అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్‌లో ఆ సీన్‌ రిపీట్..! | Pawan Kalyan Khushi Movie Scene repeat in BholaSankar Movie | Sakshi
Sakshi News home page

Bhola Shankar Movie: ఖుషీ సీన్ రిపీట్.. చిరంజీవి- శ్రీముఖిపై ప్లాన్..!

Published Tue, Feb 21 2023 11:04 PM | Last Updated on Tue, Feb 21 2023 11:05 PM

Pawan Kalyan Khushi Movie Scene repeat in BholaSankar Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్‌. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్  వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా, కీర్తి సురేష్‌ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అప్పట్లో పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ఖుషిలో భూమిక నడుము సీన్ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్. అయితే అలాంటి సీనే భోళా శంకర్‌లో తెరకెక్కించినట్లు టాక్ వినిపిస్తోంది. 

అయితే ఈ సీన్‌ను యాంకర్ శ్రీముఖిపై చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి-శ్రీముఖిపై నడుము సీన్ తెరకెక్కించారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపిస్తారని.. అందుకే పవన్‌ సీన్ ఒక్కటైనా ఉండాలని ఖుషి సినిమాలోని ఎవర్ గ్రీన్ సన్నివేశం ప్లాన్ చేశారట. అయితే దీనిపై ఇప్పటివరకూ  ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరిన్ని రోజులు ఆగితే ఈ విషయంపై క్లారిటీ రానుంది. మహా శివరాత్రి సందర్భంగా భోళా శంకర్‌ సినిమాకు సంబంధించి మేకర్స్‌ “స్ట్రీక్ ఆఫ్ శంకర్” పేరుతో గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement