భోళా మేనియా మొదలవడానికి ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఒక పక్క చిరంజీవి కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా కామన్ ఇంటర్వూలలో కామెడీ టన్నుల్లో పంచుతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫుల్ ఫన్నీ మోడ్‌లో సాగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైపర్ ఆది స్పీచ్ ఇప్పుడు భోళా శంకర్‌కు చాలా మైనస్‌గా మారింది. మెగా ఫ్యామిలీకి వీరభక్తుడిని అని చాటుకోవడానికి ఒక రేంజ్‌లో రెచ్చిపోయాడు. కానీ అత్యుత్సాహంతో చాలా తప్పులు చేశాడు.
సినిమా వేదికపై రాజకీయాలు..
ఆది తన స్పీచ్‌తో తమ్ముడిని హీరో చేసే ప్రయత్నంలో భాగంగా అన్నయ్యని జీరో అని డైరెక్ట్‌గానే చెప్పాడు. చిరంజీవి రాజకీయాల్లో జీరో అని ఆయన ఎప్పుడో వదిలేసిన వాటిని మళ్ళీ గుర్తు చేశాడు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ అయినా మెగా అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. హైపర్ ఆది వేసిన మరో రాంగ్ స్టెప్.. సినిమా వేదికపై నుంచి ఏదో కౌంటర్ వేస్తున్నా అనే భ్రమలో రాజకీయాలు మాట్లాడడం! చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలాకాలమైంది. అంతే కాదు, రాజకీయాలకు అతీతంగా చాలా మంది చిరంజీవిని అభిమానిస్తారు, రిలీజ్ రోజే ఆయన సినిమా చూస్తారు. చిరు కూడా ఎప్పుడూ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటారు.
ఆది వ్యాఖ్యలపై సెటైర్స్ పడాల్సిందే!
కానీ ఇప్పుడు హైపర్ ఆది సినిమా ఫంక్షన్ లో రాజకీయాల గురించి మాట్లాడాడు. ఇక ఇప్పుడు రాజకీయనాయకులు తమ ప్రెస్ మీట్స్‌లో సినిమాల గురించి మాట్లాడకుండా ఎందుకు ఉంటారు? ఆది సెటైర్స్‌ను మించిన సెటైర్స్ పడకుండా ఎందుకు ఉంటాయి? ఆది కామెంట్స్ చిరంజీవి ఫ్యాన్స్‌ను బాధపెట్టాయి. అలాగే సాధారణ ప్రేక్షకులకు సైతం చాలా ఓవర్ అనే భావనను కలిగించాయి. ఓవరాల్‌గా ఇవన్నీ కలిసి భోళా శంకర్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ఇకనైనా చిరంజీవి తన సినిమా ఫంక్షన్స్‌లో ఇలాంటి వాళ్ళకి ముందే కొన్ని కండిషన్స్ పెడితే బావుంటుంది. ఇదే కంటిన్యూ అయితే ఇన్నాళ్లు అందరివాడిగా ఉన్న చిరంజీవి కొందరివాడిగా మారడానికి ఎంతో సమయం పట్టదు!
చదవండి: 'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా?
రెండు సినిమాలకే క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.. అప్పుడే పెళ్లంటూ ఒత్తిడి తెస్తున్న శంకర్
Comments
Please login to add a commentAdd a comment