ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్‌ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది.
ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు.
"మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్‌లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్‌కే ట్రాన్స్‌పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment