ఏప్రిల్ నెలలో ఏజెంట్,ఆగష్టు లో భోళా శంకర్... ఈ సంవత్సరంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రెండు భారీ డిజాస్టర్స్.ఈ సినిమాల్లో హీరోలు వేరు,డైరెక్టర్స్ వేరు.కానీ పాపం నిర్మాత మాత్రం ఒక్కరే. ఆయనే అనిల్ సుంకర. వీటిలో ఏజెంట్ బడ్జెట్ దాదాపు 70 కోట్లు...వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. ఓటీటీలో ఏం లొల్లి జరిగిందో ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు.
ఇక భోళా శంకర్ బడ్జెట్ 101 కోట్లు. ఫస్ట్ డే 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. ఈ సినిమాకి వచ్చిన టాక్ కి 50 కోట్లు రావడం కూడా కష్టమే. చిరంజీవి కూడా ఈ సినిమా డిజాస్టర్ ని తప్పించలేదని నేషనల్ మీడియా కూడా రాసుకొస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు కాకపోవడం. ఇంత దారుణమైన టాక్ వచ్చాక వాళ్ళు కూడా బేరాలు ఆడతారు. అక్కడ కూడ ఎక్కువ ఆశించలేం.
(చదవండి: ‘భోళా శంకర్’కు ఫస్ట్‌డే షాకింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?)
ఇలా రెండు దారుణమైన సినిమాల మధ్యలో ఆ ప్రొడ్యూసర్ కి కాస్త ఊరట అంటే సామజవరగమన సూపర్ హిట్, హిడింబ టేబుల్ ప్రాఫిట్. అయినా కూడా ఆ రెండు సినిమాల మీద వచ్చిన లాభం ఈ రెండు సినిమాల పబ్లిసిటీ కి కూడా సరిపోదు. అయితే ఇక్కడ సదరు నిర్మాత నిస్సహాయుడు. ఎందుకంటే రెండు సినిమాల విషయంలో కూడా నిర్మాత మాట్లాడే అవకాశమే లేదు. ఇక నుంచి స్క్రిప్ట్ ఒక్కటే కాకుండా కాస్త ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ గా ఉండే హీరోలతో సినిమాలు చేస్తే ఆ బ్యానర్ నిలబడి మంచి సినిమాలు అందించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment