కాంక్రీట్‌ దిమ్మెలే.. బ్యాటరీలు! | 8 MW Batteries Prepared By Energy Vault | Sakshi
Sakshi News home page

కాంక్రీట్‌ దిమ్మెలే.. బ్యాటరీలు!

Published Fri, Nov 12 2021 12:19 PM | Last Updated on Fri, Nov 12 2021 2:48 PM

8 MW Batteries Prepared By Energy Vault - Sakshi

ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది? భవన నిర్మాణం కోసం ఉంచిన కాంక్రీట్‌ దిమ్మెలు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే! ఎందుకంటే.. ఇవి స్విట్జర్లాండ్‌ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్‌’ గతేడాది సిద్ధం చేసిన 8 మెగావాట్ల బ్యాటరీలు!! కాంక్రీట్‌తో బ్యాటరీ ఏమిటని అనుకోకండి. నిజానికి ఇది చాలా సింపుల్‌. ఎలాగంటే డ్యామ్‌లలో ఉన్న నీళ్లు వేగంగా కిందకు జారుతూ టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి అవడం మనకు తెలుసు కదా. ఇది కూడా అలాగే కాకపోతే ఒక్క చిన్న తేడా ఉంది. 

విద్యుత్‌కు రాత్రిపూట డిమాండ్‌ ఎక్కువగా ఉంటే సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా పగటిపూట ఎక్కువ విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ అదనపు విద్యుత్‌ సాయంతో ఒక్కో కాంక్రీట్‌ దిమ్మెను క్రేన్ల ద్వారా పైకి ఎత్తుతారు. ఒక క్రమంలో పేర్చుకుంటూ వస్తారు. రాత్రిపూట విద్యుత్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దిమ్మెను కిందకు జారవిడిచి గతి శక్తిని కాస్తా విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఐడియా బాగుంది కదూ! ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చినా అన్ని అడ్డంకులను దాటుకొని వాణిజ్య స్థాయిలో ఓ టవర్‌ను ప్రారంభించేందుకు ‘ఎనర్జీ వాల్ట్‌’కు కొంత సమయం పట్టింది. చిత్రంలో ఉన్న ఏర్పాటు ద్వారా దాదాపు 8 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు.     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement