 6, హారంలో పదుల స్థానంలో 6 ఉంది. కాబట్టి భిన్నాన్ని ఈ విధంగా రాశాను. 5(20) = 2(10+5) 100+5= 20+10 15= 90 6 విలువ భిన్నంలో అంకే కాబట్టి ఈ భిన్నాన్ని అలా కొట్టివేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ప్రతి సమస్యను విశ్లేషిస్తే క్లిష్టమైన ప్రశ్నలను సులువుగా సాధించవచ్చు. విద్యార్థుల మేధస్సుకు ప్రశ్నలు 1. ; ఇక్కడ ఉపయోగించిన అక్షరాలకు ఏ ‘అంకెలు’ ఇవ్వగలిగితే ఒకై అనే సంఖ్యను ్ఖఓతో భాగిస్తే భాగఫలం ైఓ వస్తుంది? 2. అయితే భాగఫలం 123 వచ్చే విధంగా సమస్యను సాధించండి? గమనిక: పై సమస్యలకు మీరు కూడా సులువైన, సరళమైన పద్ధతిలో సాధించి వివరణ పంపవచ్చు. కొత్త పద్ధతిలో పరిష్కారాలను పంపిన విద్యార్థుల పేర్లను ప్రచురిస్తాం. ఈ-మెయిల్: sakshieducation@gmail.com -
ఒక శవం.. మృతులిద్దరు..
లింగంపేట : మండలంలోని శెట్పల్లి శివారులో గత నెల 26న వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ శవం విషయం రాద్దాంతమవుతోంది. శవం మాదంటే మాదని ఇరు వర్గాల బాధితులు ముందుకు వచ్చారు. దీంతో శవమెవరిదో తేలక పోలీసులు సతమతమవుతున్నారు. ఈ మేరకు డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపారు. శెట్పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ కుళ్లిన శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎల్లారెడ్డి సీఐ రామకృష్ణ, లింగంపేట ఎస్సై పల్లె రాకేశ్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడిని పిలిచి అక్కడే పోస్టుమార్టం చేశారు. మృతి చెందిన మహిళ చీర, జాకెట్, మెడలో ఉన్న నల్లపూసల దండ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారాన్ని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు చేరవేసారు. అప్పు చెప్పిన కథ ఇదీ.. నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన ద్యానబోయిన రామయ్య అనే వ్యక్తి తన పెద్దకూతురుతో కలిసి లింగంపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మృతురాలి వస్తువులను చూసి ఆమె తనకూతురు(పేరు రామవ్వ)అని నిర్ధారించారు. పిట్లం మండలం తిమ్మానగర్‌కు చెందిన సంజీవులు అనే వ్యక్తి కి తన కూతురు 60 వేలు అప్పుగా ఇచ్చిందని, అవి అడిగినందుకే హత్యచేసి ఉంటారని తండ్రి పోలీసులకు చెప్పాడు. పోలీసులు సంజీవులును అదుపులోకి తీసుకుని విచారించారు. రామవ్వను నేనే హత్యచేసానని అంగీకరించినట్లు తెలిసింది. సెల్ ఫోన్ చెప్పిన కథ ఇదీ.. ఈ నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా హత్య చేసావో చూపాలని నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెవెళ్లగా అక్కడికి కొద్ది దూరంలో సెల్‌ఫోన్ లభించింది. అది నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి తండాకు చెందిన దెగావత్ శారదకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. శారద కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈక్రమంలో పోలీసులు లింగంపేట మండలం మోతె తండాకు చెందిన శారద తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా మృతురాలి వస్తువులను చూపించగా ఇవి తన కూతురు(శారద)వేనని తండ్రి తులసీరాం చెప్పాడు. దీంతో పోలీసులు ఇంతకీ మృతదేహం ఎవదనేది తేలక సతమతమవుతున్నారు. ఒక మహిళ మృత దేహం కోసం రెండు కుటుంబాలు మాదంటే మాదనడంతో వారిని పోలీసులు డీఎన్ఏ పరీక్షలకు సిఫారసు చేసారు. ఒకే మహిళ శవం కోసం ఇద్దరు పోటీ పడుతుండటంతో అసలు నిజాన్ని వెలికితీయాలని జిల్లా ఎస్పీ తరుణ్‌జోషీ ఆదేశించారని పోలీసులు తెలిపారు. -
రియల్టర్ ఆత్మహత్య
మృతుడు విశ్రాంత పోలీస్ అధికారి కుమారుడు తండ్రి రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణం బెంగళూరు : విశ్రాంత పోలీస్ అధికారి కుమారుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీ నగర పోలీసుల సమాచారం మేరకు... విశ్రాంత డీసీపీ రామయ్య కుమారుడు రాఘవేంద్ర (34). రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అతను ఇసుక దందా చేస్తున్నాడు. సోమవారం ఉదయం తన ఇంటి నుంచి స్కార్పియో వాహనంలో బయటకు వచ్చిన అతను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆర్టీ నగరలోని తరళబాళు రోడ్డులో ఉన్న ఓ పెద్ద భవనం పక్కన వాహనాన్ని ఆపించాడు. అనంతరం తన డ్రైవర్ మంజునాథ్‌కు ఓ సీల్డ్ కవర్ ఇచ్చి ఇంటిలో ఇవ్వమని పంపాడు. ఓ ఆటోలో మంజునాథ్ వెళ్లిపోయిన తర్వాత స్కార్పియోలోనే కూర్చొని రివాల్వర్‌తో ఎదపై కాల్చుకున్నాడు. మధ్యాహ్నం 2.15 గంటలకు అటుగా వెళ్తున్న వారు స్కార్పియో లోపల రక్తపు మడుగులో పడి ఉన్న రాఘవేంద్రను చూసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే రాఘవేంద్రను కొలంబియా ఏషియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న బెంగళూరు నగర అదనపు పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, డీసీపీ సందీప్ పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు తన తండ్రి రామయ్యకు చెందిన లెసైన్స్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు గుర్తించారు. ఇంటికి పంపిన సీల్డ్ కవర్లో నాలుగు ఉత్తరాలు ఉన్నాయని డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. తండ్రి, తల్లి, భార్య, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వేర్వేరుగా ఉత్తరాలు రాసినట్లు వివరించారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. కాగా, రాఘవేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్ : ముగ్గురి మృతి
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం వ్యాపారం కోసం వస్తూ అనంత లోకాలకు కారటగి, న్యూస్‌లైన్ : వ్యాపారం కోసం బయల్దేరిన ముగ్గురు స్నేహితులను మృత్యురూపంలో వచ్చిన బస్సు కబలించింది. కలిసిమెలిసి తిరిగిన ఆ ముగ్గురూ మృత్యువులోనూ కలిసే అనంతలోకాలకు ప్రయాణమయ్యారు. ఈ ఘటన చందనహళ్లి క్రాస్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముదుగల్‌కు చెందిన జమీర్ (21), రామయ్య (20), బీజాపూర్‌కు చెందిన సోహైల్ (19) మాంసం వ్యాపారం చేసుకుంటూ జీవనం గడిపేవారు. వ్యాపారాలకు కలిసి వెళ్తూ స్నేహితులుగా మారారు. వ్యాపారం నిమిత్తం ముగ్గురూ మంగళవారం సింధనూరుకు వెళ్లారు. బుధవారం మధ్యాహ్నం బైక్‌పై కారటగికి వెళుతుండగా పట్టణ శివార్లలోని చందనహళ్లి క్రాస్ వద్ద అతి వేగంగా వచ్చిన కొప్పళ-హైదరాబాద్ బస్సును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురూ ఘటన స్థలంలోనే మృతి చెందారు. సీఐ ప్రభాకర్, ఎస్ఐ ఉదయ రవి, కనకగిరి ఎస్ఐ వీరణ్ణ ఘటనా స్థలానికి చే రుకుని మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలకు రవాణ శాఖ నుంచి పరిహారం కల్పిస్తామని రవాణ శాఖ సంచాలకులు పీఎస్.వస్త్రాద్, డిపో వ్యవస్థాపకులు కేఎల్.చంద్రశేఖర్, గంగావతి బస్టాండ్ కంట్రోలర్ శివనగౌడ హామీ ఇచ్చారు. అంత్యక్రియల కోసం రూ.5 వేలు చొప్పున మృతుల కుటుంబ సభ్యులకు సహాయ ధనం అందజేశారు. ఇదిలా ఉండగా ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. -
దొంగలకు.. దొంగలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: సహకార రంగంపై అవగాహన ఉన్న వారు ఎవరిని కదిలించినా.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పరిధిలో జరిగిన కుంభకోణం దేశంలో ఏ సహకార సంస్థలోనూ జరిగి ఉండదని చెబుతున్నారు. అంతే కాదు, ఈ వ్యవహారం గురించి సీరియస్‌గా తీసుకుంటే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఎక్కడ డీసీసీబీ గుర్తింపును రద్దు చేస్తుందోనని ఆందోళన కూడా చెందుతున్నారు. దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన నిధుల గోల్మాల్ వ్యవహారంపై డీసీసీబీ వర్గాలు అంత సీరియస్‌గా ఏమీ లేవు. తూతూ మంత్రంగా తొలుత ప్రాథమిక విచారణ జరిపించి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. నిధుల గోల్మాల్ వ్యవహారం బయటపడి రెండు నెలలు కావస్తున్నా, నిందితుడిగా గుర్తించి సస్పెండ్ చేసిన ఏజీఎం రామయ్యను ఇంత వరకూ అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైన దేవరకొండ సహకార బ్యాంకు కుంభకోణంలో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేవరకొండ బ్రాంచ్‌లో జరిగిన నిధుల గోల్మా ల్ వ్యవహారం మొత్తంగా జిల్లా సహకార రంగానికే మాయని మచ్చలా తయారైంది. డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు అధికారులు నూటికి నూరు శాతం సహకారం అందించడం వల్లే నిధులు ఇబ్బడిముబ్బడిగా దేవరకొండ శాఖకు బదిలీ అయ్యాయని చెబుతున్నారు. సహకార బ్యాంకుల ద్వారా నాన్ కమాండ్ ఏరియాలో ఎకరాకు రూ 20వేలు, గరిష్టంగా రూ 80వేలకు మించకుండా క్రాప్ లోన్స్‌కు పరిమితి ఉంది. అదే కమాండ్ ఏరియాలో గరిష్టంగా రూ లక్ష దాకా రుణం ఇవ్వొచ్చు. అదీ కచ్చితంగా ప్రాథమిక సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులకు మాత్రమే. కానీ, ఎవరికి బడితే వారికి ఇష్టం ఉన్న రీతిలో రుణాలు ఇచ్చారు. ఇదంతా స్వాహా చేయడం కోసమేనని ఇపుడు బయట పడుతోంది. పీఏపల్లి, తిమ్మాపురం, దేవరకొండ, చిత్రియాల్ సంఘాలకు సంబంధించి 2009-2013 సెప్టెంబరు దాకా ఏకంగా రూ 27కోట్లు అలాట్ అయినట్లు గుర్తించారు. అధికారులు చేసిన ప్రాథమిక విచారణ తర్వాత కేవలం 2012-13 సంవత్సరానికి 3.50కోట్ల రూపాయలు లెక్క తేలింది. గడచిన నాలుగేళ్లుగా దేవరకొండ బ్రాంచ్‌లో అక్ర మాలు యథేచ్ఛగా జరుగుతున్నా ఎవరూ ఆవైపు కన్నెత్తి చూడలేదు.