రజనీకాంత్ రంగంలోకి దిగితే వార్ వన్‌సైడే! సరైన కంటెంట్ పడాలే కానీ ఆయన్ను ఆపడం ఎవరితరమూ కాదు. చాలాకాలం తర్వాత రజనీ జైలర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అది కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు కొల్లగొడుతున్నాడు. కొన్ని సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్‌ను సైతం కేవలం రెండు, మూడు రోజుల్లోనే రాబట్టాడు. టైగర్ కా హుకుం అన్నట్లుగా బాక్సాఫీస్ రికార్డులు జైలర్ సినిమాకు దాసోహమవుతున్నాయి.
ఆగస్టు 10న జైలర్ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి నుంచీ పెద్దగా ప్రచారం లేదు కానీ ప్రీరిలీజ్ నుంచి ప్రచారం జోరందుకుంది. తీరా బాక్సాఫీస్‌లో బొమ్మ పడ్డాక బ్లాక్‌బస్టర్ హిట్ టాక్.. రెండో రోజు వసూళ్లు కాస్త నెమ్మదించినా మూడో రోజుకు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.220 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కలెక్షన్స్(రూ.70 కోట్లు)తో 2023లో తమిళనాడులో బిగ్గెస్ట్ ఓపెనింగ్, బిగ్గెస్ట్ ఇండియన్ ప్రీమియర్ ఆఫ్ 2023 ఇన్ యూఎస్‌ఏ, బిగ్గెస్ట్ తమిళ్ ఓపెనర్ ఆఫ్ ఓవర్సీస్ ఇన్ 2023 రికార్డులు జైలర్ హస్తగతమయ్యాయి.
రజనీ కేవలం తమిళ హీరోనే కాదు దశాబ్ధ కాలం నుంచి తెలుగులోనూ అతడి చిత్రాలు రిలీజవుతూ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఆయనకు మంచి ఫ్యాన్‌బేస్ ఉంది. ఫలితంగా జైలర్‌కు తెలుగులోనూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. భోళా శంకర్‌కు మిశ్రమ స్పందన వస్తుండటంతో చాలా థియేటర్లలో ఈ సినిమాను జైలర్‌తో రీప్లేస్ చేస్తున్నారు. అటు వసూళ్లు కూడా భోళా శంకర్ కన్నా జైలర్‌కే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం జైలర్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
12th August Box Office #Jailer Day 3 AP/TS, TN, KA, KL, India, WW >> #BholaaShankar Day 2 pic.twitter.com/c0j5zKUa9s
— Manobala Vijayabalan (@ManobalaV) August 13, 2023
చదవండి: జైలర్ నటుడి కొత్త సినిమా.. ఇద్దరు హీరోయిన్లతో
ఆ హీరోని చెంపదెబ్బ కొట్టినా, అతనిపై ఉమ్మినా..రూ.10 లక్షలు నజరానా!
Comments
Please login to add a commentAdd a comment