న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్)కి సంబంధించిన టెక్నాలజీ పయోనీర్స్ కమ్యూనిటీలో ఈ ఏడాది కొత్తగా 100 స్టార్టప్‌లు చేరాయి. వీటిలో భారత్‌కు చెందిన అంకుర సంస్థలు అయిదు ఉన్నాయి. వాహన్, స్మార్ట్‌కాయిన్ ఫైనాన్షియల్స్, రీసైకల్, ప్రోయియాన్, ప్యాండోకార్ప్ ఈ జాబితాలో ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది. ఈ కమ్యూనిటీలో చేరడం ద్వారా స్టార్టప్‌లకు .. కొత్త టెక్నాలజీల పురోగతిని ప్రదర్శించేందుకు వీలవుతుందని వివరించింది.
ఎంపికైన స్టార్టప్‌లకు డబ్ల్యూఈఎఫ్ వర్క్‌షాప్‌లు, కార్యక్రమాలు, అత్యున్నత స్థాయి చర్చలు మొదలైన వాటిలో పాలుపంచుకునే అవకాశం లభిస్తుంది. ఎయిర్‌బీఎన్‌బీ, గూగుల్, కిక్‌స్టార్టర్, మొజిల్లా, స్పాటిఫై వంటి కంపెనీల సరసన ఇవి కూడా చేరతాయి. మే 22–26 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ లిస్టును ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్ పయోనీర్స్ జాబితాలో 30 దేశాలకు చెందిన స్టార్టప్‌లు ఉన్నాయి.
చదవండి: India 100 Unicorn Startups: ఒకప్పుడు స్టార్టప్‌ల అడ్డా .. ఇప్పుడు యూనికార్న్‌ల రాజ్యం
Comments
Please login to add a commentAdd a comment