Bhola Shankar Producer Fires On Baseless Rumours Around Financial Issues With Megastar Chiranjeevi - Sakshi
Sakshi News home page

Producer Anil Sunkara: చిరుతో గొడవ అని రూమర్స్.. ట్వీట్‌తో నిర్మాత క్లారిటీ

Published Thu, Aug 17 2023 7:37 PM | Last Updated on Thu, Aug 17 2023 8:24 PM

Bhola Shankar Anil Sunkara Latest Tweet Chiranjeevi Issue - Sakshi

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ, సాంగ్స్, సీన్స్.. ఇలా ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా ఘోరంగా వచ్చాయి. ఇవన్నీ పక్కనబెడితే చిరు-నిర్మాత అనిల్ సుంకర మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవ జరిగిందని, అనిల్ తన ఆస్తుల్ని తాకట్టు పెట్టారని ఇలా చాలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాటన్నింటిపై స్వయంగా నిర్మాత ట్వీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు.  

అది అబద్ధం
'రూమర్స్ అనేది కొందరికి అదో రకమైన ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ ఏళ్లుగా కష్టపడి సంపాదించిన వ్యక్తుల పేరుని దెబ్బతీయడం మాత్రం సహించరాని నేరం. ఇది మా అందరి కుటుంబాల్లోనూ విపరీతమైన ఒత్తిడి, ఆందోళన పెంచేలా చేసింది. చిరంజీవి గారు- నా మధ్య మనస్పర్థలు వచ్చాయనేది పూర్తిగా అబద్ధం. ఆయన ఎప్పుడూ అండగానే ఉన్నారు'

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?)

బలంగా తిరిగొస్తా
'అలానే నాతో ఆయన(చిరంజీవి) ఇప్పటికీ మంచిగానే ఉన్నారు. కావాలనే మా ఇద్దరిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. ఫేక్ న్యూస్ అనేది కొందరికీ ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ అలా చేసిన ప్రతిఒక్కరినీ అదే చిక్కుల్లో పడేయొచ్చు. నా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండస్ట్రీలోని శ్రేయోభిలాషులకు థ‍్యాంక్స్. వారి అందరి ఆశీస్సులతో బలంగా తిరిగి వస్తానని అనుకుంటున్నాను' అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు.

వరుస షాకులు
అయితే నిర్మాత అనిల్ సుంకర పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ చివరలో 'ఏజెంట్' మూవీతో కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు 'భోళా శంకర్'తోనూ అలాంటి నష్టమే జరిగింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోల మూవీస్‌తో నష్టపోవడం మాటేమో గానీ విమర్శలు, ఫేక్ న్యూసులు ఆయన్ని మరింత ఇబ్బందికి గురిచేసినట్లు తాజా ట్వీట్ చూస్తే అర్థమవుతుంది.

(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement