Is Chiranjeevi Share An Update About His Upcoming Movie On His Birthday On August 22, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi: దెబ్బేసిన భోళా.. ఆగస్టు 22 కోసం మెగా ఫ్యాన్స్‌ వెయిటింగ్‌! ఎనీ సర్‌ప్రైజ్‌..

Published Sat, Aug 19 2023 11:40 AM | Last Updated on Sat, Aug 19 2023 12:24 PM

Is Chiranjeevi Shares an Update on His Birthday On August 22 - Sakshi

స్టార్‌ హీరో సినిమా వస్తుందంటే చాలు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు అభిమానులు. రిలీజైన రోజు వారు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్‌ లోపల, బయట, వీధుల్లో, సోషల్‌ మీడియాలో చేసే హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. సినిమా హిట్టయితే ఈ సంబరాలు రెట్టింపవుతాయి. కానీ ఫ్లాప్‌ అయితే.. అప్పుడు మొదలవుతుంది అసలు బాధ!సినిమా కోసం పనిచేసిన అందరినీ ఏకధాటిగా తిట్టిపోస్తుంటారు.

ఏమాత్రం తేడా కొట్టినా..
చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. మెగాస్టార్‌ ఈ మధ్య ఎక్కువగా రీమేక్‌ల మీద మనసు పారేసుకుంటున్నాడు. మాతృకలో హిట్టయింది కదా అని ఇక్కడ కూడా అదే టాక్‌ వస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! మనవాళ్ల టేస్ట్‌కు, అంచనాలకు తగ్గట్లుగా తీస్తేనే సినిమా బాక్సాఫీస్‌ వద్ద నెట్టుకొస్తుంది. లేదంటే కొద్ది రోజుల్లోనే థియేటర్‌ నుంచి బొమ్మ కనిపించకుండా పోవడం ఖాయం! అదనంగా ట్రోలింగ్‌ ఒకటి!

భోళా శంకర్‌పై విపరీతమైన ట్రోలింగ్‌
ఇటీవల రిలీజైన చిరంజీవి భోళా శంకర్‌ సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ఈ మూవీ కనీస వసూళ్లు రాబట్టడం కూడా గగనమైపోయింది. ఫలితంగా భోళా శంకర్‌ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ నిరాశచెందారు. డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్‌ను ఓ ఆటాడుకున్నారు. కొన్ని సీన్ల గురించి విపరీతమైన ట్రోలింగ్‌ జరిగింది. ఈ క్రమంలో చిరు నెక్స్ట్‌ మూవీ ఎవరితో అన్న చర్చ నడుస్తోంది.

లైన్‌లో నలుగురు డైరెక్టర్స్‌?
యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో బింబిసార డైరెక్టర్‌ వశిష్టతో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బంగార్రాజు డైరెక్టర్‌ కల్యాణ్‌ కృష్ణతోనూ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని, దీన్ని మెగా డాటర్‌ సుష్మిత కొణిదెల నిర్మించనుందంటూ ఓ వార్త వైరలవుతోంది. అంతేకాదు.. ఏఆర్‌ మురుగదాస్‌ లేదా వివి వినాయక్‌తోనూ సినిమా ఉండబోతుందని ప్రచారాలు ఊపందుకున్నాయి. మరి చిరంజీవి ఈ నలుగురిలో నెక్స్ట్‌ మూవీ ఛాన్స్‌ ఎవరికిస్తాడు? బర్త్‌డే(ఆగస్టు 22) రోజు తన నెక్స్ట్‌ సినిమా అప్‌డేట్‌ వదులుతాడా? లేదా? అని ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఈసారైనా రీమేక్‌లు పక్కనపెట్టి ఒరిజినల్‌ స్టోరీ చేస్తే బాగుంటుందని హితబోధ చేస్తున్నారు.

చదవండి: షారుక్‌ కోసం ఆ పని చేసేందుకు సిద్ధమైన నయనతార.. రూల్‌ పక్కన పెట్టేసి మరీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement