హోమ్‌మేడ్ ఫిల్మ్స్‌తో ఇంటర్నేషనల్ ఫేమ్ కావచ్చు...అని మరోసారి నిరూపించింది స్వీటువాయిస్ షెర్లీ. డామన్‌లో జన్మించిన షెర్లీ షెటియ స్విట్జర్లాండ్‌లో పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్లాండ్‌లో చదువుకునే రోజుల్లో పార్ట్–టైమ్ రేడియో జాకీగా పనిచేసింది. తాను పాడిన పాటలను సరదాగా యూట్యూబ్‌లో పోస్ట్ చేసేది. యూఎస్,యూకే, కెనడా, ఇండియాలలో ఉన్న ఎందరో కళాకారులతో ఆన్‌లైన్ వేదికగా కలిసి పనిచేసింది.
‘యూట్యూబ్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకొంది. ముంబైకి వచ్చేసిన తరువాత... హిందీ యాక్షన్ కామెడి ఫిల్మ్ ‘ఏ జెంటిల్మెన్’లో డిస్కో...డిస్కో, ‘మస్కా’ సినిమాలో ‘ఐవన హ్యాంగ్ విత్ యూ’....మొదలైన పాటలు షెర్లీకి ఎంతో పేరు తెచ్చాయి. ‘బాలీవుడ్ నెక్ట్స్ బిగ్ సింగింగ్ సెన్సేషన్’ అనిపించుకుంది. ప్రసిద్ధ టీ–సిరీస్ మిక్స్‌టేప్, ఎలక్ట్రో ఫోక్‌లకు పాడింది. ‘మన హృదయం చెప్పినట్లు నడుచుకుంటే విజయం మనదే’ అంటుంది షెర్లీ షెటియ.
చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి
Comments
Please login to add a commentAdd a comment