మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. తన సినిమా వస్తుందంటే చాలు భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు, ర్యాలీలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు అభిమానులు. ఈరోజు (ఆగస్టు 11) చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజైంది. ఇప్పటికే అభిమానులు థియేటర్ల ముందు సంబరాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవిపై తమకు ఎవరెస్ట్ శిఖరమంత అభిమానం ఉందని నిరూపించారు అభిమానులు. ఏకంగా గూగుల్ మ్యాప్స్‌లో ఆయన చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మెగాస్టార్ ముఖాకృతిని పోలేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మొత్తం 800 కిలోమీటర్ల చెక్ పాయింట్స్ పెట్టుకుని జీపీఎస్ నావిగేషన్‌తో వాటిని కలుపుతూ చిరు బొమ్మను గూగుల్ మ్యాప్స్‌పై కనిపించేలా చేశారు. దీన్ని పర్ఫెక్ట్‌గా జీపీఎస్ వర్చువల్‌గా గీశారు. ఈ ఫీట్ కోసం 15 రోజులు గ్రౌండ్ వర్క్ చేసి మరీ చిరంజీవికి అద్భుత కానుకనిచ్చారు. ఇటీవల మెగాస్టార్ అభిమానులు ఏకంగా 126 అడుగుల భారీ కటౌట్‌ను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే!
సూర్యపేట - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న రాజు గారి తోట వద్ద దీన్ని పెట్టారు. తెలుగు సినీ చరిత్రలో ఇంత పెద్ద కటౌట్ ఇప్పటి వరకు ఏ హీరోకు ఏర్పాటు చేయలేదు. భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే.. థియేటర్లలో ఇప్పటికే జాతర మొదలైంది. తమిళ బ్లాక్‌బస్టర్ వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. తమన్నా, కీర్తి సురేశ్ హీరోయిన్స్‌గా నటించారు.
చదవండి: జేమ్స్‌బాండ్‌లా పోజు కొడుతున్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా?
Comments
Please login to add a commentAdd a comment