World Economic Forum Summit
-
భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి: సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిచ్ వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడి ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయులను గ్లోబల్ లీడర్లుగా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. గతంలో తాను బిల్‌గేట్స్‌తో మాట్లాడి హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్లే తెలుగువాడైన సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ కంపెనీ సీఈవోగా ఎదిగాడని చెప్పారు. ఎలివేషన్, స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను వర్క్ ఫ్రం హోమ్ హబ్‌గా తీర్చిదిద్దుతానని, ఇందుకు ప్రవాసాంధ్రులు సహకరించాలని కోరారు. వర్క్ ఫ్రం హోమ్ ద్వారా రాష్ట్రంలోని గృహిణులకు అవకాశం వస్తే వారు మీకన్నా ఎక్కువ సంపాదిస్తారన్నారు. ప్రభుత్వమే లైసెన్స్ ఫీజులు చెల్లించి ఏఐ, చాట్‌జీపీటీ వంటివాటిని రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా అందించే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి 12 దేశాల నుంచి తెలుగువారు వచ్చారని, ఇందులో అత్యధికంగా తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారని అన్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలగువారు నిరసన ప్రకటించి, తనకు మద్దతు ప్రకటించారని, ఎవరైనా చనిపోయిన తర్వాత పేర్లు గుర్తుపెట్టుకుంటారు కానీ, బతికుండగానే పేరు గుర్తుపెట్టుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. అనంతరం సీఎం రోడ్డు మార్గం ద్వారా దావోస్‌కు వెళ్లారు.సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనదావోలో చంద్రబాబు సోమవారం తొలిరోజు పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్ మృధుల్ కుమార్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీతో స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు కలిసి పనిచేసేలా చూడాలని కోరారు. అనంతరం మృధుల్ కుమార్ స్విట్జర్లాండ్‌కు చెందిన నాలుగు ప్రముఖ సంస్థల సీఈవోలు, ఇతర ముఖ్యులను సీఎం చంద్రబాబుతో సమావేశపరిచారు. ‘స్విస్‌మెన్’ సెక్రటరీ జనరల్ రౌల్ కెల్లర్, ‘ఓర్లికాన్’ సీఈవో మార్కస్ టకే, ‘ఆంగ్సŠట్ ఫిస్టర్’ సీఈవో ఎరిచ్ స్మిడ్, ‘స్విస్ టెక్స్టైల్స్’ హెడ్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ ఎక్స్టెర్నల్ ఎఫైర్స్ జార్న్ వాన్ డెర్ క్రోన్‌కు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను సీఎం వివరించారు. చంద్రబాబు, రేవంత్ భేటీజ్యూరిచ్ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుకోకుండా కలుసుకున్నారు. ఒకరికి ఒకరు ఎదురుపడటంతో కాసేపు ఇరువురు కూర్చుని మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడులపై వారి మధ్య చర్చ జరిగింది. -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతం, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ పర్యటన విజయవంతం అయినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. 4 రోజుల్లో 52 వాణిజ్య, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలతో తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లు, గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్‌లో తమ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం విదితమే. All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7 — KTR (@KTRTRS) January 21, 2023 -
చాట్‌జీపీటీ అద్భుతం.. నేను అడిక్ట్ అయ్యా : అదానీ
న్యూఢిల్లీ: కృత్రిమమేథలో (ఏఐ) సంచలనంగా మారిన చాట్‌జీపీటీపై పారిశ్రామిక దిగ్గజాలకు కూడా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కూడా ఈ జాబితాలో చేరారు. దీన్ని వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి తనకూ ఇది కొంత వ్యసనంలా మారిందని అదానీ పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో అంతటా ఏఐ గురించే ప్రధానంగా చర్చ జరిగిందని లింక్డ్ఇన్లో అదానీ రాశారు. ఎంతో ఉపయోగకరమైన ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు చాట్‌జీపీటీ తోడ్పడగలదని ఆయన తెలిపారు. జోకులు, పద్యాలు, వ్యాసాలు మొదలుకుని కంప్యూటర్ కోడింగ్ వరకు ఎలాంటి అంశం అయినా అనంతమైన సమాచారాన్ని క్రోడీకరించి యూజర్‌కు కావాల్సినట్లుగా కంటెంట్‌ను చాట్‌జీపీటీ అందిస్తుంది. యూజర్లతో అచ్చం మనుషుల్లాగే సందర్భోచితంగా సంభాషిస్తుంది. ఓపెన్ఏఐ రూపొందించిన ఈ చాట్‌బాట్ ప్రస్తుతం ఇంకా ప్రయోగదశలో ఉంది. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
దావోస్‌కు వెళ్లకపోవటమూ తప్పేనా?
సాక్షి, అమరావతి: దావోస్‌లో ఈ నెల 16న మొదలై... 20వ తేదీ వరకు జరగనున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023–వార్షిక సదస్సు’లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం పార్టీ, దాని మిత్ర మీడియా చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఎందుకంటే ఈ సమ్మిట్‌లో పాల్గొనాలంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్టే బ్రెండే స్వయంగా పంపిన లేఖను ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. పైపెచ్చు ఈ లేఖ సీఎం వైఎస్ జగన్ కార్యాలయానికి గత ఏడాది నవంబర్ 25నే అందింది. అయితే 6 నెలల కిందటే దావోస్ సదస్సుకు హాజరై ఉండటం... మరోవైపు నెలన్నర రోజుల్లో (మార్చి మొదటి వారంలో) విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుపై ఫోకస్ పెట్టడం వంటి కారణాల వల్ల ఈసారి దావోస్ సదస్సుకు హాజరు కాకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఏపీకి దావోస్ సదస్సుకు ఆహ్వానం రాలేదంటూ టీడీపీ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం ఈ వాస్తవాలు సామాన్యులకు తెలియవనే ఉద్దేశంతో... గడిచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దావోస్‌కు పిలవకపోవటం ఇదే తొలిసారంటూ తెలుగుదేశం భారీ ఎత్తున దుష్ప్రచారానికి దిగింది. కాకపోతే ఇవేమీ... ‘ఈనాడు’ ఇతర ఎల్లో మీడియా చెప్పకపోతే జనానికి వాస్తవాలు తెలియని రోజులు కావు. అందుకే ఎల్లో ముఠా దుష్ప్రచారం ఆరంభమైన వెంటనే... దానికి ప్రతిస్పందనలు కూడా మొదలయ్యాయి. దావోస్‌లో సదస్సుకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్‌కు వరల్డ్ ఎకానమిక్ ఫోరం అధ్యక్షుడు బోర్టే బ్రెండే పంపిన లేఖ నిజానికి ఒకవేళ జగన్మోహన్రెడ్డి ఈసారి సదస్సుకు హాజరై ఉంటే... ‘మొన్ననే 6 నెలల కిందటే కదా దావోస్‌కు వెళ్లింది. మళ్లీ ఇంతలోనే ఏం పెట్టుబడులు తెచ్చేస్తారు?’ అనే రీతిలో కూడా తెలుగుదేశం, ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలెట్టేసేవంటూ ప్రజలు నవ్వుకోవటం విశేషం. -
సృష్టికి తానే కారణమని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు: అమర్నాథ్
-
‘ఐదుసార్లు దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం తెచ్చారు?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అసత్య ప్రచారాలపై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. కాగా, మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం అందలేదని టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. నవంబర్ 25నే వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం అందింది. దీనిపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖలో సదస్సు ఏర్పాటు చేస్తున్నందున దావోస్ వెళ్లలేదు. ఐదుసార్లు దావోస్ వెళ్లి చంద్రబాబు ఏం తెచ్చారు?. గతంలో బిల్డప్ బాబును చూసి జనం ఆశ్చర్యపోయారు’ అంటూ కామెంట్స్ చేశారు. -
హైదరాబాద్‌లో సీ4ఐఆర్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం తొలిరోజే తెలంగాణ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగు పెడుతోంది. సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్)కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవశాస్త్రాలు (లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత్‌లో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ అనుకూలతలు, సత్తాకు నిదర్శనం: కేటీఆర్ లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు సీ4ఐఆర్ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఈ సెంటర్ ఏర్పాటు సాధ్యమైందన్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారత్ అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్ సీ4ఐఆర్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెందే అన్నారు. సీ4ఐఆర్ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఇండియాను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు, రోగుల సౌకర్యాలను మెరుగు పరచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. -
స్వదేశం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
దావోస్ వేదికగా వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాగా, దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని సీఎం జగన్, మంత్రుల బృందం మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో ప్రజా ప్రతినిధులు, ఉన్నాతాధికారులు స్వాగతం పలికారు. ఇక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు. విదేశీ పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి చేరుకున్న సీఎం శ్రీ వైయస్.జగన్ కు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారు లు. pic.twitter.com/fL2yYdzIfz— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 31, 2022 ఇది కూడా చదవండి: దావోస్‌లో ఏపీ ధగధగ -
దావోస్ పర్యటనలో ఐదో రోజు సీఎం జగన్ (ఫొటోలు)
-
‘హైదరాబాద్‌లో మరింతగా విస్తరిస్తాం’
గ్లాస్‌లైన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో తమ సేవలను మరింతగా విస్తరిస్తామని జీఎంఎం ఫాడ్లర్ ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక ఫెసిలిటీ సెంటర్ ఉంది. దీని విస్తరణకు మరో 10 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు రెడీగా ఉన్నామని జీఎంఎం ఫాడ్లర్ ప్రతినిధులు తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయిన తర్వాత ఫాడ్లర్ ఈ నిర్ణయం తెలిపింది. జీఎంఎం ఫాడ్లర్ సంస్థ గ్లాస్‌లైన్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్‌తో పాటు కరోషన్ రెసిస్టెంట్ టెక్నాలజీ, కెమికల్ సిస్టమ్స్ సర్వీసెస్, ఫార్మా, ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్టార్లలో సేవలు అందిస్తోంది. ఆ సంస్థ సీఈవో థామస్ కేల్ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. చదవండి: తెలంగాణతో జట్టు కట్టిన మాస్టర్ కార్డ్స్ -
షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన సీఎం జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా దావోస్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ కంపెనీల సీఈవోలు, ఫౌండర్లు, ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో నిర్విరామంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విశాఖ, మచిలీపట్నాలకు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ముఖ్యంగా ఐటీ, విద్య, భూరికార్డుల సర్వే, డీకార్బనైజ్డ్ సెక్టార్లో ఇన్వెస్టర్లను ఆకర్షించ గలిగారు. కాగా 2022 మే 26న సీఎం జగన్ దావోస్‌లో ఉన్న షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ట్రైనింగ్ సెంటర్ అంతా కలియదిరుగుతూ అక్కడ శిక్షణ జరుగుతున్న తీరును షిండ్లర్ ప్రతినిధులు సీఎం జగన్‌కు వివరించారు. చదవండి: CM YS Jagan Davos Tour: ‘యూనికార్న్’ విశాఖ -
తెలంగాణకి గుడ్‌న్యూస్ ! ఫెర్రింగ్ ఫార్మా మరో రూ.500 కోట్లు..
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. బుధవారం ఫెర్రీ ఫార్మా ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం శుభవార్తను మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్‌లో మరో యూనిట్‌ను నెలకొల్పేందుకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఫెర్రీ ఫార్మా అంగీకారం తెలిపిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. స్విట్జర్లాండ్‌కి చెందిన ఫ్రెర్రింగ్ ఫార్మా గతంలోనే తెలంగాణలో పెట్టుబడులకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే రూ. 500 కోట్లు కేటాయించింది. వీటితో హైదరాబాద్‌లో ఫార్ములేటింగ్ సెంటర్‌ను నెలకొల్పింది. దీన్ని మంత్రి కేటీఆర్ రెండు నెలల కిందట ప్రారంభించారు. ఇంతలో దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సమావేశాలు జరగడం ఫెర్రీ ప్రతినిధులతో మరోసారి కేటీఆర్ సమావేశం కావడం జరిగింది. ఫలితంగా రెండో యూనిట్ స్థాపనకు రూ.500 కోట్ల కేటాయించేందుకు ఫ్రెర్రీ ఫార్మా ముందుకు వచ్చింది. More good news coming in for #Telangana from Davos! Delighted to announce that Switzerland headquartered @ferring Pharma will be expanding in Hyderabad with an investment of ₹ 500 Crores for setting up of another formulation unit#TelanganaAtDavos #InvestTelangana #WEF22 pic.twitter.com/3nkVzP5PEB — KTR (@KTRTRS) May 25, 2022 చదవండి: తెలంగాణకు రాబోతున్న స్విస్ రైల్ కోచ్ తయారీ కంపెనీ! రూ. 1000 కోట్లతో.. -
స్టాడ్లర్ రైల్.. త్వరలో తెలంగాణకు ! రూ. 1000 కోట్లతో..
రైల్ కోచ్ తయారీ రంగంలో తెలంగాణ మరోసారి భారీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్లో వెల్లడించారు. స్విట్జర్లాండ్‌కి చెందిన రైలు కోచ్‌ల తయారీ సంస్థ స్టాడ్లర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఈవీపీ ఆన్స్‌గర్ బ్రూక్‌మేయర్‌తో మంత్రి కేటీఆర్ దావోస్‌లో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగియడంతో త్వరలో తెలంగాణలో రైలు కోచ్‌ల తయారీ రంగంలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు స్టాడ్లర్ బుధవారం ప్రకటించింది. తెలంగాణలో నెలకొల్పబోయే రైల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం స్టాడ్లర్ సంస్థ రూ.1000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 2500ల మంది యువతికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే ప్రైవేటు రంగంలో మేధా సంస్థ రైల్ కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. తాజాగా స్టాడ్లర్ సంస్థ రైల్ కోచ్‌ల తయారీ రంగంలో పెట్టుబడులకు రెడీ అయ్యింది. మేధా సంస్థతో కలిసి స్టాడ్లర్ తెలంగాణలో పని చేయనుంది. Delighted to announce that ‘Stadler Rail’ will be setting up their Rail Coach Manufacturing unit in Telangana This investment will be a joint venture b/w Medha Servo Drives & Stadler Rail with an investment of ₹ 1,000 Cr. which will create 2,500 jobs for our youngsters pic.twitter.com/Ntnxs1oU6x — KTR (@KTRTRS) May 25, 2022 షిండ్లర్ సైతం తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు షిండ్లర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. షిండ్లర్ ఈవీపీ లుక్‌రెమ్‌నాంట్‌తో దావోస్‌లో ఉన్న తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో రెండో స్టేట్ ఆఫ్ ఆర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు షిండ్లర్ గ్రీన్ సిగ్నల్ ఇచఇచ్చింది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ మేనేజ్మెంట్లో గ్లోబల్ లీడర్‌గా షిండ్లర్ ఉంది. వందకు పైగా దేశాల్లో షిండర్ల్ విస్తరించి ఉంది. Extremely happy to announce that @SchneiderElec will be expanding its operations in Telangana by setting up their 2nd state-of-the-art manufacturing facility in Hyd. Thanks to Luc Remont, EVP, @SchneiderElec for the fruitful meeting at Telangana Pavilion @wef #TelanganaAtDavos pic.twitter.com/n5DRuuQ8J9 — KTR (@KTRTRS) May 25, 2022 చదవండి: KTR: ‘మరో 20 ఏళ్లలో దేశ ప్రధానిగా కేటీఆర్’! -
డిజిటల్ టెక్నాలజీ పురోగతితో పర్యావరణ పరిరక్షణ
దావోస్: డిజిటల్ టెక్నాలజీల పురోగతి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 2050 నాటికి 20 శాతం వరకు తగ్గించగలదని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) అంచనావేసింది. అత్యంత పర్యావరణ ప్రతికూల ఉద్గారాలను వెలువరించే మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్‌లో డిజిటల్ టెక్నాలజీ ఆవశ్యకతను ఉద్ఘాటించింది. యాక్సెంచర్‌తో కలిసి ఈ మేరకు నిర్వహించిన అధ్యయన వివరాలు... నిర్ణయాలు–అమలు మధ్య వ్యత్యాసం పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న పిలుపునకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నిర్ణయాలు–వాటి అమలు మధ్య ఇంకా తీవ్ర వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఇంకా చెప్పాలంటే ప్రమాదకర ఉద్గారాల తగ్గింపు అవసరమైన చర్యలు 55 శాతం చేపట్టాల్సి ఉండగా, ఈ దిశలో నడిచింది కేవలం 7.5 శాతం కావడం గమనార్హం. ఈ వ్యతాసం తగ్గింపునకు అధిక ఉద్గార రంగాలు ఈ విషయంలో ‘సామర్థ్యం, పునరుత్పాదకత, సుస్థిర నిర్ణయాల’పై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మూడు రంగాలు కీలకం... మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్ విభాగాలు అధిక ఉద్గార రంగాలుగా ఉన్నాయి. 2020 మొత్తం ఉద్గారాల్లో వీటి వెయిటేజ్ వరుసగా 43 శాతం, 26 శాతం, 24 శాతాలుగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు తమ కార్యకలాపాలు, నిర్వహణ విషయంలో కాలుష్యాలను తగ్గించడానికి నాలుగు రకాలైన డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. బిగ్ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు/మెషిన్ లెర్నింగ్ వంటి నిర్ణయాత్మక సాంకేతికతలు, క్లౌడ్, 6జీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికతలను ప్రారంభించడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, ఆటోమేషన్ వంటి సెన్సింగ్, కంట్రోల్ టెక్నాలజీలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. నివేదికలోని మరికొన్ని అంశాలు.. - డిజిటల్ పరిష్కారాలు, కార్బన్–ఇంటెన్సివ్ ప్రక్రియలను మెరుగుపరచడం, భవనాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, పునరుత్పాదక శక్తి వినియోగం, నిర్వహణ, వంటి చర్యల ద్వారా ఇంధన రంగంలో ఉద్గారాలను 8 శాతం వరకు తగ్గించవచ్చు. - మెటీరియల్ రంగంలో డిజిటల్ సొల్యూషన్ లు మైనింగ్, అప్‌స్ట్రీమ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దీనితోపాటు 2050 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు 7% వరకు తగ్గుతాయి. - సాంప్రదాయ ఇంధనం నుంచి గ్రీన్ ఇంధనం వైపునకు మొబిలిటీ రంగం అడుగులు వేయడం ద్వారా ఉద్గారాలను 5 శాతం వరకు తగ్గించవచ్చు. ఈ దిశలో సంబంధిత మౌలిక రంగం పురోగతి అవసరం. - వాయు ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి ప్రేరణకు డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే కంపెనీలు ఈ విషయంలో మిగిలిన కంపెనీలు, సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. - పర్యావరణ పరిరక్షణకు డిజిటల్ సాంకేతికత కంపెనీలకు ఒక మంచి సాధనాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డిజిటల్ ఎకానమీ ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్ అన్నారు. వ్యాపార పక్రియ, వ్యాలూ చైన్‌లో పారదర్శకత, సామర్థ్యం పెంపులో సాంకేతికత ప్రాధాన్యంత కీలకమని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికత పురోగతితో పారిశ్రామిక రంగాలు తగిన ప్రయోజనాలు పొందడం ప్రస్తుతం కీలకమని ఆయన సూచించారు. చదవండి: డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది: సీఎం జగన్ -
‘ఆశ్చర్యపోకండి.. మరో 20 ఏళ్లలో దేశ ప్రధానిగా కేటీఆర్’!
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో టీమ్ తెలంగాణ దూసుకుపోతుంది. తెలంగాణ తరఫున రాష్ట్ర మంత్రి కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యదక్షతలో కేటీఆర్ చూపిస్తున చొరవ, ఆయనకున్న విజన్‌ను కొనియాడుతూ ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని ట్విటర్లో ప్రశంసలు కురిపించారు. మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోను షేర్ చేసిన మోత్వాని... రాబోయే ఇరవై ఏళ్లలో ఈ దేశానికి కేటీఆర్ ఈ దేశానికి ప్రధాన మంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. కేటీఆర్ తరహాలో ఆలోచనల్లో స్పష్టత, దాన్ని అర్థమయ్యేలా విడమరిచి చెప్పగలిగే కళ ఉన్న యువ రాజకీయ నేతలను నేను ఇప్పటి వరకు చూడలేదన్నారు. దావోస్‌లో తెలంగాణ టీమ్ దుమ్ము రేపుతోంది. వాళ్లను చూస్తుంటే ఈ రోజు బిలియన్ డాలర్ల వ్యవస్థగా విస్తరించిన సిలికాన్ వ్యాలీ స్టార్టప్‌గా ఉన్న రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ ఆమె పేర్కొన్నారు. 20 years from now, don’t be surprised if KTR becomes PM of India. I have never seen a young politician with such clarity of vision and expression. Telangana team is on fire in Davos. They remind me of a silicon valley start up - will likely go back w $billions in future deals. pic.twitter.com/ae1rT8jXwy — Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) May 23, 2022 ఏంజెల్ ఇన్వెస్టర్ ఆశా జడేజా మోత్వాని కామెంట్లు నెట్టింట వైరల్‌గా మారాయి. అనేక మంది కేటీఆర్ పనితీరును ఆయన విజన్‌ను మెచ్చుకుంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. మోత్వాని ట్వీట్‌ను రీట్వీట్ చేస్తున్నారు. ఆశా జడేజా విషయానికి వస్తే ఆమె 2000లో సిలికాన్ వ్యాలీలో స్టార్టప్ ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 200లకు పైగా టెక్ కంపెనీల్లో ఆమె పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆమె చేపడుతున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ వస్తా.. అప్పుడు మాట్లాడుకుందాం.. -
CM Jagan Davos Tour: దావోస్‌కు పయనమైన సీఎం వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్‌కు పయనమయ్యారు. నేటి రాత్రికి (శుక్రవారం) దావోస్ చేరుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికారులు బృందం పాల్గొనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో సీఎం జగన్ పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా.. ఈ సందర్భంగా.. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించనున్నారు. పారిశ్రామికీకరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నంతో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ద్వారా నాలుగో పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు. అటు.. బెంగళూరు-హైదరాబాద్, చెన్నై- బెంగుళూరు, విశాఖపట్నం- చెన్నై కారిడార్లలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ సదస్సు ద్వారా వివిధ పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని దావోస్ వేదికగా సీఎం నేతృత్వంలోని మంత్రులు, అధికారుల బృందం వివరించనుంది. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను అధిగమించేందుకు చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామం కానుంది. కాలుష్యం లేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా అడుగులు వేయాలన్న కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే అంశాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో సీఎం బృందం వివరించనుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్ కనెక్టివిటీ, రియల్ టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌లకు పారిశ్రామికీకరణలో చోటు కల్పించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీనిపై విస్తృతంగా జరిగే చర్చల్లో రాష్ట్ర బృందం పాల్గొననుంది. దావోస్ సదస్సులో వివరించే అంశాలతో ఏపీ పెవిలియన్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పీపుల్-ప్రోగ్రెస్-పాజిబిలిటీస్ నినాదంతో ఈ పెవిలియన్ నిర్వహిస్తోంది. వాస్తవానికి ఈ సమ్మిట్ గత డిసెంబర్లో జరగాల్సి ఉంది. కరోనా కేసులు పెరగడంతో సమ్మిట్‌ను వాయిదా వేశారు. చదవండి: ‘స్వతంత్ర’ న్యూస్ చానల్ స్టూడియోలు ప్రారంభం -
సీఎం వైఎస్ జగన్‌కు ఎకనామిక్ ఫోరం ఆహ్వానం
-
వరల్డ్ ఎకనమిక్ ఫోరం.. 5 భారతీయ స్టార్టప్‌లు..
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కి సంబంధించిన టెక్నాలజీ పయోనీర్స్ కమ్యూనిటీలో ఈ ఏడాది కొత్తగా 100 స్టార్టప్‌లు చేరాయి. వీటిలో భారత్‌కు చెందిన అంకుర సంస్థలు అయిదు ఉన్నాయి. వాహన్, స్మార్ట్‌కాయిన్ ఫైనాన్షియల్స్, రీసైకల్, ప్రోయియాన్, ప్యాండోకార్ప్ ఈ జాబితాలో ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ఈ కమ్యూనిటీలో చేరడం ద్వారా స్టార్టప్‌లకు .. కొత్త టెక్నాలజీల పురోగతిని ప్రదర్శించేందుకు వీలవుతుందని వివరించింది. ఎంపికైన స్టార్టప్‌లకు డబ్ల్యూఈఎఫ్ వర్క్‌షాప్‌లు, కార్యక్రమాలు, అత్యున్నత స్థాయి చర్చలు మొదలైన వాటిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, కిక్‌స్టార్టర్, మొజిల్లా, స్పాటిఫై వంటి కంపెనీల సరసన ఇవి కూడా చేరతాయి. మే 22–26 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ లిస్టును ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్ పయోనీర్స్ జాబితాలో 30 దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఉన్నాయి. చదవండి: India 100 Unicorn Startups: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం -
DAVOS 2022: దావోస్ పర్యటనకు సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్‌లో(స్విట్జర్లాండ్) పర్యటించనున్నారు. వచ్చే నెల మే 22 తేదీన దావోస్‌కు వెళ్లనున్న సీఎం జగన్.. వారం రోజుల పాటు పర్యటిస్తారు. అంతేకాదు అక్కడ జరగబోయే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ లో పాల్గొంటారు. -
కరోనాతో కొత్తగా 16 కోట్ల మంది నిరుపేదలు
న్యూఢిల్లీ/దావోస్: కరోనా సంక్షోభంతో ప్రపంచదేశాలు ఆర్థికంగా కునారిల్లినప్పటికీ అపరకుబేరుల సంపద పెరిగిపోతూనే ఉంది. పేదలు నిరుపేదలుగా మారుతూ ఉండటంతో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభించిన ఈ రెండేళ్ల కాలంలో మరో 16 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలోకి కూరుకుపోయారని పేదరిక నిర్మూలనకు పాటుపడే స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ అధ్యయనంలో వెల్లడైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్ సంస్థ ఆర్థిక అసమానతలపై వార్షిక నివేదిను ‘‘ఇన్‌ఈక్వాలిటీ కిల్స్’’పేరుతో విడుదల చేసింది. కరోనా మహమ్మారి బిలియనీర్ల పాలిట బొనాంజాగా మారిందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొంది. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక హింస నెలకొంది. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యేలా ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తున్నాయి. దీని కారణంగా నిరుపేదలు చితికిపోతున్నారు. ఇప్పటికైనా ధనవంతులపై మరిన్ని పన్నులు వేసి వారి సంపదను వెనక్కి తీసుకువస్తే ఎందరి ప్రాణాలనో కాపాడిన వారు అవుతారు’’అని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాబ్రియెలా బచర్ వ్యాఖ్యానించారు. బిలియనీర్లు జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్, బిల్ గేట్స్ సహా ప్రపంచంలోని టాప్–10 జాబితాలో ఉన్న వారి ఒక్క రోజు సంపాదన దాదాపుగా 130 కోట్ల డాలర్లు (రూ 9,658 కోట్లు) ఉంది. ► ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన 10 మంది సంపాదన 70 వేల కోట్ల డాలర్లు (రూ. 52 లక్షల కోట్లు) నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లుకు (రూ. 111 లక్షల కోట్లకు పై మాటే) చేరుకుంది. ► ప్రపంచంలోని నిరుపేదలైన 310 కోట్ల మంది కంటే ఈ పది మంది ఆరు రెట్లు అధిక సంపన్నులు ► ఆర్థిక అసమానతలు ప్రపంచవ్యాప్తంగా రోజుకి సగటున 21 వేల మంది ప్రాణాలను తీస్తున్నాయి. 310 కోట్ల మంది నిరుపేదల కంటే 10 మంది కుబేరుల సంపాదనే ఎక్కువ భారత్‌లో 84% కుటుంబాల ఆదాయం తగ్గింది భారత్‌లో కరోనా మహమ్మారి కుటుంబాలను ఆర్థికంగా ఛిద్రం చేసింది. 2021లో దేశంలోని 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయి ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. అదే సమయంలో కోటీశ్వరుల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద రికార్డు స్థాయిలో ఏడాదిలోనే రూ.57.3 లక్షల కోట్లకు (77,500 కోట్ల అమెరికా డాలర్లు) చేరుకుంది. జనాభాలో ఆర్థికంగా దిగువన ఉన్న 50 శాతం జనాభా జాతి సంపదలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. ► భారత్‌లో కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య ఏడాదిలో 39% పెరిగింది. వందకోట్లకు పైగా ఆస్తి ఉన్న కోటీశ్వరులు 102 నుంచి 142కి పెరిగారు ► భారత్‌లో టాప్–10 కోటీశ్వరుల దగ్గరున్న సంపదతో దేశంలో ఉన్న పిల్లలు ప్రాథమిక, ఉన్నత విద్యకూ కావల్సిన నిధులను 25 ఏళ్ల పాటు సమకూర్చవచ్చును. ► టాప్– 10 కోటీశ్వరులు రోజుకు రూ. 7.42 కోట్లు ఖర్చు పెట్టినా... వారివద్ద ప్రస్తుతమున్న ఆస్తి మొత్తం హరించుకుపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. ► కోటీశ్వరుల్లో 10 శాతం మందిపై అదనంగా ఒక్క శాతం పన్ను వసూలు చేస్తే 17.7 లక్షలు అదనంగా ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చు. ► 98 మంది బిలియనీర్లపై ఒక్క శాతం అదనంగా పన్ను వసూలు చేస్తే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఏడేళ్లకు పైగా నడపడానికి నిధులు సమకూరుతాయి. ► కరోనా సంక్షోభ సమయంలో భారత్‌లో మహిళల్లో 28 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు. మూడింట రెండొతుల ఆదాయాన్ని కోల్పోయారు. -
దావోస్ సదస్సుపై ఒమిక్రాన్ నీడ!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలపై తన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సోమవారం తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్‌లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్‌లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు,పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు పాల్గొంటారు. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ భయాలతో 2022 సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, సీఈఓలుసహా దాదాపు 100కిపైగా భారత్ నుంచి 2022 సదస్సులో పాల్గొనడానికి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నారు. -
డబ్ల్యూఈఎఫ్ సదస్సు రద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 2021లో నిర్వహించాల్సిన తమ వార్షిక సదస్సును రద్దు చేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది. తదుపరి సదస్సు 2022 ప్రథమార్ధంలో నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఎక్కడ, ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని డబ్ల్యూఈఎఫ్‌జీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ తెలిపారు. ఈ సదస్సు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. రెండు సార్లు వేదిక మారింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగాల్సింది. కానీ పలు కారణాలతో స్విట్జర్లాండ్‌లోనే ఉన్న లూసెర్న్ నగరానికి వేదికను మార్చారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో నిర్వహించేలా సింగపూర్‌కి వేదిక మారింది. ఏటా దావోస్‌లో జరిగే ఈ సదస్సును 2002లో న్యూయార్క్ సిటీలో నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు స్విట్జర్లాండ్ కాకుండా మరో దేశంలో నిర్వహించాలని భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ప్రణాళికలు మార్చుకోవాల్సివచ్చింది. -
ప్రారంభ దశలోనే ఏఐ టెక్నాలజీ
న్యూఢిల్లీ: దేశంలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ప్రారంభ దశలోనే ఉందని.. దాని నిజమైన సామర్థ్యం అందుబాటులోకి రావడానికి మరో 10–20 ఏళ్ల కాలం పడుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. భవిష్యత్తులో కరోనా తరహా అంటు వ్యాధులు వైరస్‌లను పరిష్కరించడంలో ఏఐ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వర్చువల్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 ఎంత కల్లోలాన్ని సృష్టిస్తోందో అదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పనితీరుకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా సాంకేతిక పురోగతి పునాదిపై ఆధారపడి టీకాల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో కంప్యూటిక్, మిషన్ లెర్నింగ్, ఆల్గరిథం వంటి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడగలవని.. కాకపోతే అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వందల సంవత్సరాలలో జరిగిన ప్రపంచ విపత్తు సంఘటన అయిన కోవిడ్–19 గురించి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో ఏఐ కీలకమైందని.. దీనికి ఎన్నో శాస్త్రీయ ఉదాహరణలున్నాయన్నారు. ‘‘ఏ ఒక్క దేశం కూడా ప్రపంచ విపత్తులను ఒంటరిగా పరిష్కరించలేదు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి గ్లోబల్ పారిస్ ఒప్పందం ఉన్నట్టుగానే.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికత పరిజ్ఞానాల ద్వారా పెద్ద, దీర్ఘకాలిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని’’ పిచాయ్ సూచించారు. -
ఆ 63 మంది కుబేరుల ముందు... బడ్జెట్ దిగదుడుపు!
దావోస్: పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018–19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ దీన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది. ‘అసమానతలను తొలగించే కచ్చితమైన విధానాలు లేకుండా సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాస సమస్యలను పరిష్కరించడం కుదరదు. కానీ చాలా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఈ దిశగా కృషి చేస్తున్నాయి‘ అని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. 24 వరకూ జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ నుంచి పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. నివేదికలోని మరికొన్ని ఆసక్తికర అంశాలు.. ► టెక్నాలజీ సంస్థ సీఈవో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఆర్జించాలంటే సాధారణ మహిళా పనిమనిషికి 22,277 ఏళ్లు పడుతుంది. ఆమె ఏడాది సంపాదనను.. సెకనుకు రూ. 106 చొప్పున టెక్ సీఈవో 10 నిమిషాల్లో సంపాదిస్తున్నారు. ► మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ. ► సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు. ► అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ. ► వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది. సోషల్ మొబిలిటీలో అట్టడుగున భారత్.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన కొత్త సూచీలో .. 82 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిల్చింది. అయితే, దీన్ని మెరుగుపర్చుకోగలిగితే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ విషయాల్లో డెన్మార్క్ టాప్‌లో ఉంది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు ప్రారంభం... ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరవుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ ఈ సందర్భంగా ఆహూతులకు స్వాగతం పలికారు. ‘ఈ 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్న అన్ని దేశాలు, భాగస్వాములు, సభ్యులు, సాంస్కృతిక సారథులకు, యువ నేతలకు స్వాగతం‘ అని ఆయన పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సహా పలువురు ప్రముఖులకు క్రిస్టల్ అవార్డ్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. మానసిక ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు కృషి చేసినందుకు గాను పదుకొణె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ దేశాల నుంచి 3,000 పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు. -
రేపటి నుంచి దావోస్ సదస్సు
దావోస్: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్దేవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, ఎన్ చంద్రశేఖరన్, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్, నందన్ నీలేకని, అజయ్ పిరమల్ సహా 100కు పైగా భారత సీఈవోలు మంగళవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తదితర దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆదాయ అసమానతలు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ వైపరీత్యాల విషయంలో దేశాల భిన్న ధోరణులు తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. వ్యాపారాలు తమ వాటాదారులకే కాకుండా, సామాజిక ప్రయోజనాల కోసం కూడా పనిచేయాలన్న విధానాన్ని 1973 నాటి దావోస్ మేనిఫెస్టో పేర్కొనగా, దీని ప్రగతిపై ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రానున్న దశాబ్దంలో లక్ష కోట్ల మొక్కలను నాటాలని, నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం 100 కోట్ల మందికి అవసరమైన నైపుణ్యాలు కల్పించాలన్నది సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సదస్సులో మానసిక ఆరోగ్యంపై నటి దీపిక పదుకునే ప్రసంగం ఇవ్వనున్నారు. సద్గురు ప్రాణాయామ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జీరో ఎమిషన్స్ లక్ష్యానికి కట్టుబడాలి... 2050 లేదా అంతకుముందుగానే కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు(జీరో కార్బన్ ఎమిషన్స్) సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్‌ష్వాబ్ కోరారు. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలను ఆచరణలో పెట్టాలని కోరుతూ సభ్య దేశాలను ఓ లేఖ రూపంలో ఆయన కోరారు. కాగా, ప్రకృతిపై వ్యాపార ధోరణి పెరిగిపోతున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రకృతిపై పెట్టుబడులు 44 ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని, ప్రపంచ జీడీపీలో ఇది సగానికి సమానమని వార్షిక సదస్సుకు ముందుగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూటీఎఫ్ తెలిపింది. చైనా, ఈయూ, అమెరికాలు ప్రకృతిపై ఎక్కువ పెట్టుబడులను కలిగిన దేశాలుగా ప్రస్తావించింది. -
ఈసారి ‘దావోస్’కు భారీ సన్నాహాలు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సు కోసం భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి 24 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ఈ సదస్సులో భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోలు, పలువురు రాజకీయ నేతలు, దీపికా పదుకునె వంటి బాలీవుడ్ స్టార్స్ పాల్గోనున్నారు. ప్రపంచ దేశాలు సమష్టిగా, నిలకడగా వృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈసారి దావోస్ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. డబ్ల్యూఈఎఫ్ 50వ వార్షిక సదస్సు కావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హాజరు కావొచ్చని అంచనాలు ఉన్నాయి. గతేడాది జరిగిన సదస్సులో వీరిద్దరూ పాల్గొనలేదు. ఈసారి సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది దిగ్గజ నేతలు హాజరవుతారని భావిస్తున్నారు. భారత్ నుంచి పేర్లు నమోదైన వారిలో పారిశ్రామిక దిగ్గజాలు ముకేష్ అంబానీ, గౌతమ్ అదాని, కుమార మంగళం బిర్లా, సజ్జన్ జిందాల్, నందన్ నీలేకని, అజయ్ పిరమల్ తదితరులు ఉన్నారు. మానసిక స్వస్థతపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కూడా ఇందులో పాల్గోనున్నారు. ఆర్థికంగా ఉన్నతవర్గాలు తమకు ద్రోహం చేస్తున్నారనే ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు వస్తోందని, మరోవైపు గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యాలు నెరవేరడం లేదని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపక చైర్మన్ క్లాస్ ష్వాబ్ పేర్కొన్నారు. ఆ స్విస్ ఖాతాల్లో నిధులు స్విట్జర్లాండ్ ఖజానాకు.. క్లెయిమ్ చేసుకోవడానికి చాన్నాళ్లుగా ఎవరూ ముందుకు రాకపోవడంతో భారతీయులకు చెందిన సుమారు పది ఖాతాల్లోని సొమ్ము.. స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఖజానాకు దఖలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌మనీని కట్టడి చేసే క్రమంలో నిద్రాణ స్థితిలో ఉన్న ఖాతాల వివరాలను 2015 నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడిస్తోంది. అవసరమైన ఆధారాలను సమర్పించి ఖాతాలను పునరుద్ధరించుకోవాలని ఖాతాదారులకు సూచిస్తోంది. వీటిలో భారతీయులకు చెందిన ఖాతాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో కొన్నింటికి క్లెయిమ్ గడువు ఈ నెల, వచ్చే నెలతో తీరిపోనుంది. లీలా తాలూక్దార్, చంద్రలతా ప్రాణ్‌లాల్ పటేల్, మోహన్‌లాల్ మొదలైన వారి పేర్లతో ఈ ఖాతాలు ఉన్నాయి. -
హెచ్చార్డీ మంత్రిగా వారుంటేనే మంచిది : ఆర్బీఐ మాజీ గవర్నర్
దావోస్ : భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ విద్యావిధానంలో సమూల మార్పులు రావాల్సిన అవసరముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ‘మనం యువతరాలను మాత్రమే నిర్మించగలుగున్నాం. కానీ, ప్రపంచంతో పోటీ పడేవిధంగా వారిని తయారు చేయలేకపోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. దేశ భవిష్యత్‌కు అతి ముఖ్యమైన ‘మానవ వనరుల అభివృద్ధి’ అనే అంశాన్ని సరిగా పట్టించుకోవడం లేదన్నారు. మానవ వనరుల అభివృధ్ది శాఖ (హెచ్చార్డీ)కు అత్యంత సమర్థులు మంత్రిగా కొనసాగాలని ఆకాక్షించారు. నాణ్యమైన విద్యతోనే భారత యువత అన్ని రంగాల్లో దూసుకుపోతుందని చెప్పారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) లో పాల్గొనేందుకు వచ్చిన రాజన్ ఓ జాతీయ మీడియాతో ఈ విషయాలు వెల్లడించారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్‌లో భారత్ చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దాటిపోవచ్చు. మౌలిక వసతుల కల్పనలో ఆ దేశం కంటే మెరుగైన స్థానంలో నిలవొచ్చునని, దేశాల మధ్య ఇలాంటి పోటీ మంచిదే’ అని రాజన్ అన్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పాటు పనిచేసిన సంగతి తెలిసిందే. -
‘సీఎం విమానం ఎక్కేలోపు.. క్లారిటీ ఇవ్వాలి’
సాక్షి, విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన ఏ మీటింగ్ కోసం వెళుతున్నారో క్లారిటీగా చెప్పాలని బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు అమెరికా టూర్‌పై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు పెడుతున్న సమావేశంకు వెళ్తూ ఐక్యరాజ్య సమితి సమావేశానికి వెళ్తున్నామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఐరాసలో ఏ మీటింగ్‌కు సీఎం వెళ్తున్నారో వారు పంపిన ఇన్విటేషన్ ఏమిటో బయట పెట్టాలన్నారు. చంద్రబాబు విమానం ఎక్కేలోపు అమెరికా టూర్‌పై స్పష్టతనివ్వాలన్నారు. ఎకనామిక్ ఫోరమ్ వారు పెడుతున్న సమావేశానికి ఐక్యరాజ్యసమితికి ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఏపీలో బూటకపు పాలన ఏపీలో టీడీపీ ప్రభుత్వం బూటకపు పాలన సాగిస్తోందని జీవిఎల్ మండిపడ్డారు. రామాయపట్నం పోర్టును మైనర్ పోర్టుగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందని ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలు, ప్రజలు వ్యతిరేకించేసరికి టీడీపీ నాయకులే పోర్టు దగ్గరికి వెళ్లి డ్రామాలు ఆడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కాగ్ ఇచ్చిన నివేదికపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవినీతిని బయట పెడితే వారిని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వలనే గోదావరి పుష్కరాల్లో మరణాలు సంభవించాయని ఆరోపించారు. చంద్రబాబు తను చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకే మీడియా, భక్తుల మీదకు తప్పును నెట్టేస్తున్నారని జీవిఎల్ విమర్శించారు. -
ఆ మూడూ ప్రమాదకరం!
దావోస్ : ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, రక్షణాత్మక వ్యాపార ధోరణులు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటోన్న అతిపెద్ద ముప్పులుగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులంటూ కొందరు చేస్తోన్న తప్పుడు విభజన కూడా ఉగ్రవాదంతో సమానమేనని ఆయన హెచ్చరించారు. వాతావరణ మార్పులపై అభివృద్ధి చెందిన దేశాలవి కేవలం మాటలేనని, అవి చిన్న దేశాలకు సాయపడడం లేదని విమర్శించారు. కొన్ని దేశాలు రక్షణాత్మక వ్యాపార ధోరణి అవలంబించడం ప్రమాదకరమన్న ప్రధాని.. ప్రపంచీకరణ ప్రాభవం రోజురోజుకూ తగ్గుతోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో భారత్‌లో మాత్రం రెడ్‌టేప్(పరిశ్రమలకు అనుమతులివ్వడంలో అలవికాని జాప్యం) స్థానంలో రెడ్ కార్పెట్ తీసుకువచ్చామన్నారు. స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వత శ్రేణుల్లోని విడిది కేంద్రం దావోస్‌లో నిర్వహిస్తోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో మోదీ మంగళవారం కీలక ప్రారంభోపన్యాసం చేశారు. ఈ ప్రసంగంతో డబ్ల్యూఈఎఫ్ ప్రారంభ ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా నిలిచిన మోదీ ‘విరోధాలు, విభేదాలు లేని.. సహకారంతో కూడిన స్వేచ్ఛాయుత స్వర్గాన్ని కలిసికట్టుగా నిర్మించాలి’ అని ప్రపంచ దేశాలకు సూచించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. వాతావరణ మార్పులపై...: మన సంస్కృతిలో ప్రకృతిని మనం తల్లిగా భావిస్తాం. పారిస్ ఒప్పందం మేరకు మన అభివృద్ధి ప్రక్రియ పర్యావరణ పరిరక్షణకు లోబడి ఉంటుందని మనం హామీనిచ్చాం. వాతావరణ మార్పుల విషయంలో మన బాధ్యతల్ని గుర్తెరగడమే కాకుండా.. ఆ దుష్పరిణామాల్ని అడ్డుకునేందుకు ముందడుగు వేయాలి. తీవ్రమైన వాతావరణ మార్పులతో మంచు ఖండాలు కరిగిపోతున్నాయి. ప్రతికూల వాతావరణం వల్ల కొన్ని ద్వీపాలు మునిగిపోతుండగా.. కొన్ని మునిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ఏం చేయాలో ప్రపంచం ఆలోచించాలి. పర్యావరణం పట్ల శ్రద్ధ భారతదేశ సంస్కృతిలో భాగం. దేనినైనా తన దురాశ కోసం వాడుకోవడానికి మహాత్మా గాంధీ వ్యతిరేకం. వాతావరణం విషయంలో చిన్న దేశాలకు సాయం చేసేందుకు ఎన్ని అభివృద్ధి చెందిన దేశాలు సిద్ధంగా ఉన్నాయనేది కూడా ప్రశ్నే. కర్బన ఉద్గారాల్ని తగ్గించాలని ప్రతి ఒక్కరూ మాటలు చెపుతున్నారు. కొత్త సాంకేతికత సాయంతో చిన్న దేశాలకు సాయం చేసేందుకు మాత్రం ధనిక దేశాలు సిద్ధంగా లేవు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేద్దాం.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదకరమని నేను గట్టిగా చెప్పగలను. మంచి ఉగ్రవాదులు, చెడు ఉగ్రవాదులంటూ కొందరు చేస్తోన్న తప్పుడు విభజన కూడా ఉగ్రవాదంతో సమానమే. మనమందరం ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలి. ఉగ్రవాదంపై పోరాడే శక్తులకు భారత్ అండగా ఉంటుంది. రిఫామ్.. పెర్ఫామ్.. ట్రాన్స్ఫామ్! సంస్కరణలు (రిఫామ్), ఉత్తమ ప్రదర్శన (పెర్ఫామ్), సానుకూల మార్పే(ట్రాన్స్ఫామ్) మా మంత్రం.. మా మార్గం. పెట్టుబడులకు మా ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచింది. అనుమతుల్లో అలసత్వాన్ని తొలగించాం. విప్లవాత్మక నిర్ణయాలు, అభివృద్ధి కేంద్రంగా సాగే విధానాల్ని మా ప్రభుత్వం ఎంచుకుంది. భారత్‌లో పెట్టుబడుల అనుమతులు, ఉత్పత్తి విధానాల్ని చాలా సులభతరం చేశాం. లైసెన్స్, పర్మిట్ రాజ్‌ను తొలగించాలని నిర్ణయించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కొద్దీ సంస్కరణల్ని చేపడుతున్నాయి. దేశ పురోగతికి అడ్డుగా ఉన్న 1400 పాత చట్టాల్ని తొలగించాం. సంఘటిత, ఐక్యతా విలువల పట్ల బలమైన నమ్మకముంది డబ్ల్యూఈఎఫ్ నినాదం ‘ముక్కలైన ప్రపంచంలో ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణం’. ప్రస్తుతం ప్రపంచంలోని చీలికలు, విభేదాల పరిష్కారానికి భారతదేశ తత్వమైన వసుధైక కుటుంబం(ప్రపంచమంతా ఒకే కుటుంబం) చక్కగా సరిపోతుంది. భారతదేశం ఎప్పుడూ ప్రపంచ శాంతి కోసం పాటుపడింది. సంఘటితం, ఐక్యతా విలువల పట్ల భారత్‌కు నమ్మకముంది. మన సమాజంలోని కొన్ని విధ్వంసక శక్తులకు అభివృద్ధి, ప్రపంచ శాంతి, స్థిరత్వాల్ని అడ్డుకునే సామర్థ్యముంది. మనం సంఘటితంగా నిలిస్తే.. ఆ శక్తుల వల్ల వేరుపడ్డ సమాజాన్ని ఏకం చేయవచ్చు. భారత్‌లోని ప్రజాస్వామ్య విధానం కేవలం ఒక రాజకీయ వ్యవస్థ కాదు. అది జీవన విధానం. భారతదేశంలోని ప్రజాస్వామ్యం, భిన్నత్వాల్ని చూసి మేం గర్విస్తున్నాం. భిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, వస్త్రధారణలు, వంటలు మా సొంతం. అందరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యం 1997లో అప్పటి భారత ప్రధాని దేవెగౌడ దావోస్‌కు వచ్చిన సమయంలో భారత జీడీపీ 400 బిలియన్ డాలర్లు (రూ.26 లక్షల కోట్లు). అయితే ఇప్పుడు అది ఆరు రెట్లు పెరిగింది. 2025 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు(రూ.318 లక్షల కోట్లు) చేరనుంది. అందరికీ అభివృద్ధి ఫలాలు అందే లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేస్తున్నాం. 30 ఏళ్ల అనంతరం 2014లో భారతీయులు ఒక పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టారు. ఏ ఒక్క వర్గానికో కాకుండా అందరి అభివృద్ధి కోసం పాటుపడాలని మేం తీర్మానించుకున్నాం. మా నినాదం ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’. పథకం ఏదైనా అందరికీ అభివృద్ధి చేరడమే లక్ష్యం. ప్రస్తుతం సమాచార సాంకేతికతదే పై చేయి 1997 నుంచి ఈ 20 ఏళ్లలో ప్రపంచం ఎంతో మారిపోయింది. అప్పటి సదస్సులో ‘అనుసంధాన సమాజ నిర్మాణం’ డబ్ల్యూఈఎఫ్ నినాదం. ఇప్పుడు ప్రపంచం సమాచార కేంద్రంగా మారిపోయింది. ఎన్నో కొత్త ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. నాడు అమెజాన్ అంటే దట్టమైన అడవులనే అందరికీ తెలుసు. అప్పుడు పక్షులు మాత్రమే ట్వీటింగ్ (కిచకిచలు) చేసేవి. ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. ప్రస్తుత యుగంలో సమాచారమే నిజమైన సంపద. ఎవరికైతే దానిపై అదుపు ఉంటుందో భవిష్యత్తులో వారే ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. ఈ సమాచార వెల్లువ.. భారీ అవకాశాలే కాకుండా సవాళ్లను కూడా సృష్టిస్తోంది. సాంకేతికత ఆధారంగా చోటుచేసుకున్న మార్పులు ప్రజల ఆలోచనలు, పనితీరుతో పాటు అంతర్జాతీయ విభాగాలు, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ధనిక దేశాల రక్షణాత్మక ధోరణి చాలా దేశాలు సొంత ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రస్తుత సాంకేతిక అనుసంధాన ప్రపంచంలో ప్రపంచీకరణ ప్రాభవాన్ని కోల్పోతోంది. ప్రపంచీకరణ నుంచి తమను తాము కాపాడుకోవడంతో పాటు.. దానిని నీరుగార్చాలన్నది కొన్ని ధనిక దేశాల ఆకాంక్ష. ఉగ్రవాదం, వాతావరణ మార్పుల కంటే ఈ విధమైన రక్షణాత్మక ధోరణిని తక్కువ ప్రమాదకరంగా భావించలేం. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థలు ప్రపంచ ప్రజల ఆకాంక్షల్ని, కలల్ని ప్రతిబింబిస్తున్నాయా? అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. ‘నా ఇంటి తలుపులు, కిటికీలు మూసుకోవాలని నేను కోరుకోను. అన్ని దేశాల సంస్కృతులతో కూడిన పవనాలు నా ఇంట్లోకి రావా లని కోరుకుంటా. అదే సమయంలో అవి నా సంస్కృతిని పెకిలించేందుకు అనుమతించను’ అని జాతిపిత చెప్పారు. కెనడా ప్రధానితో మోదీ చర్చలు వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్యూతో మోదీ చర్చలు జరిపారు. ఇరు దేశాల పరస్పర ప్రయోజనాలపై వీరి మధ్య చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్విటర్లో వెల్లడించింది. నెదర్లాండ్స్ రాణి మాక్సిమాతో కూడా ఆయన భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్ సదస్సు అనంతరం ప్రధాని మోదీ మంగళవారం రాత్రి భారత్‌కు బయల్దేరారు. మరోవైపు ప్రధాని ఫిబ్రవరి రెండో వారంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, పాలస్తీనా దేశాల్లో పర్యటించనున్నారు. -
ఆర్థిక అసమానతలు.. ఆకలి కేకలు
డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్ హైదరాబాద్. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యంగా ఆరోగ్యం, పర్యావరణానికి సంబంధించిన అంశాలపై చర్చించేందుకు జెనీవా కేంద్రంగా ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) ఏర్పాైటైంది. వ్యాపార దిగ్గజాలు, అంతర్జాతీయ రాజకీయ నేతలు, ఎంపిక చేసిన మేధావులు, ఆర్థిక నిపుణులు, పాత్రికేయులు ఈ వేదిక నిర్వహించే శీతాకాల సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ఏటా లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా దేశాల్లో ఆరు నుంచి ఎనిమిది ప్రాంతీయ సమావేశాలు.. చైనా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో రెండు వార్షిక సమావేశాలను ఈ వేదిక నిర్వహిస్తుంది. 2014, జనవరి 22-25 మధ్య దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక 44వ వార్షిక సదస్సు జరిగింది. ప్రపంచ పునర్నిర్మాణం- సమాజం, రాజకీయం, వ్యాపారం (The Reshaping of the world consequences for society, politics, and business) ఇతివృత్తంతో సమావేశం జరిగింది. ఆర్థిక అసమానతల నేపథ్యంలో పెరుగుతున్న పేదరిక సమస్యకు పరిష్కారం చూపించే విషయంలో వేదిక విఫలమైందని చెప్పొచ్చు. ఈ సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలు... ఆర్థిక ప్రగతి - ఆశావాదం: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి ప్రగతిపట్ల జాగరూకతతో కూడిన ఆశావాదాన్ని ప్రపంచ ఆర్థిక వేదిక వ్యక్తపరుస్తుంది. స్వల్ప కాలంలో అంతర్జాతీయ వృద్ధి ప్రగతికి అనువైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వృద్ధిరేటులో ఒడుదుడుకులు సంభవిస్తున్నా యి. ప్రస్తుతం కొన్ని ఆర్థిక వ్యవస్థలలో ప్రోత్సాహకర వృద్ధి సంకేతాలున్నాయి. ఆయా ఆర్థిక వ్యవస్థలు అవలంబించిన విస్తరణ, ఆర్థిక విధానాలు దీనికి కారణమయ్యాయి. మరోవైపు వృద్ధితోపాటు ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా ఆయా ఆర్థిక వ్యవస్థలు పురోగమనాన్ని ప్రోత్సహించే విస్తరణ, ఆర్థిక విధానాలను విడనాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో ఆర్థిక వృద్ధిరేటు ప్రపంచ వ్యాప్తంగా సంతృప్తికరంగా లేదు. వేగవంతమైన మార్కెట్లలోనూ వృద్ధి క్షీణతను గమనించవచ్చు. అర్జెంటీనాలో పెసో (అర్జెంటీనా కరెన్సీ) సంక్షోభం కారణంగా 1997 నుంచి 2000 మధ్య కాలంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. వేతనాల పెరుగుదల, పతనమైన కరెన్సీ విలువ కారణంగా ైచె నా వృద్ధిరేటు మందగించింది. యూరోజోన్‌లో ముఖ్య దేశమైన ఫ్రాన్స్ బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. మరోవైపు జర్మనీ పటిష్టమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. యునెటైడ్ కింగ్డమ్ వృద్ధి అంచనాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు.. అభివృద్ధి చెందిన దేశాలలో ముఖ్యంగా అమెరికా, యుైనె టెడ్ కింగ్డమ్లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఇవి ఆయా ఆర్థిక వ్యవస్థలలో సామాజికరంగ అభివృద్ధితో పాటు ఆర్థిక సుస్థిరతకు అవరోధాన్ని కల్పించగలవు. అసమానతలు సమాజంలో నిరాశా నిస్పృహలను పెంచడం ద్వారా ఆర్థికవృద్ధి క్షీణతకు గురిచేస్తాయి. యువత తమకు భవిష్యత్ లేదని భావించినపుడు ఆయా దేశాలలో అశాంతి పెరిగి దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లగలదు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రధాన ఆర్థిక వేత్త జెన్నిఫర్ బ్లాంకే ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో మధ్య తరగతి ప్రజల ఆదాయం పెరుగుదలలో పాటు ధనిక, పేదల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు వేగంగా పెరిగాయి. అభివృద్ధి చెందిన, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో సాంఘిక అభద్రతా భావం (టౌఛిజ్చీ ఠట్ఛట్ట)పెరిగింది. దీనికి కారణం ఆర్థిక అసమానతలే. ఈ ఆర్థిక అసమానతలపై అవగాహన పెరగడం, పరపతి మార్కెట్ల వల్ల కొన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందడం; అధిక వ్యయంతో కూడిన విద్య అనేక దేశాల్లో సాంఘిక అభద్రతా భావం పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. ఆర్థిక అసమానతల కారణంగా పెరుగుతున్న పేదరిక తీవ్రతను వేదిక గుర్తించింది. 44వ సమావేశం- ముఖ్యాంశాలు: గుడ్ గవర్నెన్స్ ద్వారా లభించిన ప్రతిఫలంలో (డివిడెండ్) ఆఫ్రికా దేశాలు సాధించిన ప్రగతి, ఆర్థికాభివృద్ధి ముఖ్యమైనదని ఘనా అధ్యక్షుడు జాన్ మహమా అభివర్ణించారు. ఈ స్థితి ఘనాలో విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడుల పెరుగుదలకు దారి తీసిందన్నారు. అనేక ఆఫ్రికా దేశాలు సుస్థిరమైన గవర్నెన్స్ సాధించాయని ఆర్థిక వృద్ధి గురించి ఆలోచించే క్రమంలో రాజకీయ సుస్థిరత సాధించ డం ప్రధానమని నైజీరియా అధ్యక్షుడు గుడ్‌లక్ జోనాథన్ అన్నారు. యువతలో నిరుద్యోగితను తగ్గించే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల భాగస్వామ్య ఆవశ్యకతను రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా అధ్యక్షురాలు ఎలీన్ జాన్సన్ షర్లీఫ్ నొక్కి వక్కాణించారు. నైజీరియా ప్రభుత్వం ప్రారంభించిన ’్గ్ఖై గిఐూ’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.. స్వయం ఉపాధి పెంపుగా నైజీరియా ఆర్థికమంత్రి గోజీ యొకంజో ఇవియాలా పేర్కొన్నారు. యువత ఉపాధి కొరకు వేచిచూడకుండా వారే స్వతహాగా అవకాశాలను సృష్టించుకొని, ఇతరులకు కొలువులు చూపే దిశగా ప్రయత్నించాలని ఆయన ఉద్బోధించారు. పౌష్టికాహార లోపాన్ని నివారించే క్రమంలో 40 ప్రపంచ కంపెనీలు కలిసి పనిచేస్తాయని సదస్సులో ప్రకటించారు. 2020 నాటికి 127 మిలియన్ల మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోప నివారణకు కృషిచేస్తాయని ప్రకటించింది. ఆకలి నిర్మూలన (జీరో హంగర్) సాధించే క్రమంలో ప్రైవేటు రంగ పాత్రను వేదిక గుర్తించింది. ప్రపంచ ఆహార కార్యక్రమం అమల్లో ముఖ్య ప్రైవేటు రంగ భాగస్వాములైన రాయల్ డీఎస్ఎం, యునీలీవర్ సంస్థలు ఆకలి నిర్మూలనకు కట్టుబడి ఉండాలని వేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు కొత్త విధానపరమైన సవాళ్లను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డెరైక్టర్ క్రిస్టిన్ లగార్డే అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలన: 90వ దశకం తొలి భాగంలో మధ్య, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో ఆదాయస్థాయిలో తగ్గుదల కనిపించింది. సోవియట్ పతనం కారణంగా తలసరి స్థూల దేశీయోత్పత్తిలో క్షీణత ఏర్పడింది. ఫలితంగా పేదరిక తీవ్రత పెరిగింది. 2008లో 1.29 బిలియన్ ప్రజలు నిరపేక్ష పేదరికంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వీరిలో 400 మిలియన్ల ప్రజలు భారత్‌లోనూ, 173 మిలియన్ ప్రజలు చైనాలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నట్లుగా పేర్కొంది. సబ్ సహారన్ ఆఫ్రికాలో 2008లో 47 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం తీవ్ర పేదికరం ప్రపంచ సవాల్‌గా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో తీవ్ర పేదరికాన్ని గమనించవచ్చు. డెలాయిట్ సర్వే- 2014: రాబోయే దశాబ్దంలో ప్రపంచ శ్రామిక శక్తిలో అధిక వాటా ను కలిగియుండే యువత.. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సామర్థ్యంపై నమ్మకం కోల్పోయినట్లు డెలాయిట్ సర్వే అభిప్రాయపడింది. 28 దేశాలకు చెందిన 18-35 ఏళ్ల వయసున్న 8 వేల మంది అభిప్రాయాలను సర్వే కోసం క్రోడీకరించారు. అనేక దేశాల్లో వయోజనులతో పోలిస్తే యువ శ్రామికశక్తిలో నిరుద్యోగం రెండు నుంచి నాలుగు రెట్లు అధికంగా ఉంటుందని సర్వే పేర్కొంది. 2025 నాటికి ప్రపంచ శ్రామికశక్తిలో యువ శ్రామికశక్తి వాటా 75 శాతంగా ఉండగలదు. ఉపాధి, సంపదను పెంపొందించడం ద్వారా వ్యాపా రం సమాజంపై ధనాత్మక ప్రభావం చూపగలదని సర్వేలో పాల్గొన్న వారిలో 74 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రపంచ సంపద పంపిణీ- 1500 సంవత్సరం: తలసరి స్థూల దేశీయోత్పత్తి అంచనాల ప్రకారం ప్రపంచంలో 1500 సంవత్సరంలో ఐరోపా ప్రాంతాలు అత్యంత ధనిక దేశాలు. తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలలో స్థూల దేశీయోత్పత్తి ఎక్కువగా నమోదైంది. 1500 సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మధ్య ఆఫ్రికా, ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతాల్లో తక్కువగా నమోదైంది. ఈ ప్రాంతాలు 2000 తర్వాతి కాలంలోనూ తక్కువ స్థూల దేశీయోత్పత్తినే నమోదు చేసుకున్నాయి. ప్రపంచ జీడీపీలో ఆయా ప్రాంతాల వాటా ఇప్పటికీ తక్కువగానే ఉంది. ప్రపంచ ఆదాయ అసమానతలు: ప్రపంచ బ్యాంకు దత్తాంశం ఆధారంగా చేసుకొని, ‘ది కాన్ఫరెన్స్ బోర్డ్ ఆఫ్ కెనడా’ ప్రపంచ ఆదాయ అసమానతలను అంచనా వేసింది. ప్రపంచ ఆదాయంలో 42 శాతం ప్రపంచ జనాభాలో ధనికులైన 10 శాతం మంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నది. ప్రపంచ జనాభాలో 10 శాతం పేద ప్రజల వాటా ప్రపంచ ఆదాయంలో ఒక శాతం మాత్రమే. 80వ దశకం, 90వ దశకం మధ్య భాగంలో అనేక దేశాల్లో ఆదాయ అసమానతలు పెరగగా, 2000 తర్వాత ఈ అసమానతలు కొంతమేర తగ్గాయి. దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా దేశాలలో ఆదాయ అసమానతలు తక్కువ ఉండగా, అమెరికా, కెనడాలలో ఆదాయ అసమానతలు మధ్యస్థంగా ఉన్నాయి. 2011లో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలోనూ ఆదాయ అసమానతలు, అవినీతిని ప్రపంచ సవాళ్లుగా పేర్కొన్నారు. ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ మార్కెట్ వ్యవస్థల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అసమానతలు తగ్గినప్పటికీ అనేక దేశాల్లో వివిధ వర్గాల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగినట్లు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఫ్రీమన్ 2011 దావోస్ సమావేశంలో పేర్కొన్నారు. ఫోర్బ్స్ మేగజీన్ 2011లో ప్రపంచంలో 1210 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపదను 4.5 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. 2012తో పోల్చినప్పుడు 2013లో ధనికులైన 400 మంది అమెరికన్ల సంపదలో 19 శాతం పెరుగుదల నమోదైనట్లు ‘ఫోర్బ్స్’ తెలిపింది. 2012లో వీరి ఉమ్మడి సంపద 1.7 ట్రిలియన్ డాలర్లు కాగా, 2013లో 2.02 ట్రిలియన్ డాలర్లకు పెరిగిం ది. 2012లో ప్రతి వ్యక్తి సగటు నికర సంపద 4.2 బిలియన్ డాలర్లు కాగా 2013లో 5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రపంచంలో పురుషుల ఆదాయం మహిళల ఆదాయం కంటే రెండు రెట్లు మించి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ పురుషుల సంపాదన మహిళల కంటే ఎక్కువగా ఉంది. మహిళలు, పురుషుల మధ్య ఆదాయ అసమానతలు దక్షిణాసియాలో అధికం. ఈ ప్రాంతంలో పురుషుల సంపాదన మహిళల సంపాదన కంటే దాదాపు అయిదు రెట్లు ఎక్కువ. దక్షిణాసియాలో ఆదాయం పరంగా వీరి మధ్య వ్యత్యాసం తక్కువ. ఈ ప్రాంతంలో పురుషుల సంపాదన, మహిళల కంటే రెట్టింపు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆదాయంలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, చైనా రెండో స్థానంలో ఉంది. జనాభాలో అధిక వార్షిక ఆదాయం మహిళలకు సంబంధించి నార్వే, డెన్మార్క్‌లలో ఎక్కువ. ప్రపంచ బ్యాంకు 2008 నివేదిక ప్రకారం 1.29 బిలియన్ ప్రజలు నిరపేక్ష పేదరికంలో ఉన్నారు. వీరిలో 400 మిలియన్ల ప్రజలు భారత్‌లోనూ, 173 మిలియన్ ప్రజలు చైనాలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఆదాయంలో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, చైనా రెండో స్థానంలో ఉంది. జనాభాలో అధిక వార్షిక ఆదాయం మహిళలకు సంబంధించి నార్వే, డెన్మార్క్‌లలో ఎక్కువ.