Megastar Chiranjeevi Leaks Bhola Shankar Song Shooting Video - Sakshi
Sakshi News home page

‘చిరు లీక్స్‌’.. సంగీత్‌లో మెగాస్టార్‌ స్టెప్పులు

Published Thu, Jun 8 2023 7:53 PM | Last Updated on Thu, Jun 8 2023 8:13 PM

Bhola Shankar Chiranjeevi leaks Videos Song - Sakshi

వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న  ‘భోళా శంకర్‌’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ‘చిరు లీక్స్‌’పేరుతో అభిమానులతో పంచుకున్నారు. సినిమాలోని ఓ పాటకు సంబంధించిన షాట్స్‌ను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇంకేముంది మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. వెంటనే దానిని వైరల్‌ చేయడం కూడా మొదలైంది.

(ఇదీ చదవండి: వరుణ్‌- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?)

వీడియోను గమనిస్తే, సంగీత్‌  జరుగుతుండగా వచ్చే సాంగ్‌లా ఉంది. సనిమాలో నటించే ఆర్టిస్టులందరూ ఈ పాటలో హుషారుగా ఉన్నారు. చిరు ఇలా పంచుకున్నారు 'నాతో పాటు నా అభిమానులను కూడా హుషారుగా ఉంచాలని అనుకుంటున్నా. అందుకే ఈ పాట విషయాలు లీక్ చేద్దామనిపించింది. అక్కడ షూట్‌ చేసిన కొన్ని షాట్స్‌ను ఎడిట్‌ చేసి, ఇన్‌స్టాలో పంచుకుంటున్నా..ఇది 'చిరు లీక్స్‌' ఎవరికీ చెప్పొద్దు. మీరు మాత్రమే చూసి ఎంజాయ్‌ చేయండి' అని ట్వీట్‌ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సినిమా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి:  వారి లిస్ట్‌ తీయండి.. ఫ్యాన్స్‌కు విజయ్‌ అదేశం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement