Ram Charan Shares Work Experience With SS Rajamouli - Sakshi
Sakshi News home page

Ram Charan: చెల్లెలితో కలిసి స్విట్జర్లాండ్‌ వెళ్లిన రామ్‌చరణ్‌

Published Fri, Dec 3 2021 8:24 AM | Last Updated on Fri, Dec 3 2021 9:03 AM

Ramcharan Intresting Comments About Ss Rajamouli - Sakshi

Ramcharan Intresting Comments About Ss Rajamouli: అభిమానులకు సరప్రైజ్‌ ఇవ్వనున్నారు రామ్‌చరణ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో మూడు సరికొత్త లుక్స్‌లో కనిపించనున్నారాయన. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(రౌద్రం, రణం, రుధిరం). ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలవుతోంది.

కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్‌ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘‘రాజమౌళిగారితో పని చేయడం వల్ల కెరీర్‌ పరంగానే కాక జీవితంలో కూడా చాలా నేర్చుకోవచ్చు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామరాజు పాత్ర చేశాను. ఇందులో కథ పరంగా నా పాత్ర మూడు సరికొత్త లుక్స్‌తో ఉంటుంది.. మామూలుగా రాజమౌళిగారితో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్‌ చేయడం అంటేనే ఓ కలలాంటిది. అలాంటిది మూడు క్యారెక్టర్లంటే ఇంతకంటే పెద్దది, ఇంతకంటే గొప్పది నాకు దక్కదనిపిస్తోంది’’ అన్నారు. 

చిన్న బ్రేక్‌ 
‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఆచార్య’ సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన రామ్‌చరణ్‌ ఇటీవల శంకర్‌ సినిమా షూట్‌లో కూడా పాల్గొన్నారు. కాస్త సేద తీరడానికి షూటింగ్స్‌కి చిన్న బ్రేక్‌ ఇచ్చి, తన సోదరి శ్రీజతో కలసి స్విట్జర్లాండ్‌ వెళ్లారు. అక్కడి ఎత్తైన మంచు కొండల్లో నిలబడి రామ్‌చరణ్‌ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటో బయటికి వచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement