Keerthy Suresh Sister Role Chiranjeevi And Rajinikanth Movies Flop - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: ఈ బ్యూటీ చెల్లి అయితే స్టార్ హీరోలకు ప్రమాదమా?

Published Wed, Aug 16 2023 5:47 PM | Last Updated on Wed, Aug 16 2023 6:14 PM

Keerthy Suresh Sister Role Chiranjeevi Rajinikanth Movies Flop - Sakshi

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాకు ఊహించని రీతిలో నష్టాలు రాబోతున్నాయనేది ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రం ఫెయిలవడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అవన్నీ కాదులే గానీ ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఫ్లాప్‌కి హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా ఓ కారణమని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

హీరోయిన్‌గా బిజీ
కీర్తి సురేశ్ పేరు చెప్పగానే చాలామంది 'మహానటి' సినిమా గుర్తొస్తుంది. కేరళకు చెందిన ఈ బ్యూటీ 'నేను శైలజ' అనే లవ్ స్టోరీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'మహానటి'తో ఈమెకు జాతీయ అవార్డు వచ్చింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. పవన్, మహేశ్ లాంటి హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం సౌత్ తోపాటు హిందీలో నటిస్తూ బిజీగా ఉంది.

(ఇదీ చదవండి: 'జైలర్' కలెక్షన్స్.. రజనీ దెబ్బకు 'విక్రమ్' రికార్డ్ బ్రేక్)

చిరుతో పాటు రజనీ
ఓవైపు హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు చెల్లిలి పాత్రల్లోనూ యాక్ట్ చేయడానికి ఓకే చెప్పేస్తుంది. అలా 'భోళా శంకర్'లో చిరంజీవికి సిస్టర్ రోల్ చేసింది. వేళా విశేషం ఏంటో గానీ ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్‌గా నిలవబోతుంది. అలానే కీర్తి సురేశ్ చెల్లిగా చేయడం చిరుకి కలిసిరానట్లే, సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అస్సలు కలిసిరాలేదు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు.

చెల్లిగా చేస్తే అంతే?
'జైలర్'తో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఫుల్ జోరు చూపిస్తున్న రజనీకాంత్.. గత సినిమా 'అన్నాత్తే'తో ఘోరమైన ఫెయిల్యూర్ అందుకున్నారు. ఇందులో రజనీకి చెల్లిగా కీర్తి సురేశ్ నటించింది. అలా ఇద్దరు స్టార్ హీరోలకు చెల్లిగా యాక్ట్ చేసిన కీర్తి సురేశ్.. అనుకోని ఫ్లాప్స్ ని నెత్తిమీద వేసుకుంది. దీంతో నెటిజన్స్.. కీర్తి, చెల్లిలి రోల్ చేస్తే ఆమెకు ఏమో గానీ స్టార్ హీరోలకు రిస్క్ తప్పదని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్‌లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement