తెలంగాణ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ పర్యటన విజయవంతం అయినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 4 రోజుల్లో 52 వాణిజ్య, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలతో తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లు, గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్‌లో తమ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం విదితమే.
All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023
Comments
Please login to add a commentAdd a comment