కీర్తి సురేష్ పేరు చెప్పగానే మహానటి మూవీ మాత్రమే గుర్తుకొస్తుంది. ఆ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతోంది. అయితే ఇంతవరకు మహానటిని మరిపించే మూవీని మాత్రంఅందించలేకపోయింది కీర్తి సురేశ్. మహానటి దారిలోనే మరిన్ని ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసినా పెద్దగా కలసి రాలేదు. అందుకే ప్లాన్ బి అమలు చేస్తోంది.
‘మహానటి’ కీర్తి సురేశ్‌ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మార్చింది. అందుకే మొదట్లో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి చిత్రాలు చేసింది. వీటిల్లో గుడ్ లక్ సఖీ వచ్చే నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.పెంగ్విన్, మిస్ ఇండియా నిరాశపరచడంతో గుడ్ లఖ్ సఖి తో మెప్పించాలి అనుకుంటోంది కీర్తి. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పెద్దగా కలసి రాకపోవడంతో ఇక హీరోయిన్ రోల్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటోంది.
ఇప్పటికే సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. అలాగే దసరా మూవీలో నాని కి జోడిగా నటించేందుకు డేట్స్ కేటాయించింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించబోతున్న ప్యాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్ గా నటించాలనుకుంటోందట.
కేవలం హీరోయిన్ రోల్స్ అంటే అన్నిసార్లు పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉండదు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు వసూళ్లు రావడం లేదు. అందుకే సిస్టర్ రోల్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తోంది కీర్తి. అన్నాత్తే, సాని కాయిదమ్, భోళా శంకర్ ఈ మూడు చిత్రాల్లోనూ కీర్తిసురేష్ సిస్టర్స్ రోల్స్ చేస్తోంది. అన్నాత్తేలో రజనీకాంత్ కు, భోళాశంకర్ లో చిరుకు, అలాగే సానికాయిదమ్ అనే తమిళ సినిమాలో సెల్వరాఘవన్ కు చెల్లెలి పాత్రలో కనిపించనుంది కీర్తి. స్టార్ డమ్ అందుకున్న తర్వాత రిపీటెడ్ గా కీర్తి సిస్టర్ రోల్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment