పర్యాటకులను అబ్బురపరిచే మంచు గుహ | Ice Cave That Forms Naturally In Swiss Alps | Sakshi
Sakshi News home page

పర్యాటకులను అబ్బురపరిచే మంచు గుహ

Published Fri, Dec 11 2020 4:47 PM | Last Updated on Fri, Dec 11 2020 5:33 PM

Ice Cave That Forms Naturally In Swiss Alps - Sakshi

పర్యాటకులను అబ్బురపరిచే మంచు గుహ(ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌)

స్విట్జర్లాండ్‌: స్విస్‌ ఆల్ఫైన్‌ పర్వతాల్లోని ఎత్తైన హిమానీనదం మీద సహజంగా ఏర్పడే మంచు గుహ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. నీలి రంగులో కనిపించే ఈ ప్రకృతి సోయగం పర్యాటకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మంచు గుహ పరిమాణం, ఆకారం ప్రతి ఏటా భిన్నమైన ఆకృతిని సంతరించుకుంటుంది. ఇది 5 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల పొడవు మందపాటి మంచుతో కప్పబడిన గుండ్రని పైకప్పును కలిగి ఉంటుంది. ఇక ఈ ఏడాది గుహ లోపలి భాగం చాలా చదునైనదిగా పర్యటకుల సందర్శనకు వీలుగా ఉంది. వేసవిలో మంచు కరిగి గుహ నీటితో నిండి ఒక సరస్సులా మారుతుంది. డయబిల్రేట్స్ రిసార్ట్ ముందుగా ఉన్న గ్లేసియర్ 3000 చైర్‌లిఫ్ట్ నుంచి 15 నిమిషాల్లో కాలినడకన మంచు గుహకు చేరుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

కానీ ఈ ప్రయాణంలో ఎవరికి వారే తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ‘‘మేము అధికారికంగా మొదటిసారి తెరిచాం. గత సంవత్సరంలాగే మంచు గుహ ఉ‍న్నప్పటికీ ఈసారి భిన్నంగా మరింత దృఢంగా ఉంది. మంచు కేథడ్రల్ లాగా ఇది అందంగా ఉంది’’ అని గ్లేసియర్‌ 3000 సీఈఓ బెర్న్‌హార్డ్ త్చన్నెన్ రాయిటర్స్‌తో అన్నారు. ఇది అద్భుతమైనదని, ఈ గుహ గురించి ఇంకా చెప్పడానికి మాటలు లేవు, నేను ఇలాంటిది జీవితంలో చూడలేదు. కొత్త ప్రపంచం చూసినట్టు చాలా అందంగా ఉంది. మీకు వెళ్ళే అవకాశం వస్తే నేను సిఫారసు చేస్తా అని సమీపంలో నివసిస్తున్న డచ్ మహిళ హెలెన్ ట్రంప్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement