Keerthi Suresh as sister for Chiranjeevi, in past Mother as Heroine - Sakshi
Sakshi News home page

Chiranjeevi Keerthy Sureh: తల్లి హీరోయిన్‌గా.. కూతురు చెల్లిగా!

Aug 7 2023 10:34 AM | Updated on Aug 7 2023 10:49 AM

Chiranjeevi Acted Keerthy Suresh Sister Menaka Heroine - Sakshi

మెగాస్టార్ చిరంజీవి మాములోడు కాదు. ఇప్పటికే ఓ జనరేషన్ హీరోయిన్లతో కలిసి నటించారు. ఎంటర్‌టైన్ చేశారు. హిట్స్ కొట్టారు. ఇప్పుడు వాళ్ల కూతుళ్లతోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ అది ఏ సినిమా? తల్లీ కూతుళ్లు ఎవరు?

చిరంజీవి హీరోగా ఇప్పటికే 150 సినిమాల మార్క్‌ని దాటేశారు. రీఎంట్రీలో మంచి జోరు మీదున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'గా అలరించిన చిరు.. ఇప్పుడు 'భోళా శంకర్'గా సందడి చేయబోతున్నారు. ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, తమన్నా, సుశాంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇది 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!)

ఇకపోతే 'భోళా శంకర్'లో సిస్టర్ సెంటిమెంట్ కీలకం. చిరుకి చెల్లిగా కీర్తి సురేశ్ కీలకపాత్ర పోషించింది. ఈమె సోదరిగా నటిస్తే.. ఈ బ్యూటీ తల్లి మేనక మాత్రం చిరుకు హీరోయిన్‌గా ఓ సినిమాలో చేసింది. మెగాస్టార్.. తన కెరీర్ ప్రారంభంలో చేసిన 'పున్నమినాగు'లో కనిపించిన అమ్మాయి కీర్తి సురేశ్ తల్లి మేనక. తాజాగా 'భోళా శంకర్' ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'చిరంజీవి 'పున్నమినాగు' సినిమాలో అమ్మ నటించింది. అప్పుడు జరిగిన చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, సెట్ లో ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్ గా చూసుకునేవారట. చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఇదే విషయం నేను చిరంజీవిగారితో చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ నన్ను చాలా సర్ ప్రైజ్ చేసింది' అని కీర్తి చెప్పుకొచ్చింది. దీనికి బదులిచ్చిన చిరు.. 'మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. స్మార్ట్' అని కీర్తితో అన్నారు.

(ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement