జ్యురిచ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) అమెరికా టెక్ దిగ్గజం గూగుల్‌కూ పాకింది. గూగుల్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా సోకింది. స్విట్జర్లాండ్ జ్యురిచ్‌లోని గూగుల్ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో యాజమాన్యం అతనికి పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఉద్యోగికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని గూగుల్ ప్రతినిధి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఆరోగ్యం, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. ఇరాన్, ఇటలీ, చైనా దేశాలకు ప్రయాణించొద్దని ఉద్యోగులకు గూగుల్ సూచించింది.
ఐతే కార్యాలయాన్ని మూసివేసే ఆలోచన లేదని ఆ సంస్థ పేర్కొంది. మిగతా ఆఫీసుల మాదిరిగానే జ్యురిచ్ కార్యాలయం ఓపెన్ చేసే ఉంటుందని ప్రతినిధి స్పష్టం చేశారు. తమ దేశంలో ఇప్పటి వరకు 15 కేసులను గుర్తించామని, వందలాది మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా కరోనా వైరస్ కారణంగా దక్షిణ కొరియాలోని హ్యూందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment