కూతురితో చిరంజీవి నెక్స్ట్‌ సినిమా! | A movie in the combination of Chiranjeevi and PS Mithran! | Sakshi
Sakshi News home page

కూతురితో చిరంజీవి నెక్స్ట్‌ సినిమా! కథ విన్నారా ?

Published Mon, Mar 13 2023 4:54 AM | Last Updated on Mon, Mar 13 2023 1:20 PM

A movie in the combination of Chiranjeevi and PS Mithran! - Sakshi

హీరో చిరంజీవి, దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ప్రస్తుతం మెహర్‌రమేశ్‌దర్శకత్వంలో ‘భోళాశంకర్‌’ సినిమా చేస్తున్నారు  చిరంజీవి. ఈ మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. దీంతో తన తర్వాతి సినిమాపై ఫోకస్‌ పెట్టారు మెగాస్టార్‌.

ఈ క్రమంలోనే ఆయన కొత్త కథలు వింటున్నారు. దర్శకులు పూరి జగన్నాథ్, ప్రభుదేవా వంటి వారు చిరంజీవికి కథలు చెప్పారని టాక్‌. తాజాగా రచయిత, దర్శకుడు బీవీఎస్‌ రవి పేరు తెరపైకి వచ్చింది. బీవీఎస్‌ రవి కథకు తమిళ దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఓ నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. 

అయితే ఈ విషయాలపై పూర్తి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా చిరంజీవి హీరోగా  వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో ఓ ప్రకటన వచ్చింది.  అయితే ఈ సినిమా గురించి మరో అధికారిక అప్‌డేట్‌ రావాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement