ఖరీదైన తప్పులు చేశాం.. 'భోళా శంకర్' నిర్మాత షాకింగ్ ట్వీట్ | Producer Anil Sunkara Shares Interesting Post On Ooru Peru BhairavaKona Movie, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Anil Sunkara: ఆ తప్పులు మళ్లీ జరగకూడదనే మా ప్రయత్నం.. అందుకే!

Published Mon, Oct 16 2023 5:42 PM | Last Updated on Mon, Oct 16 2023 5:58 PM

Producer Anil Sunkara Tweet On Ooru Peru BhairavaKona Movie - Sakshi

సినిమాలన్నాక హిట్, ఫ్లాప్ సాధారణ విషయం.  ఈ రోజు ఫెయిల్ అయిన హీరో.. మరో సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు. దర్శకులు, నిర్మాతల విషయంలో ఇలానే జరగొచ్చు. అయితే ఈ ఏడాది నిర్మాత అనిల్ సుంకర మాత్రం స్టార్ హీరోల సినిమాల దెబ్బకు చాలా దారుణమైన నష్టాల్ని చూశారు. ఇక ఆయన తీస్తున్న మరో సినిమా ఉందా? లేదా?  అనే రూమర్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ ప్రొడ్యూసర్ షాకింగ్ ట్వీట్ చేశారు.

నిర్మాత అనిల్ సుంకర.. ఈ ఏడాది పలు సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన తీసిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు ఈయనకు చాలా నష్టాన్ని మిగిల్చాయి. వీటి నుంచి కోలుకోవడానికి మరికొన్నాళ్ల సమయం పడుతుంది. ఇలాంటి టైంలో ఈయన నిర్మిస్తున్న 'ఊరు పేరు భైరవకోన' మూవీ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. వీటిపై స్పందిస్తూ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)

'మేం ఖరీదైన తప్పులు చేశాం. అవి రిపీట్ కాకూడదని ప్రయత్నిస్తున్నాయి. అలానే సినిమాకు వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసం కావాల్సిన సమయం కేటాయిస్తున్నాం. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాగానే 'ఊరుపేరు భైరవకోన' రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. రెండో పాట త్వరలో రిలీజ్ చేస్తాం' అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌లో భాగంగా ఖరీదైన తప్పులు అన్నది ఏజెంట్, భోళా శంకర్ గురించే. ఇకపోతే సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఊరుపేరు భైరవకోన' చిత్రం.. 2021 సెప్టెంబరులో లాంచ్ అయింది. ఓ ఎనిమిది నెలల ముందు పాట.. ఐదు నెలల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అందుకే ఈ సినిమా ఆగిపోయిందా అనే రూమర్స్ వచ్చాయి. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement