కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇచ్చారు ‘భోళా శంకర్’ చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మోహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి చాలా స్టైలిష్‌గా కనపడుతున్నారు.
చేతికి తాయత్తులు కట్టుకుని, కొత్త హెయిర్ స్టైల్‌తో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చిరు సరికొత్తగా కనిపించాడు. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ విడుదల చేశారు. అలాగే దీనితో పాటు ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్‌తో కూడా చిరు బిజీగా ఉన్నాడు. ఇక శివ కొరటాల దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 4న విడుదలకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment