
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 2021లో నిర్వహించాల్సిన తమ వార్షిక సదస్సును రద్దు చేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది. తదుపరి సదస్సు 2022 ప్రథమార్ధంలో నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఎక్కడ, ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని డబ్ల్యూఈఎఫ్‌జీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ తెలిపారు. ఈ సదస్సు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. రెండు సార్లు వేదిక మారింది.
వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగాల్సింది. కానీ పలు కారణాలతో స్విట్జర్లాండ్‌లోనే ఉన్న లూసెర్న్ నగరానికి వేదికను మార్చారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో నిర్వహించేలా సింగపూర్‌కి వేదిక మారింది. ఏటా దావోస్‌లో జరిగే ఈ సదస్సును 2002లో న్యూయార్క్ సిటీలో నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు స్విట్జర్లాండ్ కాకుండా మరో దేశంలో నిర్వహించాలని భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ప్రణాళికలు మార్చుకోవాల్సివచ్చింది.