బెర్న్: అబ్బో.. మనోడి స్టోరీ మామూలుగా లేదుగా. అచ్చం రాజమౌళి సినిమా బ్యాక్ డ్రాప్ లాగే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ స్టోరీ ఎవరిదా' అని అనుకున్నారా?! ఓ ఆటోవాలాది. టెన్త్ ఫెయిల్. కానీ త్వరలో సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. అదీ ఫ్రాన్స్‌లో
జైపూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రంజిత్ సింగ్ చిన్నవయస్సు నుంచే అనేక అవమానాల్ని ఎదుర్కొన్నాడు. స్థానికులు తన పేదరికంపై సూటిపోటి మాటలతో వేధించేవారు. పేదవాడిగా పుట్టడం నేరమా..? నేను నా పేదరికంతో పోరాడుతున్నాను. మీరు నన్ను మరింత కిందికి లాగుతున్నారంటూ వేధనకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎంత పేదరికంలో ఉన్నా తాను జీవితంలో ఏదో సాధించాలని కుటుంబ సభ్యులు రంజిత్ కు అండగా నిలిచారు. బాగా చదివించాలని స్కూల్ కి పంపించారు. కానీ రంజిత్ 10 పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం ఆటో డ్రైవర్‌గా మారాడు. కానీ ఏదో ఒకటి చేయాలనే సంకల్పం ఉంది. ఆ సంకల్పమే బిజినెస్ మ్యాన్ గా, ఫేమస్ యూట్యూబర్ గా మార్చేసింది. చదవండి: ఆమెకు 19 మంది భర్తలు..!
ప్రతిఏడు జైపూర్‌కు దేశ విదేశాలనుంచి టూరిస్ట్‌లు వస్తుండేవారు. టూరిస్ట్‌లను ఆకట్టుకునేందుకు స్థానిక ఆటో డ్రైవర‍్లు విదేశీ భాషల్ని నేర్చుకొని, వారికి టూరిస్ట్ గైడ్ గా ఉపాధి పొందేవారు. రంజిత్‌కు ఆ ఐడియా బాగా నచ్చింది. అదే ఐడియాతో విదేశీ భాషల్ని నేర‍్చుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. అయితే ఓ రోజు ఫ్రాన్స్ నుంచి ఓ యువతి జైపూర్ చూసేందుకు వచ్చింది. ఆ అమ్మాయి రంజిత్ సింగ్ ఆటో ఎక్కడం. జైపూర్ అంతా తన ఆటోలో తిప్పి చూపించడంతో వారిద్దరి మధ‍్య స్నేహం ప్రేమగా మారింది. ఆ యువతి తిరిగి ఫ్రాన్స్ కు వెళ్లిపోయింది. అప్పుడప్పుడు రంజిత్ ప్రియురాలితో వీడియో కాల్‌లో మాట్లాడేవాడు. అంతా బాగుందని రంజిత్ సింగ్ తన ఆశయాన్ని మర్చిపోలేదు. ఎలాగైనా ఫ్రాన్స్‌కు వెళ్లాలి. అక్కడే సెటిల్ అవ్వాలి. టెన్త్ ఫెయిల్. చేసేది ఆటోడ్రైవర్. అదెలాసాధ్యం అవుతుందని అనుకున్నాడు. ప్రియురాలి ప్రోత్సాహంతో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో చదువు లేదన్న కారణంతో వీసా రిజెక్ట్ చేశారు పాస్ పోర్ట్ అధికారులు. అదే సమయంలో ప్రియురాలు ఫ్రాన్స్ నుంచి ఇండియాకి రావడం. ఇండియాకు వచ్చిన వెంటనే ఎంబసీ అధికారుల్ని రిక‍్వెస్ట్ చేయడంతో రంజిత్‌కు ఫ్రాన్స్‌కు వెళ్లేందుకు మూడు నెలల విజిటింగ్ వీసా ఇచ్చారు. కోటి ఆశలతో విజిటింగ్ వీసాతో ఫ్రాన్స్ లోకి అడుగు పెట‍్టాడు.
అడుగుపెట్టిన వెంటనే రంజిత్ కు అక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లు బాగా నచ్చాయి. దీంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, యూట్యూబ్ లో ఫ్రాన్స్ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. మరోవైపు రెస్టారెంట్ లో జాబ్ చేస్తున్నాడు. 2014లో ప్రియురాల్ని వివాహం చేసుకున్న రంజిత్ కు కొడుకు కూడా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో స్విట్జర్ లాండ్ లోని జెనీవాలో రెస్టారెంట్‌ను స్టార్ట్ చేయాలనే కలను నెరవేర్చుకోబోతున్నాడు. ప‍్రస్తుతం ఈ ఆటోవాలా కథ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దీంతో అబ్బో మనోడి స్టోరీ రాజమౌళి సినిమాను మించిపోయిందే. రాజమౌళికి తెలిస్తే కచ్చితంగా సినిమా తీస్తారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment