Davos 2023
-
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతం, రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. పెట్టుబడులే లక్ష్యంగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ పర్యటన విజయవంతం అయినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. 4 రోజుల్లో 52 వాణిజ్య, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలతో తెలంగాణకు రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ ప్రకటించారు. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో మరో 3 డాటా సెంటర్లు, గ్లోబల్ మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్స్పైర్ బ్రాండ్స్ హైదరాబాద్‌లో తమ సపోర్ట్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం విదితమే. All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7 — KTR (@KTRTRS) January 21, 2023 -
చాట్‌జీపీటీ అద్భుతం.. నేను అడిక్ట్ అయ్యా : అదానీ
న్యూఢిల్లీ: కృత్రిమమేథలో (ఏఐ) సంచలనంగా మారిన చాట్‌జీపీటీపై పారిశ్రామిక దిగ్గజాలకు కూడా ఆసక్తి పెరుగుతోంది. తాజాగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కూడా ఈ జాబితాలో చేరారు. దీన్ని వాడటం మొదలుపెట్టినప్పటి నుంచి తనకూ ఇది కొంత వ్యసనంలా మారిందని అదానీ పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో అంతటా ఏఐ గురించే ప్రధానంగా చర్చ జరిగిందని లింక్డ్ఇన్లో అదానీ రాశారు. ఎంతో ఉపయోగకరమైన ఏఐ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు చాట్‌జీపీటీ తోడ్పడగలదని ఆయన తెలిపారు. జోకులు, పద్యాలు, వ్యాసాలు మొదలుకుని కంప్యూటర్ కోడింగ్ వరకు ఎలాంటి అంశం అయినా అనంతమైన సమాచారాన్ని క్రోడీకరించి యూజర్‌కు కావాల్సినట్లుగా కంటెంట్‌ను చాట్‌జీపీటీ అందిస్తుంది. యూజర్లతో అచ్చం మనుషుల్లాగే సందర్భోచితంగా సంభాషిస్తుంది. ఓపెన్ఏఐ రూపొందించిన ఈ చాట్‌బాట్ ప్రస్తుతం ఇంకా ప్రయోగదశలో ఉంది. చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా -
తెలంగాణలో అమెజాన్ భారీ పెట్టుబడులు.. ఏకంగా రూ.36వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటైన అమెజాన్ తమ అనుబంధ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ద్వారా హైదరాబాద్‌లో మరోసారి భారీ పెట్టుబడులు పెట్టనుంది. నగరంలో మూడు డేటా సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 20,096 కోట్ల పెట్టుబడి పెడతామని 2020లో ప్రకటించిన ఏడబ్ల్యూఎస్ తాజాగా తమ విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా 2030 నాటికి దశలవారీగా తమ పెట్టుబడులను రూ. 36,300 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. అంటే కొత్తగా మరో రూ. 16,204 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. శుక్రవారం నగరంలోని హెచ్ఐసీసీలో జరిగిన ‘ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్’లో ఆ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందించేందుకు ఏడబ్ల్యూఎస్ ఇప్పటికే చందన్వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్ల క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. వాటి మొదటి దశ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావడంతో వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ విస్తరణకు సహకరిస్తాం: మంత్రి కేటీఆర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ విస్తరణ, అదనపు పెట్టుబడి ప్రకటనను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు స్వాగతించారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు వెళ్లిన కేటీఆర్ అక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఏడబ్ల్యూఎస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్’లో ప్రసంగించారు. అమెజాన్ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ హబ్‌గా తెలంగాణ మారుతుందనే ఆశాభాశాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్ విస్తరణ ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్రానికి వస్తున్న అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇదొకటని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ–గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు ఏడబ్ల్యూఎస్‌తో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైదరాబాద్‌లోని ఏడబ్ల్యూఎస్ క్యాంపస్‌లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతోపాటు స్టార్టప్‌లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. -
వ్యాక్సిన్‌తో తగ్గని కరోనా.. ఫైజర్ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్‌లు!
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయిన ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్‌ను ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్‌ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు. మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్ డాలర్లు ఫైజర్‌కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్‌లో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది ఫైజర్. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్ కట్టడి వ్యాక్సిన్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్‌ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్ డోసులను ఫైజర్ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. 🚨WE CAUGHT HIM! Watch what happened when @ezralevant and I spotted Albert Bourla, the CEO of Pfizer, on the street in Davos today. We finally asked him all the questions the mainstream media refuses to ask. Full story: https://t.co/wHl204orrX SUPPORT: https://t.co/uvbDgOk19N pic.twitter.com/c3STW8EGH3 — Avi Yemini (@OzraeliAvi) January 18, 2023 -
హైదరాబాద్‌లో మరో మూడు డేటా సెంటర్లు: మైక్రోసాఫ్ట్
కొత్తగా మూడు డేటా సెంటర్లను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 16 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లను ఏర్పాటుచేస్తామని 2022 లో ప్రకటించిన మైక్రోసాఫ్ట్ కొత్తగా మరో 3 డేటా సెంటర్ లను ప్రారంభిస్తామని తెలిపింది. గత సంవత్సరం ప్రారంభంలో వంద మెగావాట్ల సామర్థ్యంతో మూడు డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మైక్రో సాప్ట్ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడి అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ సంఖ్యను రెట్టింపు చేస్తూ ఆరు డేటా సెంటర్ లను 100 మెగావాట్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాబోయే పది-పదిహేను సంవత్సర కాలంలో ఈ ఆరు డేటా సెంటర్ లు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తాయంది. క్లౌడ్ ఆధారిత మౌలిక వసతులను పెంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలన్న మైక్రోసాఫ్ట్ లక్ష్యంలో భాగంగా ఇంత భారీ పెట్టుబడిని పెడుతున్నామంది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో జరిగిన సమావేశంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ తమ విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వంతో అనేక రంగాల్లో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కొనసాగుతుందన్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న బంధం తాజా పెట్టుబడితో మరింత బలోపేతం అవుతుందన్నారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ, క్లౌడ్ అడాప్షన్ వంటి అంశాల్లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేస్తున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. మైక్రోసాఫ్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆరు డేటాసెంటర్ లు హైదరాబాద్ లోనే కేంద్రీకృతం కావడం ఎంతో సంతోషకరం అన్నారు. తెలంగాణ కేంద్రంగా మైక్రోసాఫ్ట్ మరింత అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇంత భారీ పెట్టుబడితో హైదరాబాద్ లో కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు మైక్రోసాఫ్ట్ సంస్థకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ నగరంతో మైక్రోసాఫ్ట్ అనుబంధం అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు మైక్రోసాఫ్ట్ ఆసియా హెడ్ అహ్మద్ మజారీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ మార్కెట్ లో హైదరాబాదే కీలకం అన్న అహ్మద్, భవిష్యత్తులోనూ ఈ నగరంలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. ఇండియా కేంద్రంగా మైక్రోసాఫ్ట్ చేపట్టే పలు ప్రాజెక్టులకు హైదరాబాద్ లో ఏర్పాటుచేయబోయే డేటాసెంటర్ లు అత్యంత కీలకంగా మారుతాయన్నారు. డేటా సెంటర్లతో పాటు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చేసేందుకు ఉన్న అవకాశాలను తమ సంస్థ సానుకూలంగా పరిశీలిస్తుందని అహ్మద్ మజారీ తెలిపారు.